https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD

https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD
https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD

YOGA ASANAS 1

YOGA HEALTH

Saturday, June 29, 2019

భవ దారిద్య్రం - భావ దారిద్య్రం

భోజనం వడ్డించమని అడిగాడు పోతన తన భార్యతో. ఆమె చోద్యంగా చూస్తూ ‘అదేమిటండీ! ఇప్పుడే కదండీ భోజనం చేసి వెళ్లారు. మళ్లీ భోజనం అంటున్నారు? మళ్లీ అప్పుడే ఆకలయిందా’ అని నవ్వుతూ అడిగింది ఆ సాధ్వీమణి.
దిగ్భ్రమ చెందాడు పోతన. ఇదేమిటి? ఈవిడ ఇలా చెబుతోంది అని విస్మయంగా చూశాడు భార్య వైపు. ‘నేను భోంచేశానా?’ అని అడిగాడు. ‘అవును. కూర్చుని ఒక పద్యం కాబోలు వ్రాశారు. ఆపైన నేను భోజనం చేయమంటే చేశారు. మీరు తిన్న తర్వాత అలవాటు ప్రకారం, నేను మీరు తిన్న విస్తరిలోనే భోం చేశాను’ అంది.
‘ఏదీ నువ్వు తిన్న విస్తరి?’
‘బైట తొట్లో వేశాను’ అంది ఇల్లాలు.
బయటికి వచ్చి కుప్పతొట్లో చూశాడు. అప్పుడే ఒక కుక్క ఆ విస్తరిని నోటిలోకి లాక్కుని దొరకకుండా పరుగెత్తి పోయింది. ఇంట్లోకి వచ్చి కూర్చుని తను వ్రాస్తున్న చోట కూర్చుని చూశాడు. అక్కడ ఒక త్రాటియాకుపైన-
అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా/ పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోప లో/ త్పల పర్యంక రమావినోదియగు నాపన్న ప్రపన్నుండు వి/ హ్వల నాగేంద్రము పాహిపాహి యన కుయ్యాలించి సంరంభియై’
మొసలితో యుద్ధం చేస్తూ శక్తులుడిగి చేష్టలుల కోల్పోయిన నాగేంద్రము (గజశ్రేష్ఠుడు) ఈ జగత్తును ఎవరు సృష్టించి పరిరక్షిస్తుంటారో వారు కాపాడాలి అని ‘ఎవ్వనిచే జనించు’ ‘జగమెవ్వని లోపల నుండు లీనమై’ అని అర్థిస్తుంది, ప్రార్థిస్తుంది, అపుడు
‘ఆ వైకుంఠ నగరంలో సౌధంలో మూలన మందార వనామృత సౌరభంలో రమాదేవితో క్రీడిస్తున్న ఆపద్బాంధవుడైన మహావిష్ణువుకు ఆ గజేంద్రం యొక్క మొర వినిపించి, వెంటనే పూనుకుని ఉన్నపళాన ఆపద్రక్షకు డుపక్రమించినవాడై రక్షణకు!
దిగ్భ్రమతో పోతన కళ్ల వెంట ఆనందభాష్పాలు! ఆనందాతిరేకం! అంతలోనే దుఃఖాతిరేకం!
పరుగు పరుగున వచ్చి దిగ్భ్రమతో నిశే్చష్టుడయిన పోతనను చూసి కుదుపుతూ ‘స్వామీ స్వామీ!’ అని పిలిచింది ఆ పతివ్రతామతల్లి. తేరుకుని ఆమె భుజంపై తలవాల్చి మళ్లీ అమిత రోదనకు గురయ్యాడు పోతన. కాసేపు అతడిని దుఃఖింపనిచ్చి, ఆపైన ఓదారుస్తూ ‘ఏం జరిగింది నాథా! ఎందుకంతగా దుఃఖిస్తున్నారు’ అని అడిగింది ఇల్లాలు. ‘శ్రీరామచంద్రుడు! శ్రీరాముని దర్శనభాగ్యం పొందావు నువ్వు! అనంత భాగ్యరాలివి! ధన్యాత్మవు. నాకా భాగ్యం కలుగలేదు’ అని చెపుతూ ఉన్నాడు పోతన. ఏడుస్తూ ఉన్నాడు మళ్లా వెంటనే దుఃఖాభ్యాగ్నుడై!
‘అవునా స్వామీ! నిజమా! ఇంతక్రితం వచ్చి వ్రాసి, భోజనం చేసి వెళ్లినవారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్రమూర్తియా?’
‘అవును దేవీ! ఇది శ్రీరాముల వారు తమ స్వహస్తాలతో వ్రాసిన పద్యం! విను’ అని ఆ పద్యాన్ని వెక్కిళ్ల మధ్యనే పాడుతూ, చెపుతూ, ఏడుస్తూ ‘చూడు - నువ్వు భగవంతుడి దర్శనం పొందావు - వారు వ్రాస్తున్నది చూశావు - నీ స్వహస్తాలతో భోజనం పెట్టావు - వారి స్పర్శనం పొందావు! నాకేదీ ఆ భాగ్యం? ఆ స్వామి తిన్న ఎంగిలాకును ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది కదా!’ అని మళ్లీ ఏడుస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు పోతనామాత్యుడు.
‘స్వామీ! మీరు తీవ్రమైన దుఃఖంతో ఆవేదన చెందుతున్నానరు. శ్రీరామచంద్రమూర్తి మీ రూపంలో వచ్చి, మీరు వ్రాసినట్లుగా వ్రాసి, మీరు తిన్నట్లుగా తిని, నాకు మహద్భాగ్యమైన అవకాశం ఇచ్చారు. మీరే తానై స్వామి వస్తే, మళ్లా మీకు దర్శనం ఇవ్వలేదని దుఃఖిస్తారేం? ఇంత గొప్ప ‘మహా భాగవత కావ్యాన్ని’ తెనిగిస్తున్న మీ అపూర్వమైన పాండిత్యం చూసి, ఆనందం పట్టలేక, మీ రచనలో తానూ పాలు పంచుకోవాలని నిశ్చయించుకుని, మీకు భ్రమ కలిగించి బయటకు పంపి, తాను మీ రూపంలో వచ్చి, ‘తనను గురించి తానే’ గొప్పగా వ్రాసుకున్నాడు. ఇంత మహాభాగ్యులు మీరు. మీరు తెనిగిస్తున్న ‘మహాభాగవతం’ ఆచంద్రార్కం ప్రసిద్ధ పొందుతుంది. మీ రాముడు మీ లోపల ఆత్మారాముడై ఉన్నాడు. దుఃఖం మాని, ప్రశాంతంగా కూర్చుని ధ్యానమగ్నులుకండి! మీకే అర్థం అవుతుంది’ అంది.
వెంటనే ధ్యానమగ్నుడయ్యాడు పోతనామాత్యుడు. తన ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి, తన ఉచ్ఛ్వాసనిశ్వాసలను తదేకంగా గమనిస్తూ అంతర్ముఖుడయాడు. తన హృదయ కుహరంలో కొలువైవున్న ఆత్మారాముడిని చూసి పరమానంద భరితుడయ్యాడు ‘రామదాసు’లాగా!
‘్భవ సంతృప్తినీ, భావసంతృప్తినీ పూర్తిగా పొందారు పోతన దంపతులు. ఏ మాత్రం భవ దారిద్య్రం కానీ, భావ దారిద్య్రం కానీ లేనివారు! ముక్తజీవులు! ధన్యులు! పుణ్యాత్ములు!
వీరభద్ర విజయం, భోగినీ దండకం పోతన ఇతర రచనలు. పరమ ప్రఖ్యాతి పొందినదీ, ప్రతి కవీ, పండితుడూ, ప్రతి సాహితీ ప్రియుడు పరవశించేది ‘మహాభాగవతం’! ఈ కావ్యానువాదం, ఇందులోని గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర అజరామరాలు. పోతన కలికితురాయి మహాభాగతం!
Blood    Cancer
Brain    Cancer
Breast   Cancer
Colon    Cancer
Liver    Cancer
Lungs    Cancer
Prostate Cancer
Ovarian  Cancer

Dear friends
Medicine for several Cancer has been found! Please don't delete this without forwarding. I am forwarding it to the maximum I can. Let it reach the 110 crores Indians and the remaining if any.

"Curcuminoids" is a medicine which cures several cancer. Its available at reasonable cost at "Cancer Herbalist in Bangalore".Create Awareness. It might help someone. Forward to as many as u can, kindness costs nothing.

Cancer Herbalist, 
Address: 6, DVG Road,
Gandhi Bazaar, Basavanagudi,
Bangalore -  560004.
Landmark: Near Vidyarthi Bhavan Hotel 

Phone:
080-41218877
080-26601127
8884588835
cancerherbalist@gmail.com

IF YOU ARE ABOVE 40YRS OF AGE THIS IS FOR YOU

 HEALTH HINTS FOR YOU  

 A. Two things to check as often as you can:

(1) Your blood pressure
(2) Your blood sugar.

B. Six things to reduce to the minimum on your foods:

(1) Salt
(2) sugar
(3) preserved meat and foods
(4) red meat especially roasted
(5) diary products
(6) starchy products

C. Four things to increase in your foods:

(1) Greens/vegetables 
(2) beans 
(3) fruits
(4) nuts

D. Three things you need to forget:

(1) Your age 
(2) your past 
(3) your grievances 

E. Four things you must have, no matter how weak or how strong you are:

(1) Friends who truly love you
(2) caring family
(3) positive thoughts
(4) a warm home.

F. Five things you need to do to stay healthy: 

(1) fasting
(2) smiling / laughing  
(3) trek / exercise
(4) reduce your weight. 

G. Six things you don't have to do: 

(1) Don't wait till you are hungry to eat
(2) don't wait till you are thirsty to drink
(3) don't wait till you are sleepy to sleep
(4) don't wait till you feel tired to rest
(5) don't wait till you get sick to go for medical check-ups otherwise you will only regret later in life
(6) don’t wait till you have problem before you pray to your God.

TAKE CARE OF YOURSELF !!!

ఆయుర్వేదం - విభాగాలు .

  ఆయుర్వేదం అనగా చాలామంది దృష్టిలో చెట్లు , వాటి చూర్ణాలు అనే దృష్టి ఉంది. కాని చాలామందికి దానిలో అనేక రకాల వైద్యవిధానాలు ఉన్నాయి అనే విషయం తెలియదు. వాటిగురించి మీకు ఈ పోస్టులో వివరిస్తాను. 

       మనకి తెలిసిన ఆయుర్వేద ప్రముఖుల్లో చరకుడు , శుశ్రుతుడు అందరికి తెలుసు. కాని ఇంకో ప్రముఖ వ్యక్తి ఉన్నారు. అతని పేరు వాగ్బాటాచార్యుడు . ఈయన రాసిన " అష్టాంగహృదయం " అనే గ్రంధం చాలా ప్రముఖమైనది. దీనిలో అనేక భాగాలు కలవు. ఒక భాగంలో కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్న " మర్మకళ" గురించి చాలా వివరంగా ఉన్నది. మనిషి శరీరంలో ఉన్నటువంటి మర్మస్థానాల గురించి , దానిపైన ఒత్తిడి కలిగించినప్పుడు కలిగే సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన రాసిన                  "అష్టాంగసంగ్రహం" అను గ్రంథం కూడా ప్రముఖమైనది. 

     వాగ్బాటాచార్యుడు ఆయుర్వేదంని ౮ విభాగాలుగా విభజించాడు.   అవి 

 *  శల్యతంత్రము .

 *  శాలాఖ్య తంత్రము .

 *  కాయచికిత్స . 

 *  భూతవిద్య .

 *  కౌమారభృత్యము .

 *  అగధ తంత్రము .

 *  రసాయన తంత్రము.

 *  వాజీకరణ తంత్రము .

      ఒక్కొక్కదాని గురించి మీకు క్లుప్తంగా 
వివరిస్తాను.

 * శల్య తంత్రము - 

     మేకులు , రాళ్లు , ధూళి , ఇనుపమేకులు , మట్టిపెళ్లలు , ఎముకలు , గోళ్లు మొదలైనవి శరీర అంతర్భాగమున చొరబడినచో వానిని బయటకి తీయు ఉపాయములు , యంత్రములు, శస్తములు , క్షారములు మరియు అగ్నిని ప్రయోగించు విధానముని తెలియజేయునది శల్యతంత్రము .

 *  శాలాఖ్య తంత్రము  - 

    కంఠమునకు పైభాగమున చెవులు , కన్నులు , కంఠబిలం , నాసిక మొదలగు వాటియందు కలుగు వ్యాధుల నివారణార్ధం ఏర్పడినది శాలాఖ్య తంత్రము. 

 *  కాయచికిత్స - 

     సమస్త అవయములును అనుసరించి జ్వరం , అతిసారం, రక్తపిత్తము , శోష , ఉన్మాదము , అపస్మారము , కుష్ఠము, మేహము మొదలగు వ్యాధులను నివారించుటకు నిర్ణయింపబడిన చికిత్సా విధానమును కాయ చికిత్స అందురు.

 *  కౌమారభృత్యము - 

     శిశువుల పోషణా విధానము , పాలు ఇచ్చే విధానం , పాలల్లో దోషములు శోధించుట , దుష్టపు పాలు త్రాగుట చేత , దుష్ట గ్రహంబులు చేత కలిగిన వ్యాధుల నివర్తి చేయుటకు తగు విధానములు భోధించునది "కౌమారభృత్యము ".
*  అగధ తంత్రము - 

     పలు రకాల సర్పాలు , కీటకములు , సాలెపురుగులు , తేళ్లు , ఎలుకలు మొదలగు విషజంతువులు కరుచుట చేతను కలిగిన విషమును తెలుసుకొనుటకు , విషముల్లో రకాలు అయిన స్థావర, జంగమ విషములు గురించి వాటి ఉపశమనాల గురించి ఎర్పడినది అగధ తంత్రము.

 *  రసాయన తంత్రము - 

     యవ్వనమును స్థిరముగా చేయుటకు , ఆయువుని , బలమును , బుద్ధిని కలుగచేయుటకు , వ్యాధుల నివర్తించుటకు సమర్ధంబు అయినది రసాయన తంత్రము .

 *  వాజీకరణ తంత్రము - 

      క్షీణించిన రేతస్సును అధికంగా చేయుటకు , దుష్టమగు రేతస్సుని శుభ్రముగా చేయునది , సంభోగము నందు అధిక శక్తిని , కామవాంఛ కలుగ చేయునది వాజీకరణ తంత్రము . 

    
    ఈ విధముగా ఆయుర్వేదము 8 అంగాలుగా విభజించబడినది. ఆయా సమస్యలకు సరియైన చికిత్సా విధానములు అనుసరించి చికిత్సని అందించవలెను . 

పక్షవాతమును హరించు సిద్ధయోగాలు  -

 *  అక్కలకర్ర , సన్నరాష్ట్రం , శొంఠి మూడింటిని కలిపి పలుచటి కషాయం చేసుకుని ప్రతిరోజు సేవించుచున్న పక్షవాతం హరించును .

 *  కసివింద చెట్టు రసము వెన్నతో కలిపి మర్దన చేయుచున్న పక్షవాతం హరించును .

 *  కుసుమ విత్తనాలతో చేసిన తైలం మర్దన చేయుచున్న పక్షవాతం హరించును .

 *  పక్షవాత రోగులు ప్రతినిత్యం ఖర్జురాలు తినుచున్న చాలా మేలు చేయును .

 *  పక్షవాతం వచ్చి కాలు , చెయ్యి పడిపోతున్న సమయంలో వెంటనే గిద్దెడు తేనె తాగించిన పక్షవాత ప్రభావం పోయి మనిషి సాధారణ స్థితికి చేరును .

 *  కటుకరోహిణి నల్లనిది చూర్ణం చేసి 5 గ్రా చొప్పున తీసుకొనుచున్న పక్షవాతం నివృత్తి అగును.

 *  అంజీరపండు ఎండినది , పెద్ద జీలకర్రతో కలిపి తినుచున్న మేలు జరుగును.

 * పొంగించిన ఇంగువ అనగా గుంట గంటె లో ఇంగువ వేసి గంటెని వేడిచేసిన ఇంగువ పొంగును . శుద్ది అగును. ఇలా శుద్ధిచేసిన ఇంగువ 5 గ్రాముల చొప్పున తేనెతో కలిపి తీసుకొనుచున్న పక్షవాతం పక్షవాతం హరించును .

 పక్షవాతపు రోగులు పాటించవలసిన ఆహార నియమాలు  -

 తినవలసినవి  -

      పాత బియ్యపు అన్నం , గోధుమరొట్టె , గోధుమ జావ , మేక మాంసము , పొట్టేలు మాంసం , కంది పప్పు , కంది కట్టు , బీరకాయ , పొట్లకాయ , లేత వంకాయ ముదురు వంకాయ తినరాదు. లేత మునగకాయ , వెల్లుల్లి , ఉల్లిపాయ , కొయ్య తొటకూర , గలిజేరు కూర , మునగ ఆకు కూర , చిర్రి కూర , కసివిందాకు కూర , ద్రాక్షపండు తియ్యనిది , ఖర్జూరం , ఆవు మజ్జిగ , ఆవునెయ్యి , పటికబెల్లం , పాతబెల్లం , తేనె , ఒంటికి మర్దన చేయించుకోవలెను.

 తినకూడనవి  -

కొత్తబియ్యపు అన్నం , చద్దిఅన్నం , జొన్నన్నం , మొక్కజొన్న , అలసంద , పెసలు , మినుములు , శనగలు , బచ్చలికూర , చుక్కకూర , పెరుగు , మీగడ , సామలు , పిండివంటలు , అతిగా నూనె , కల్లు , కలి , కోడిమాంసం , కాకరకాయ , మామిడిపండ్లు , మామిడికాయలు , చేపలు , పులికడుగు , ఫ్రిజ్ నీరు , కూల్ డ్రింక్స్ , నూనెవేపుళ్ళు , పాతపచ్చళ్లు , అతిగా కారం , చేదుగల పదార్థాలు , సంభోగం , చన్నీటి స్నానం చేయరాదు , చింతపండు పులుపు , మొదట తినిన ఆహారం జీర్ణం కాకమునుపే మరలా భుజించటం , మలమూత్ర నిరోధం , ఉపవాసం , అతిగా కష్టపడకూడదు , చల్లటిగాలికి ఉండరాదు , మంచు , తడిప్రదేశాలలో ఉండరాదు.

         పైన చెప్పినటువంటి పథ్యములు పాటిస్తూ ఔషధసేవన చేయడం వలన రోగి సమస్య నుంచి తొందరగా బయటకి వస్తాడు. పథ్యం చేయకుండా మీరు ఎంత గొప్ప ఔషధాలు సేవించినను సమస్య తగ్గదు. ఆయుర్వేదం నందు పథ్యం అనేది ఔషధాలు కొరకు కాదు. రోగానికి పథ్యం ఉంటుంది. రోగం తగ్గుటకు ఔషధాలు సేవిస్తూ మరొకవైపు రోగాన్ని పెంచే ఆహారం తీసుకోవడం వలన ఔషధం పనిచేయకపోగా రోగం మరింత పెరుగును .
శ్రీ మహాలక్ష్మ్యష్టకం 



ఇంద్ర ఉవాచ –
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౧ ||

నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౨ ||

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౩ ||

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౪ ||

ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౫ ||

స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౬ ||

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |
పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౭ ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౮ ||

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ౯ ||

ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః || ౧౦ ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా || ౧౧ ||
ఈరోజు సర్వ పాపాలను నశింపజేసే 'యోగిని ఏకాదశి' 

యోగిని ఏకాదశి ఏటా జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వస్తుంది. 

దీనికి సంబంధించిన గాథను కృష్ణభగవానుడు ధర్మరాజుకు వివరించారు.

 అలకాపురిని పాలించే కుబేరుడి వద్ద హేమమాలి అనే ఉద్యానవన సిబ్బంది వుండేవాడు. ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్లి అక్కడ పుష్పాలను సేకరించి కుబేరునికి ఇచ్చేవాడు. కుబేరుడు ఆ పుష్పాలతో మహాశివున్ని పూజించేవాడు. ఒక రోజు పుష్పాలను తీసుకువస్తున్న హేమమాలి తన ఇంటికి వెళుతాడు. సమయం గడుస్తున్నా అతను రాకపోవడంతో పూజకు ఆలస్యం అవుతోందని కుబేరుడు హేమమాలి ఎక్కడ వున్నాడో తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించాడు. హేమమాలికి ఈ విషయం తెలియడంతో వెంటనే కుబేరుని వద్దకు చేరుకొని క్షమాపణలు చెబుతాడు. అయితే ఆగ్రహంతో వున్న కుబేరుడు అతడు కుష్టువ్యాధితో బాధపడాలని శాపం పెడుతాడు. వెంటనే హేమమాలి భూలోకంలో పడిపోతాడు. భయంకరమైన వ్యాధితో అడవుల్లో తిరుగతూ హిమాలయాల్లోని మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించినందుకుఎలా శాపానికి గురైంది వివరిస్తాడు. తనకు శాపవిముక్తి కలిగించాలని వేడుకుంటాడు. దీంతో మహర్షి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున దీక్ష వుండాలని సూచించాడు. హేమమాలి భక్తితో, శ్రద్ధగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో అతని శాపం తొలగి పూర్వరూపానికి చేరుకుంటాడు. 

అందుకనే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం మనకు వున్న అనేక పాపాలను తొలగించుకోవచ్చని కృష్ణపరమాత్మ తన ఉపదేశంలో పేర్కొంటాడు.
ప్రస్తుతం తాము ఎదుర్కుంటోన్న పరిస్థితులు, గత జన్మలలో చేసిన పాపాలకు ఫలితాలుగా అనుభవించవలసి ఉంటుంది  . జన్మజన్మలుగా వెంటాడుతోన్న ఈ పాపాల బారి నుంచి బయటపడే మార్గమే లేదా? అని చాలామంది ఆవేదనకి లోనవుతుంటారు. 

అలాంటి వారికి ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా 'యోగిని ఏకాదశి' చెప్పబడుతోంది. 'జ్యేష్ఠ బహుళ ఏకాదశి' ని యోగిని ఏకాదశిగా చెబుతుంటారు. 

ఈ రోజున శ్రీమన్నారాయణుడిని పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, సమస్త పాపాలు .. శాపాలు నశించి పుణ్యఫలాలు కలుగుతాయని అంటారు.

జై గురుదత్త..!
       
ఆకలి లేనివారికోసం సులభ యోగాలు  - 

 *  మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.

 *  వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .

 *  యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.

 *  బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .

 *  పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .

 *  కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.

         పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు.

 అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -

 తినవలసినవి  -
 తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .

 తినకూడనవి  -

        కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం,  ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .


ART OF LIVING PROGRAM BY ME QCI CERTIFICATE HOLDER







I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA

MORNING AFFIRMATIONS

 

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS

My photo
Vijayawada, andhrapradesh, India
I AM YOGA TEACHER

Goolgepay Phone pay Paytm

Donate for our yoga center paytm : 8977277742
YOGA  personal & online yoga training availability anywhere the world

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA &FITNESS CLASSES AT YOUR DOOR STEPS FROM THE POINT OF INDIAN TRADITIONAL YOGA FOCUSED AREA: GENERAL FITNESS & OBESITY(OVERWEIGHT REDUCTION) TRAINING CLASSES AT THE STUDIO COVERING ALL HEALTH PROBLEMS SPECIALIZATION : PRANAYAMA | PRANIC HEALING | MEDITATIVE