YOGA ASANAS 1

YOGA HEALTH

Monday, December 17, 2018

దోషాలు నివారించే గోమతి చక్రాలు

దోషాలు నివారించే గోమతి చక్రాలు 

గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక. ఒక్క గోమతి చక్రాన్ని తాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నర దృష్టి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడా పోతాయి.

గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే 'నాగ చక్రం' అని 'విష్ణు చక్రం' అని కూడా అంటారు. ఇది నత్త గుళ్ళని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని 'నత్త గుళ్ళ' స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. గోమతి చక్రం ముందుభాగం తెల్ల గాను, కొన్ని ఎర్ర గాను ఉంటాయి. తెల్ల గా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి,ఆరోగ్య సమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి.

గోమతిచక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి.. ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.

 ఎర్రగా ఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్రప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి. గోమతిచక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి . సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి.జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం  కావటం ,వివాహాం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి. 

పూజా విధానం 
గోమతి చక్రాలను సిద్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని శుద్ధి చేసుకుని పరిశుబ్రమైన బట్టతో తుడవాలి. గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా  అష్ట లక్ష్మీ యంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి. గోమతిచక్రాలను లలితా సహస్త్ర నామం జపిస్తూ కుంకుమతో గాని హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి. గోమతి చక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని, వరలక్ష్మి వ్రతం రోజు గాని చేసుకొని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు. పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు. గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని, హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి. గోమతిచక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి. 

ఉపయోగాలు ఇలా..
రెండు గోమతి చక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే ధనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. రెండు గోమతి చక్రాలను ఒక తెల్లని గుడ్డలో వేసి దానిని మీ గుమ్మానికి కట్టండి, నరగోష పటా పంచలైపోతుంది. 

మూడు గోమతిచక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద రాసి నీటిలో వేయటం గాని, వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.

నాలుగు గోమతిచక్రాలు పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది. గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉందురు. నాలుగు గోమతిచక్రాలను వాహానానికి కట్టటం వలన వాహాన నియంత్రణ కలిగి వాహాన ప్రమాదాల నుంచి నివారించబడతారు.

ఐదు గోమతిచక్రాలు తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది. 5 గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది.తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.  

ఆరు గోమతిచక్రాలు అనారోగ్యం కలిగిన వ్యాదిగ్రస్తుడి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రువులపై విజయం సాధించవచ్చును. కోర్టు గొడవలు ఉండవు. విజయం సాధించవచ్చును.

ఏడు గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.ఇతరులతో సామాజిక సంబందాలు బాగుంటాయి.7 గోమతిచక్రాలను నదిలో విసర్జితంచేసిన దంపతుల మధ్య అభిప్రాయభేదాలు మటుమాయం అవుతాయి. 

ఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు.ఆద్యాత్మిక చింతన కలుగుతాయి.ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు.

పది గోమతిచక్రాలు ఆఫీసులో ఉండటం వలన ఆ సంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది.ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి.మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించబడతారు.

పదకొండు గోమతిచక్రాలు లాభ లక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.భవన నిర్మాణసమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు ,శల్యదోషాలు ఉండవు.

గోమతిచక్రాలను శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. 27 గోమతిచక్రాలని వ్యాపార సముదాయములలో ద్వార బందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది. జాతకచక్రంలో నాగదోషం,కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి గాని,సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది. దీనినే నాగదోషం అంటారు. జాతకచక్రంలో రాహు కేతువుల మద్య అన్నీ గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజచేయటం గాని, దానం చేయటం గాని, గోమతి చక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించటం గాని చేయాలి

No comments:

Post a Comment

8977277742

I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA

YOGA ASANAS

 

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS

My photo
Vijayawada, andhrapradesh, India
I AM YOGA TEACHER

Goolgepay Phone pay Paytm

Donate for our yoga center paytm : 8977277742
YOGA  personal & online yoga training availability anywhere the world

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA &FITNESS CLASSES AT YOUR DOOR STEPS FROM THE POINT OF INDIAN TRADITIONAL YOGA FOCUSED AREA: GENERAL FITNESS & OBESITY(OVERWEIGHT REDUCTION) TRAINING CLASSES AT THE STUDIO COVERING ALL HEALTH PROBLEMS SPECIALIZATION : PRANAYAMA | PRANIC HEALING | MEDITATIVE