https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD

https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD
https://hostinger.in?REFERRALCODE=I60SHAKTHNQD

YOGA ASANAS 1

YOGA HEALTH

Saturday, June 29, 2019

పక్షవాతమును హరించు సిద్ధయోగాలు  -

 *  అక్కలకర్ర , సన్నరాష్ట్రం , శొంఠి మూడింటిని కలిపి పలుచటి కషాయం చేసుకుని ప్రతిరోజు సేవించుచున్న పక్షవాతం హరించును .

 *  కసివింద చెట్టు రసము వెన్నతో కలిపి మర్దన చేయుచున్న పక్షవాతం హరించును .

 *  కుసుమ విత్తనాలతో చేసిన తైలం మర్దన చేయుచున్న పక్షవాతం హరించును .

 *  పక్షవాత రోగులు ప్రతినిత్యం ఖర్జురాలు తినుచున్న చాలా మేలు చేయును .

 *  పక్షవాతం వచ్చి కాలు , చెయ్యి పడిపోతున్న సమయంలో వెంటనే గిద్దెడు తేనె తాగించిన పక్షవాత ప్రభావం పోయి మనిషి సాధారణ స్థితికి చేరును .

 *  కటుకరోహిణి నల్లనిది చూర్ణం చేసి 5 గ్రా చొప్పున తీసుకొనుచున్న పక్షవాతం నివృత్తి అగును.

 *  అంజీరపండు ఎండినది , పెద్ద జీలకర్రతో కలిపి తినుచున్న మేలు జరుగును.

 * పొంగించిన ఇంగువ అనగా గుంట గంటె లో ఇంగువ వేసి గంటెని వేడిచేసిన ఇంగువ పొంగును . శుద్ది అగును. ఇలా శుద్ధిచేసిన ఇంగువ 5 గ్రాముల చొప్పున తేనెతో కలిపి తీసుకొనుచున్న పక్షవాతం పక్షవాతం హరించును .

 పక్షవాతపు రోగులు పాటించవలసిన ఆహార నియమాలు  -

 తినవలసినవి  -

      పాత బియ్యపు అన్నం , గోధుమరొట్టె , గోధుమ జావ , మేక మాంసము , పొట్టేలు మాంసం , కంది పప్పు , కంది కట్టు , బీరకాయ , పొట్లకాయ , లేత వంకాయ ముదురు వంకాయ తినరాదు. లేత మునగకాయ , వెల్లుల్లి , ఉల్లిపాయ , కొయ్య తొటకూర , గలిజేరు కూర , మునగ ఆకు కూర , చిర్రి కూర , కసివిందాకు కూర , ద్రాక్షపండు తియ్యనిది , ఖర్జూరం , ఆవు మజ్జిగ , ఆవునెయ్యి , పటికబెల్లం , పాతబెల్లం , తేనె , ఒంటికి మర్దన చేయించుకోవలెను.

 తినకూడనవి  -

కొత్తబియ్యపు అన్నం , చద్దిఅన్నం , జొన్నన్నం , మొక్కజొన్న , అలసంద , పెసలు , మినుములు , శనగలు , బచ్చలికూర , చుక్కకూర , పెరుగు , మీగడ , సామలు , పిండివంటలు , అతిగా నూనె , కల్లు , కలి , కోడిమాంసం , కాకరకాయ , మామిడిపండ్లు , మామిడికాయలు , చేపలు , పులికడుగు , ఫ్రిజ్ నీరు , కూల్ డ్రింక్స్ , నూనెవేపుళ్ళు , పాతపచ్చళ్లు , అతిగా కారం , చేదుగల పదార్థాలు , సంభోగం , చన్నీటి స్నానం చేయరాదు , చింతపండు పులుపు , మొదట తినిన ఆహారం జీర్ణం కాకమునుపే మరలా భుజించటం , మలమూత్ర నిరోధం , ఉపవాసం , అతిగా కష్టపడకూడదు , చల్లటిగాలికి ఉండరాదు , మంచు , తడిప్రదేశాలలో ఉండరాదు.

         పైన చెప్పినటువంటి పథ్యములు పాటిస్తూ ఔషధసేవన చేయడం వలన రోగి సమస్య నుంచి తొందరగా బయటకి వస్తాడు. పథ్యం చేయకుండా మీరు ఎంత గొప్ప ఔషధాలు సేవించినను సమస్య తగ్గదు. ఆయుర్వేదం నందు పథ్యం అనేది ఔషధాలు కొరకు కాదు. రోగానికి పథ్యం ఉంటుంది. రోగం తగ్గుటకు ఔషధాలు సేవిస్తూ మరొకవైపు రోగాన్ని పెంచే ఆహారం తీసుకోవడం వలన ఔషధం పనిచేయకపోగా రోగం మరింత పెరుగును .
శ్రీ మహాలక్ష్మ్యష్టకం 



ఇంద్ర ఉవాచ –
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౧ ||

నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౨ ||

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౩ ||

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౪ ||

ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౫ ||

స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౬ ||

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |
పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౭ ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౮ ||

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ౯ ||

ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః || ౧౦ ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా || ౧౧ ||
ఈరోజు సర్వ పాపాలను నశింపజేసే 'యోగిని ఏకాదశి' 

యోగిని ఏకాదశి ఏటా జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వస్తుంది. 

దీనికి సంబంధించిన గాథను కృష్ణభగవానుడు ధర్మరాజుకు వివరించారు.

 అలకాపురిని పాలించే కుబేరుడి వద్ద హేమమాలి అనే ఉద్యానవన సిబ్బంది వుండేవాడు. ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్లి అక్కడ పుష్పాలను సేకరించి కుబేరునికి ఇచ్చేవాడు. కుబేరుడు ఆ పుష్పాలతో మహాశివున్ని పూజించేవాడు. ఒక రోజు పుష్పాలను తీసుకువస్తున్న హేమమాలి తన ఇంటికి వెళుతాడు. సమయం గడుస్తున్నా అతను రాకపోవడంతో పూజకు ఆలస్యం అవుతోందని కుబేరుడు హేమమాలి ఎక్కడ వున్నాడో తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించాడు. హేమమాలికి ఈ విషయం తెలియడంతో వెంటనే కుబేరుని వద్దకు చేరుకొని క్షమాపణలు చెబుతాడు. అయితే ఆగ్రహంతో వున్న కుబేరుడు అతడు కుష్టువ్యాధితో బాధపడాలని శాపం పెడుతాడు. వెంటనే హేమమాలి భూలోకంలో పడిపోతాడు. భయంకరమైన వ్యాధితో అడవుల్లో తిరుగతూ హిమాలయాల్లోని మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించినందుకుఎలా శాపానికి గురైంది వివరిస్తాడు. తనకు శాపవిముక్తి కలిగించాలని వేడుకుంటాడు. దీంతో మహర్షి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున దీక్ష వుండాలని సూచించాడు. హేమమాలి భక్తితో, శ్రద్ధగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో అతని శాపం తొలగి పూర్వరూపానికి చేరుకుంటాడు. 

అందుకనే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం మనకు వున్న అనేక పాపాలను తొలగించుకోవచ్చని కృష్ణపరమాత్మ తన ఉపదేశంలో పేర్కొంటాడు.
ప్రస్తుతం తాము ఎదుర్కుంటోన్న పరిస్థితులు, గత జన్మలలో చేసిన పాపాలకు ఫలితాలుగా అనుభవించవలసి ఉంటుంది  . జన్మజన్మలుగా వెంటాడుతోన్న ఈ పాపాల బారి నుంచి బయటపడే మార్గమే లేదా? అని చాలామంది ఆవేదనకి లోనవుతుంటారు. 

అలాంటి వారికి ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా 'యోగిని ఏకాదశి' చెప్పబడుతోంది. 'జ్యేష్ఠ బహుళ ఏకాదశి' ని యోగిని ఏకాదశిగా చెబుతుంటారు. 

ఈ రోజున శ్రీమన్నారాయణుడిని పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, సమస్త పాపాలు .. శాపాలు నశించి పుణ్యఫలాలు కలుగుతాయని అంటారు.

జై గురుదత్త..!
       
ఆకలి లేనివారికోసం సులభ యోగాలు  - 

 *  మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.

 *  వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .

 *  యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.

 *  బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .

 *  పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .

 *  కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.

         పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు.

 అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -

 తినవలసినవి  -
 తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .

 తినకూడనవి  -

        కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం,  ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .


ART OF LIVING PROGRAM BY ME QCI CERTIFICATE HOLDER







INTERNATIONAL WORKSHOP ON YOGA












రసవాద విద్య .
భారతదేశపు పురాతన విద్య  -

   మన ప్రాచీన భారతీయుల విఙ్ఞానం అమోఘమైనది . వారు పరిశోధించి కనుగొనిన అనేక అంశాలు అత్యంత రహస్యంగా నిక్షిప్తం చేసి ఉంచారు . మన భారతీయ వేదాలలో ఎంతో విజ్ఞానం నిక్షిప్తం అయ్యి ఉంది. కాని మనం దానిని పట్టించుకోకుండా పాశ్చాత్త్యా సంప్రదాయాల మోజులో పడిపోయి మన పూర్వీకుల విజ్ఞానాన్ని మనం పట్టించుకోవడం లేదు . తాళపత్రాలలో మరియు మన పురాతన గ్రంథాలలో నిక్షిప్తం అయిన అద్బుత విజ్ఞానాన్ని వారు తమ తమ  పరిశోధనలలో ఉపయోగించుకుంటున్నారు. మనం పోగొట్టుకున్న ఒక అద్భుత రహస్య విద్య గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.

         మనం పోగుట్టుకున్న , మరిచిపోయిన ఆ రహస్య విద్య పేరే "రసవాద విద్య" ఈ విద్య గురించి వివరించాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది.  ఈ విద్యలో ముఖ్యంగా చెట్ల రసాలు , పాదరసం వంటి లోహాలు ఉపయోగించి "బంగారం " తయారుచేయుట . రహస్యంగా ఉండిపోయిన ఈ విద్య గురించి కొంత సమాచారమును నేను సేకరించాను . కొన్ని పురాతన గ్రంథాలను కూడా నేను ఈ విద్య గురించి తెలుసుకోవడానికి చదవడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ విశేషాలు తెలియచేస్తాను.

          అగస్త్య మహర్షులవారు అగస్త్యప్రోక్తం అను రసాయనిక గ్రంధమును రచించి అందులో పాషాణ , రససమ్మేళణాదులు ఉపయోగించు విధానం పేర్కొనెను. నీచలోహాలను స్వర్ణముగా మార్చు విధానములు సవివరముగా తెలియచేస్తూ రసవాదులకు మార్గదర్శకుడు అయ్యెను . ఈ రసవాదం సంపూర్ణంగా సిద్ధించుటకు అత్యంత ప్రజ్ఞ కలవాడై ఉండవలెను . పురాతన సిద్ధులు మాత్రమే కాకుండా కొంతమంది ఆధునిక రసవాద పరిశోధకులు కూడా స్వర్ణాన్ని తయారుచేశారు. వారిలో కాశీ నివాసి "పండిత్ కృష్ణపాల్ " 1943 సంవత్సరంలో హృషికేష్ లోని ప్రముఖుల సమక్షాన రసవాద విద్య ద్వారా స్వర్ణాన్ని తయారుచేశారు. ఆ బంగారం ఆ కాలంలో 72000 రూపాయలకు విక్రయించబడినది. ఆ మొత్తం పంజాబ్ లోని సనాతన ధర్మ ప్రతినిధి సభకు విరాళంగా ఇవ్వబడినది. బనారస్ హిందూ  విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విశ్వనాధ మందిరం పై అంతస్తులో రసవాద విద్యలో ప్రముఖ ఆచార్యుడు అయిన నాగార్జుని చిత్రంతో పాటు పాలరాతిపై ఈ వివరాలు కూడా చెక్కబడి ఉన్నాయి . 11 వ శతాబ్దంలో "ఆల్బెరుని " అనే విదేశీ యాత్రికుడు మనదేశం సందర్శించి ఇక్కడి సిద్దులు బంగారం తయారుచేసేవారు అని పేర్కొన్నాడు. దేశంలో కరువుకాటకాలు ఏర్పడినపుడు రసాయనాచార్యులు కృత్రిమంగా స్వర్ణాన్ని తయారుచేసెవారు అని అనేక గ్రంథాలలో వివరించబడి ఉంది.
 ఈ రసవాద విద్యను "స్వర్ణకరణి" పగారవిద్య అని అంటారు. ఈ విద్యను ఉర్దూలో కీమియా అని ఇంగ్లిష్ భాషలో ఆల్కెమీ అని పిలుస్తారు . ఈ రసవాదవిద్యలో నీచ వస్తువుని స్వర్ణంగా మార్చడానికి ఉపయోగించు ఒక వస్తువును "పరుసవేది " అని పిలుస్తారు . ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ రసవాద విద్య సిద్దించక భ్రష్టుడు , పిచ్చివాడు కావొచ్చేమోకాని ఒక గొప్ప వైద్యుడు మాత్రం తప్పక అవుతాడు. అందుకనే మన పూర్వీకులు                                " వాదభ్రష్టో వైద్య శ్రేష్ఠ"  అని అన్నారు.  ఆధునిక శాస్త్రవేత్తలు స్వర్ణం తయారుచేయడాన్ని ఒక పిచ్చిపనిగా , చెప్పినవాడ్ని పిచ్చివానిగా చూస్తారు. వారు చెప్పినట్లు స్వర్ణం ఒక ఎలిమెంట్ అణుసంఖ్య పట్టికలో దీని సంఖ్య 79 . AU కాంతి లోహ సంబంధమైనది . ప్రకృతిసిద్ధంగా లభించే బంగారుస్పటికముల అవయవ రూపత్వం ఇసొమెట్రిక్ భూమి యొక్క ఉష్ణోగ్రతకు కరిగి కిందికి దిగి పేరుకుని పొందే అవయవాకృతిని "నగ్గెట్స్" అంటారు. బంగారం యొక్క కాఠిన్యం      2 .5 to 3 .రష్యా వంటి దేశాలలో ప్రయోగశాలలలో కృత్రిమంగా తయారుచేశారు. బయట ఉన్న బంగారం ఖరీదు కంటే తయారు చేయుటకు అయ్యే వ్యయం ఎక్కువ ఆగుతుంది. అందువల్ల పరిశోధనలు ఆగిపోయాయి.

       భారతీయ పురాణాల్లో చెప్పినదాని ప్రకారం ఈ రసవాద విద్యలో ప్రముఖులు ఆదిమ చంద్రసేనుడు , లంకేశ్వరుడు, మత్తమాండవ్య ఇంద్రదత్త , కలంబి, నాగార్జునుడు, ఋషిశృంగ, రసేంద్రాతిలక , భాలుకి , మైధిలి , హరీశ్వర మొదలగు 27 మహామహులు చేత సింహగుప్తుని కుమారుడు అయిన వాగ్భాటాచార్యుడు , వేమనయోగి వంటి ఎందరో మహాత్ములు , సిద్దులు మొదలయిన వారు ఎందరొ ఉన్నారు.

మనకు తెలిసిన వేమన గొప్ప రసవాది ఆయన ఒక చోట ఇలా చెప్పాడు . " వెన్నెల నిలుచుండి , వేపాకు పడవేసి అడ్డసరం రసమందు నదియు పిండి రాగి కరుగవేయ రమణ బంగారమౌ విశ్వదాభిరామ " అని చెప్పాడు . మరియొక చోట " పుట్టమీద కాయ , పుట్టమీద మన్ను  పుట్టలోనివాని పుట్టుతుదను గట్టియవచనము కాంచనాంబగయ" అని చెప్పాడు. నేపాల్ దేశంలో పరుశువేది లింగం ఉన్నట్టు శ్రీశైల క్షేత్రంలో కూడా శివలింగానికి కింద ఉన్న సప్తమ లింగం కూడా పరశువేది లింగం అంటూ కొన్ని ప్రాచీన రహస్య గ్రంధాలలో ఉన్నది.

  రసవాద విద్య గురించి సంపూర్ణంగా వివరించే అత్యంత ప్రాచీన గ్రంథాలు  -

 గ్రంధాల పేర్లు  -

 *  అగస్త్య రసాయనిక తంత్రం.
 *  కక్షపూట తంత్రం.
 *  కూపిపక్వ రస నిర్మాణ్ విజ్ఞాన్.
 *  ద్వాదశ లోహ భస్మ విధానము.
 *  పారద విజ్ఞానం.
 *  పారద సంహిత.   
 *  రస చింతామణి.
 *  రసరత్నాకరము .
 *  రసాయన ఖండం.
 *  రసార్ణవము.
 *  రసేంద్ర చూడామణి.
 *  రసేంద్ర కల్పద్రుమ.
 *  సనారి విశ్వేశ్వర సంవాదం.
 *  రస కంకాలియ.
 *  రస కౌముది.
 *  రస పారిజాత.
 *  రసరత్న మణిమాల.
 *  రస ప్రదీప.
 *  రసేంద్ర మంగళం .
 *  సూత ప్రదీపిక.
 *  రస సాగరః.
 *  రస రాజలక్ష్మి.
 *  రస ముక్తావళి.
 *  రసరాజ శిరోమణి.
 *  రస సంగ్రహ సిద్ధాంత .
 *  రస కిన్నెర .
 *  స్వర్ణ తంత్రం.
 *  కనకమంజరి.
 *  కళాయి శాస్త్రం.

          పైన చెప్పిన గ్రంథాలు అత్యంత ప్రాచీనం అయినవి . ఇంకా కొన్నిచోట్ల అరుదుగా లభ్యం అగుచున్నవి.

  రసవాదం నందు వివరించిన కొన్ని ప్రయోగాలు -

 *  తెల్ల వాకుడు రసం తో పాదరసాన్ని నూరిన మైనం . ఆ మైనంలో ఆ పిప్పిలో పొదిగి , ఆరబెట్టి చిన్న పుటం పుట్టిన భస్మం అగును. రాగిని కరిగించి అందులో ఈ భస్మం వేసిన హేమించును

 *  ఒక శేరు ఇంగిలీకమును 5 శేరుల పచ్చిపసుపు రసమున 4 జాములు చురకా ఇచ్చి తరువాత 15 శేరుల తంగేడుపువ్వుల రసముతో చురకా ఇచ్చిన కట్టును . ఇది నిశ్చయం. అది వెండి మీద పదోవంతు వేసిన బంగారం అగును.

 *  అడవి మెంతి ఆకు పాదరసమున వేసి నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం వేసిన వెండి అగును ఇది నిశ్చయం .

 * శంఖు పాషాణం వంకాయలో పెట్టి మట్టిరాసి ఆరబెట్టి 21 పుటములు పెట్టవలెను . 10 పుటముల వరకు 4 నుంచి 5 వేసినను కట్టును . తరువాత 4 కి 1 పిడక చొప్పున పుటములు పెట్టవలెను. దీనిని రసంలో వేసి రాగికి జోడించి కరిగించిన స్వర్ణం అగును.

 *  నల్ల ఉమ్మెత్త సమూలం నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం పెట్టిన భస్మం అగును. ఆ భస్మమును రాగి కరుగుచుండగా వేసిన స్వర్ణం అగును. శుద్ధ రాగి కొరకు నైజామ్ అర్ధరూపాయి వెడల్పాటిది శ్రేష్టం.
*  రెండు నేరేడు పండ్లు తెచ్చి ఒక్కోటి సగం వరకు కోసి కొంచం గుజ్జు తీసి రెండు తులముల రాగి రజను అందులో పోసి తీసిన గుజ్జు మీద వేసి రెండు డిప్పలు కలిపి గుడ్డ చుట్టి 7 సార్లు శీలమన్ను ఇవ్వవలెను . పిమ్మట ఏరు పిడకలతో  పుఠం  పెట్టి సాంగశీతలమున బలి ఇచ్చి తీసి చూచిన 6 వన్నె బంగారం అగును .కరిగించి దూచిన సరిపోవును .

        పైన చెప్పిన యోగాలు కొన్ని ప్రాచీన అత్యంత అరుదయిన గ్రంథాల నుంచి నేను సేకరించినవి . ఇవి కేవలం మీ విజ్ఞానం కోసం మాత్రమే వివరిస్తున్నాను. అత్యాశకు పోయి మీకుటుంబాలను , మీ మీద ఆధారపడ్డ వారిని ఇబ్బందులపాలు చేయొద్దని నా మనవి. ఆ సర్వేశ్వరుడు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు . కావున ఇచ్చినదానితో తృప్తిగా కుటుంబంతో సంతోషంగా ఉందాం


       

I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA

MORNING AFFIRMATIONS

 

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS

My photo
Vijayawada, andhrapradesh, India
I AM YOGA TEACHER

Goolgepay Phone pay Paytm

Donate for our yoga center paytm : 8977277742
YOGA  personal & online yoga training availability anywhere the world

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA &FITNESS CLASSES AT YOUR DOOR STEPS FROM THE POINT OF INDIAN TRADITIONAL YOGA FOCUSED AREA: GENERAL FITNESS & OBESITY(OVERWEIGHT REDUCTION) TRAINING CLASSES AT THE STUDIO COVERING ALL HEALTH PROBLEMS SPECIALIZATION : PRANAYAMA | PRANIC HEALING | MEDITATIVE