YOGA ASANAS 1

YOGA HEALTH

Monday, June 29, 2020

NINE HOLES OF THE BODY

సర్వ — సమస్తమైన; కర్మాణి — కర్మలు; మనసా — మనస్సు చే; సన్న్యస్య — త్యజించి; అస్తే — ఉండును; సుఖం — సుఖముగా; వశీ — ఆత్మ నిగ్రహం కలవారు; నవ-ద్వారే — తొమ్మిది మనసా
ద్వారములు కల; పురే — నగరములో; దేహీ — దేహములొఉన్న జీవాత్మ; న — కాదు; ఏవ — నిజముగా; కుర్వన్ — చేయునది; న — కాదు; కారయన్ — కారణము కాదు.

ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు, తాము దేనికీ కర్త కాదని, దేనికీ కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క తొమ్మిది ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు.

భావం:
నవ రంధ్రాలు గల శరీరమును, తొమ్మిది ద్వారాలు గల పట్టణంతో పోల్చుతున్నాడు శ్రీ కృష్ణుడు. జీవాత్మ ఆ పట్టణానికి రాజు, దాని పరిపాలన అంతా అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు మరియు జీవ-శక్తి అనే మంత్రిత్వ శాఖల ద్వారా నడిపింపబడుతాయి. కాలము, మృత్యు రూపంలో, శరీరాన్ని తీసివేసే వరకే, ఈ శరీరంపై రాజ్యపాలన కొనసాగుతుంది. కానీ, పాలన కొనసాగుతున్నప్పుడు కూడా, జ్ఞానోదయమయిన యోగులు తమను తాము శరీరంగా భావించరు, అంతేకాక, తమను తాము ఈ శరీరానికి అధిపతులము అనుకోరు. సరికదా, శరీరమును, దానిచే చేయబడిన అన్ని క్రియలను భగవంతునికే చెందినవని భావిస్తారు. అన్ని కర్మలను మానసికంగా త్యజించి, ఇటువంటి జ్ఞానోదయమైన యోగులు సంతోషంగా ఈ శరీరంలో స్థితులై ఉంటారు. దీనినే, 'సాక్షీ భావము' అంటారు, అంటే, తన చుట్టూ జరిగే అన్ని విషయములకు ఆసక్తిరహిత పరిశీలకుడిగా (సాక్షిగా) నిలిచిపోవటం. ఈ శ్లోకంలో ఉన్న ఉపమానము, శ్వేతాశ్వతర ఉపనిషత్తు లో కూడా పేర్కొనబడినది:

నవద్వారే పురే దేహీ హంసో లీలాయతే బహి:
వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ (3.18)

"శరీరము తొమ్మిది ద్వారాలను కలిగి ఉంటుంది - రెండు చెవులు, ఒక నోరు, రెండు నాసికారంధ్రాలు, రెండు కళ్ళు, అపానము, జననేంద్రియము. భౌతిక దృక్పథంలో, ఈ దేహంలో ఉండే జీవాత్మ తనను తాను ఈ నవ ద్వార పట్టణం తో అనుసంధానం చేసుకుంటుంది. (తను శరీరమే అనుకుంటుంది). లోకంలోని సమస్త భూతములను నియంత్రించే పరమేశ్వరుడు కూడా, ఈ దేహములో స్థితమై ఉంటాడు. ఎప్పుడైతే జీవాత్మ, భగవంతునితో అనుసంధానం అవుతుందో, ఈ శరీరంలో వసిస్తున్నా, అది ఆయన లాగే స్వేచ్చను పొందుతుంది."

ఈ క్రితం శ్లోకంలో జీవాత్మ దేనికీ కూడా కర్త కాదు, కారణం కాదు అని ప్రకటించాడు, శ్రీ కృష్ణుడు. మరైతే, ఈ లోకంలో అన్ని కర్మలకు భగవంతుడే కారణమా?
కాదు ఇదంతా ప్రకృతి నియమం ప్రకారం జరుగుతుంది. ఎవరైతే ప్రకృతి మాయలో ఉంటారో వారు భద్దులు అవుతారు.

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ ।
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ।। 13 ।।

WHO R U

*నీవు ఎవరు*

*64 లక్షల జీవకణాలు* అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..
అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది.
ఈ దేహం నేనే అంటాం.
కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.
చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది.
అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.
ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?
ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆదేవుడిచ్చిన పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో.
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం ఔతాయి.
రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.
ఈ దేహం దేవుడిచ్చిన ఒ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.
కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్.

Sunday, June 28, 2020

SHANKHAM శంఖం

శంఖం

భారతీయ సంస్కృతిలో 'శంఖం'కు ప్రత్యేక స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం. క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మధన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి.

ఆధ్యాత్మికంగా శంఖం 
శంఖం ఆధ్యాత్మికంగా చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది. దక్షిణావర్త శంఖం ఎంతో శ్రేష్ఠమైంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అదే విధంగా అర్జునుడి శంఖాన్ని దేవదత్తంగానూ, భీముని శంఖం పౌండ్రకం అనీ, యుధిష్ఠరుని శంఖాన్ని అనంత విజయమనీ, నకులుని శంఖాన్ని సుఘోషనామంతో, సహదేవుని శంఖాన్ని మణిపుష్ప అన్న పేర్లతో పిలుస్తారని మహాభారతకథ చెబుతుంది. వైరివర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడమన్నది యుద్ధ నియమాలలో ఒకటి. విజయ సూచికంగా కూడా శంఖాన్ని పూరించడమన్నది ఓ ఆచారం.  

లక్ష్మీ, శంఖం సముద్ర తనయలని విష్ణుపురాణం చెబుతోంది. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు శంఖం యొక్క పీఠభాగంలోనూ, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలో ఉంటారు. విష్ణు మూర్తి దుష్ట శక్తులను పారద్రోలడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది.

నిజానికి శంఖం జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి మనకు తెలిసినదే. నవ నిధులు, అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. ఫూజా, ఆరాధన, యఙ్ఞాలు, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక, ధార్మిక ఉత్సవాలు, యఙ్ఞాలు, శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు. శంఖాన్ని పూజిస్తారు. 

శంఖాలలో వివిధ రకాలున్నాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం, మధ్యమావర్త శంఖంగా చెప్తారు. వీటిలోనూ లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి. భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

పూజ గదిలో దక్షిణావర్త శంఖం 
సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది. అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి. 

ఫలితాలు
శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది. శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుకుతనం వృద్ధి చెందుతుంది. ఊపిరితిత్తు పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది. శంఖం ఊదడం వల్ల గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి. 

దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగకారకాలైన క్రిములు నశిస్తాయి. శంఖారావం వల్ల మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని, ఆ ధ్వనిని వినడంవలన గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతాయంటారు.

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపులలో చేరాలి అనుకునే వారు, ఈ క్రింది లింకుల మీద క్లిక్ చెయ్యండి

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపులలో చేరాలి అనుకునే వారు, ఈ క్రింది లింకుల మీద క్లిక్ చెయ్యండి

1. https://chat.whatsapp.com/B8Czi4F8kM66LSUcRpAe2o

2. 
https://chat.whatsapp.com/BiqhcyUX6H89wFCWm5liRd

3. https://chat.whatsapp.com/COiZjiWEAdHAfynhMUvjSI

4. https://chat.whatsapp.com/Io0im5zVx4f2TstTq0NIYj

5. https://chat.whatsapp.com/L6pzTybEdztLjTWRY5w4iP

6. https://chat.whatsapp.com/Ctw7H85PFTB77uwKKFnkCl

7. https://chat.whatsapp.com/FTAD8XapQUZACedJnxaTZG

టెలిగ్రామ్: http://t.me/joinchat/AAAAAFjgsZ5e6KQX9WtkhQ

పై సమూహాలలో ఖాళీలు లేకపోతే 99127 31349 కి వాట్సాప్ లో సందేశం పంపగలరు. మీకు వివరాలు పంపబడతాయి

దయచేసి ఈ సందేశాన్ని మీకు తెలిసిన అన్ని వాట్సాప్, ఫేస్బుక్ తదితర సమూహాలకు పంపగలరు. సమూహంలో వీలైనంత మందిని చేర్చి, ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగం కండి

ఇట్లు 

సమూహ నిర్వాహకులు

SHADHANACHATHUSTAYA SAMPATHI

 సాధనాచతుష్టయ సంపత్తి

🌹 శమము 🌹


✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ 

దమము  అంటే బాహ్యేంద్రియ నిగ్రహము (ఇంద్రియములు మరియు భోగ్య వస్తువులు మధ్య ) -   ఇంద్రియ నిగ్రహము 

 శమము అంటే అంతరెంద్రియ నిగ్రహము (మనస్సుకు ఇంద్రియములకు  మధ్య  )  - మనో  నిగ్రహము  అని చెప్పినప్పటికీ సాధనా పరముగా రెండు కలిపే జరుగుతూ ఉంటాయి.
 
ప్రాపంచిక వస్తు సంపదలు, విషయ సుఖములందు బంధమున్నదని గ్రహించి విముఖత  కలిగి ఉండి మనస్సును ఇంద్రియములతో కూడనివ్వక ఆత్మ లక్ష్యమందు  నిలుపుట  శమము.
 
మనము గాఢముగా ఏదైనా విషయమును గురించి ఆలోచిస్తున్న సమయమున మన ముందు జరిగిన సంఘటనలను కుడా మనము గుర్తించలేము. అంటే మనస్సు ఇంద్రియములతో జోడిస్తేనే విషయములను గ్రహించాగలుగుతాము.  

కనుక ఇంద్రియ నిగ్రహ సాధనల వలన మనో నిగ్రహము బలపడితే  మనో నిగ్రహ  సాధనల వలన ఇంద్రియములు సులువుగా స్వాధీనమవుతాయి.
 
మనస్సు ఎందుకు బహిర్ముఖము అవుతుంది?
- విషయ సుఖములందు  ఆసక్తి వలన
- విషయ సుఖములకు కావలసిన వస్తు సంపదలను ప్రోగుచేసుకోవలననే  కోరిక వలన విషయాసక్తి

- విషయ వైరాగ్యము వలన, వస్తువుల కున్న పరిమితులు  గుర్తించుట వలన
- వస్తు సంపదలు, విషయ సుఖములందు ఉన్న బంధము, దోషములను గుర్తించుట వలన    తొలగుతుంది.
 
మనస్సు ఎందుకు అలజడికి లోనవుతుంది?
- జగత్తులో వ్యవహార సమయమున ప్రతిఫలము పట్ల  ఆసక్తి కలిగి ఉండుట వలన
- జీవితములో జరుగుచున్న సంఘటనలను అంగీకరించలేక  పోవుట వలనను
 
ఇవి  
- దైవీసమర్పణ  భావనతో, ప్రతిఫలాపేక్ష రహిత కర్మ చేయుట వలన
- ఈశ్వర నియతిని (కర్మను) అంగీకరించుట వలనను  తొలగుతాయి.
 
ఎప్పుడైతే మనస్సు బహిర్ముఖము కాక, అలజడికి లోనుకాక  శాంతముగా ఉంటుందో  అటువంటి మనస్సు ఆత్మ జ్ఞాన విచారణకు, తనను తానూ తెలుసుకొనే దిశగా ప్రాయాణించుటకు అనుకూలముగా ఉంటుంది.
 
ఈ విధముగా మనస్సును శమింప చేయుటను శమము అంటారు.
 
ప్రాణాయామము, జపము,  ఉపాసన మొదలగునవి శమమును పెంపొందించుకొనుటకు ఉపయోగ పడు సాధనలు.
🌹 🌹 🌹 🌹 🌹

DAILY FACTS

నిత్య సత్యాలు



🍂మూసి ఉన్న గుప్పిటి , మూసి ఉన్న మనస్సు యితరులకు
మంచి చేయలేవు . యితరులనుండి మంచిని స్వీకరించలేవు .

 🍂" నేను - నాది " అనే స్థితి నుండి "మనము - మనది " అనే
మహోన్నత స్థాయికి ఎదగాలి నేటి మానవాళి .

 🍂ప్రోత్సాహం కోసం ఎదురు చూడకుండా ఉత్సాహం తో మంచిపనులు చేస్తూ ముందుకు పోవాలి .

 🍂సంక్రమించిన ధనం తో సంతోషాన్ని పొందగలము . కానీస్వయము కృషి తో సంపాదించిన ధనం తో ఆత్మ సంతృప్తిపొందగలము

 🍂కలసి మెలసి జీవించడం బలం . ఒకరినొకరు కలబడటం
బలహీనం .

 🍂తాళంచెవి లేని తాళాలు ఉండవు . పరిస్కారం లేని
సమస్యలు ఉండవు .

 🍂మెల్లగా నడిచినా పర్వాలేదు .అడుగులు లక్యం వైపు ఉంటె గమ్యాన్ని తప్పక చేరుకోగలం .

 🍂అసత్యం తో సాధించిన విజయం కంటే , సత్య మార్గం లో నడచి పొందిన ఓటమి గొప్పది .

🍂 నేను - నాది , నువ్వు - నీది అనే ఈ నాలుగు పదాలు
అనేక సమస్యలకు మూల కారణాలు

🍂 లేనివారికి ఆకలి భాధ , ఉన్నవారికి యింకా కావాలనే
బాధ . నిజానికి యిద్దరివి బాధలే .

 🍂ధనాన్ని సంపాదించడం యెంత కష్టమో , దానిని
రక్షించుకోవడం కూడా అంటే కష్టము .

 🍂గొప్పవారైనా మరణించక తప్పదు . కానీ గొప్పదనానికి
మరణం ఉండదు .

 🍂క్షమా గుణం చేతకానితనం కాదు . క్షమించాలంటే
కొండంత మనో బలం ఉండాలి .

 🍂మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం , మనకు
మనమే మిత్రులం . మనకు సమానమే శత్రువులం .

 🍂మన సమస్యలకు , దుఃఖాలకు మనమే కారణం
యితరులు కారణం అనుట దారుణం .

 🍂యితరులను జయించటానికి ప్రయత్నిమ్చుట కంటే
నిన్ను నీవు జయించటానికి ప్రయత్నిమ్చు .

 🍂మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమే కాదు ,
మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి .

 🍂జ్ఞానాన్ని తెలుసుకోవడం యెంత ముక్ష్యమో , తెలుసుకొన్న
జ్ఞానాన్ని జీవితం లో ఆచరించడం అంతకంటే ముఖ్యం .

 🍂ధనం పరుల పాలు - కుటుంబ సభ్యులు , బంధువులు
స్నేహితులు స్మశానం వరకు - శారీరం చితి పైకి - నీ
కర్మ ఫలితం మాత్రమే నీ వెంట వస్తుంది .

 🍂కర్మలను విత్తనాలతో పోల్చవచ్చును . ఏ విత్తనము వేస్తె ఆ ఫలమునే పొందుతాము . అలాగే నీవు చేసే కర్మలు
ఎటువంటివో అటువంటి ప్రారబ్దాన్ని పొందుతావు .

 🍂ఒక రోజు పూర్తి అయింది అంటే , ఆయుస్సు లో ఒక రోజుతగ్గిందని అర్ధము . అందువలన సత్కర్మలు యెంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది

https://drive.google.com/file/d/1NALADe6F7q0ft_yjVki-8isZkvnbGopM/view?usp=drivesdk

నేను యోగనిద్ర లింకు పెట్టాను చాల మంది open కాలేదు అని message  పెట్టారు.

మీకోసం ప్రత్యేకంగా లింకు చేయించి పెట్టాను. ఇప్పుడు తప్పనిసరిగా open అవుతుంది. 

ఎందుకు పంపిస్తున్నానంటే డాక్టర్ మాణికేశ్వరరావు గారు ఎంతో కష్టపడి యోగ నిద్ర ఆడియో చేశారు.

మీరు పడుకొని కళ్ళు మూసుకొని వింటూ ఉంటే ప్రపంచాన్ని  మరచిపోతారు.
మీ బాధలు కష్టాలు టెన్షన్ అన్ని మరచిపోయి ఆనందిస్తారు 
 అంత అద్భుతంగా ఉంటుంది 

ఇది నా స్వానుభవం 


రాహు కేతువులు-ఆత్మవిద్య హేతువులు!

రాహు కేతువులు-ఆత్మవిద్య హేతువులు!


ఆధునిక విఙ్ఞానం రాహు కేతువులను ఒప్పుకోదు, ఇవి గ్రహాలు కావు, గ్రహణం రోజున రాహువు మింగటం, కేతువు మింగటం ఇలాంటివి హాస్యాస్పదం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.మంచిదే!ఇవి గ్రహాలు అని శాస్త్రం కూడా చెప్పటం లేదు.జ్యోతిషం రవిని, చంద్రుని గ్రహాలుగా చెప్పటం ఏమిటి? రవి నక్షత్రం కదా, చంద్రుడు ఉపగ్రహం కదా అని అడిగే వాళ్లు ఉన్నారు. గ్రహించేది గ్రహం. ఇది ప్లానెట్, ఇది సేటలైట్ అనే విభజన వేరు. మహర్షులు మానవ జీవితం మీద ఏదైతే ప్రభావం చూపుతున్నదో అది గ్రహం అని గుర్తించారు. మనిషి కూడా గ్రహమే! వీడికీ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం ఉన్నాయి.భూమి మీద ఏ పరిమాణంలో నీరు, గట్టి పదార్థాలూ ఉన్నాయో, మానవ శరీరంలో కూడా అదే పరిమాణంలో నీటికి సంబంధించిన పదార్థాలు, గట్టి పదార్థాలూ ఉన్నాయి. నదులు కొండలలోని రాళ్లలోంచి పుడుతున్నాయి. రక్తం బోన్ మేరో నుంచి పుడుతున్నది.ఒక కుమ్మరి వాడు కుండను తయారు చేసేటప్పుడు క్రిందనున్న మట్టి తిరిగి తిరిగి స్పందించి అందులోంచి కుండ పై భాగం అలా తయారవుతూ ఉంటుంది. అలాగే భూమి దక్షిన ధృవం స్పందించి, స్పందించి ఈ ఆకారానికి వచ్చింది. ఉత్తర ధృవం అందుచేత కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. భూమి ఎందుకు ఆగదు? ఆగితే ఒక వైపుకు పడిపోతుందా? అంటే ఒరిగిపోకూడదని బొంగరం లా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నదా? నిజమే! స్పందన వలన శక్తి, శక్తి నుంచి తిరిగి స్పందన…ఇదే సృష్టి యావత్తులోనూ ఉన్న రహస్యం.ఆరు వేదాంగాలలో ఒకటైన జ్యోతిష శాస్త్రం యొక్క మరో పేరు ఆత్మ విద్య. జ్యోతి-స్థూలంగా చెప్పాలంటే లైట్, సూక్ష్మంగా చెప్పాలంటే ఙ్ఞాన జ్యోతి. దీనిని దర్శించే వాడు జ్యోతిష్కుడు! జ్యోతిషం కేవలం భవిష్యవాణి కాదు. కాలక్రమంలో ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందటం వలన జ్యోతిష్కుడు అనగానే కాల్ళూ చేతులూ చూసే వాడు అనుకుంటారు. కాదు. ఇది ఒక వైఙ్ఞానికపరమైన, తాత్వికపరమైన, ఉపాసన పరమైన సంక్లిష్టమైన శాస్త్రం. సృష్టికి సంబంధించిన రహస్యం ఇందులో ఉంటుంది.కాలము, జ్యోతి (వెలుగు) ఈఓ రెండిటి యొక్క ప్రభావం ప్రాణ శక్తి మీదా, మనిషి జీవితం మీదా ఎలా ఉంటుంది అనేది ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది.చీకటి వెలుగులు జీవితం లోని భాగాలే కావు. సృష్టి ఆద్యంతం వెంట ఉండే విషయాలు. వీటి మధ్య ఎన్నో ప్రక్రియలు, ఎన్నో యుగాలు. ఒకటి లేకుండా మరొక దానిని అధ్యయనం చేయటం కుదరదు. ఆ చీకటి గృహాలె ఈ రాహు కేతువులనబడే అప్రకాశ గ్రహాలు.ఒక గ్రహణం సంభవించినప్పుడు మూడు వరుసలోకి రావటం మనం చూస్తాం. గణిత శాస్త్రం ప్రకారం రెండు వస్తువుల మధ్య అతి తక్కువ దూరం ఒక తిన్ననైన గీత! అంటే ఒక గ్రహణం సంభవించినప్పుడు ఈ మూడు-సూర్యుడు, చంద్రుడు, భూమి అతి తక్కువ దూరం లోకి వస్తాయి.అప్పుడు పరస్పరం శక్తులను ఇచ్చి పుచ్చుకుంటాయి. దీనినే సినర్జీ అంటారు. ఈ సమయంలో వీటి మధ్యనున్న నీడ ఈ ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియకు మార్గం అవటం వలన ఒక ఛార్జ్ లా ఆ గ్రహణ సమయంలో పని చేస్తుంది. దీనినే మహర్షులు రాహువు లేదా కేతువు అని చెప్పి దాని తాలూకు స్పందన-మంత్రాన్ని దర్శించి మనలో జరిగే స్పందనకు అనుగుణంగా జపించి యున్నారు. ఈ రోజు భాషలో దీనిని మనం మోడరేషన్ అంటాము! 1980-81 లో జరిగిన సంపూర్ణ సూర్య గ్రహణం సమయం లో రైలు వస్తున్నప్పటికీ చిన్న పిట్టలు పట్టాల మీద నుంచి కదలలేదు!…గోచారంలో మరి గ్రహణం అని చెప్పిన రోజున ఆ రాశిలో రాహువో కేతువో ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది. అంటే అసలు గ్రహణ నిర్ణయం మహర్షులు అంత సూటిగా ఎలా చెప్పారూ అంటే రాహు కేతువుల స్థానం బట్టి, వాటి సంచారాన్ని బట్టి, సూర్య చంద్రుల సంచారాన్ని బట్టి అని అర్థం!రాహు, కేతువులు:విఙ్ఞానం మనకి బిగ్ బాంగ్ అని చెబుతుంది. ఈ అంతరిక్షం యావత్తూ ఒక విస్ఫోటనంతో ఏర్పడినదని ఒక అంచనా.మంచిదే! శాస్త్రం ఏమంటోందంటే నవగ్రహ కూటమి ఒక వృత్తాకారంలో జడత్వంతో ఉన్న సమయంలో ప్రకాశం ఒక దిశగా పయనిస్తూ ఈ కూటమిని తాకి ఆ వేగంలో వృత్తానికి అవతల ప్రక్కకు వెళ్లిపోయింది. ఆ తేజస్సుకు ఈ గ్రహాలన్నీ చేతనత్వాన్ని పొందాయి. స్పందిచటం ప్రారంభించాయి. ఆకారంలో పెరగటం మొదలు పెట్టాయి. ఒక నిర్దిష్టమైన వృత్తంలో తిరుగుతున్నాయి. తిరుగుతున్నాయి కాబట్టి వృత్తం ఏర్పడినది. కూటమికి ప్రకాశం ముందు తగిలిన చోట సర్పం ఆకారంలో కనిపించిన నీడను రాహువు అని, వృత్తం అటు వైపు-180 డిగ్రీల లో కనిపించిన అవతలి నీడను శిఖి (కేతువు) అని చెప్పారు. ఈ నీడలు రెండూ అపసవ్యంగా తిరిగాయి. కారణం ఏమిటంటే ఇవి గ్రహాలన్నిటి నీడలు కలబోసుకుని వాటికి భిన్నంగా కదులుతాయి. వీటి మధ్యన ఉన్న గ్రహాలన్నీ ఒక చక్రంలో బంధింపబడ్డాయి-అదే రాశి చక్రం. ‘ రాహువు ‘లోని మొదటి అక్షరం-రా, ‘ శిఖి ‘లోని మొదటి అక్షరం ‘ శి ‘ తీసుకుని రాశి చక్రం అన్నారు!అంటే రాశి చక్రం అనేది కెవలం మన జన్మ కుండలి కాదు.ఇది సృష్టి యావత్తునూ ప్రదర్శించే 360 డిగ్రీల కుండలి! ఇదే సిమెట్రీ! ఒక వృత్తం ఎంత పెద్దదైనా కావచ్చును. దాని కేంద్రం ఒకటే! అది కూడా వృత్తమే! సృష్టిలోని అతి పెద్దది-అనంతం, అతి చిన్నది కూడా అనంతమే! మరి గణితం కూడా అదే చెబుతుంది.1/10=10/100=100/1000…ఇలా నేను ఒకటి ప్రక్కన న్యూమరేటర్ లో అనంతమైన సున్నలకు ఒకటి తక్కువగా పెట్టి డినోమినేటర్ లో ఒకటి ప్రక్కన అనంతమైన సున్నాలు పెట్టినా ఆ ఫలం 1/10 మాత్రమే!అదే తమాషా! అటు అనంతం, ఇటు మనం. అది ఇందులో ఉంది-అణువులాగా!రాహు కేతువులు మనకు ఎన్నో విషయాలు చెబుతాయి. ప్రస్తుతం మామూలుగా జ్యోతిష సాస్త్రం జాతకంలో వీరి పరిస్థితిని ఎలా వివరిస్తుందో చూద్దాం. దానికి ముందు ఈ ఇద్దరి గురించీ విపులంగా ఎక్కడ చెప్పారో పరిశీలిద్దాం. బృహత్ జాతకంలో రాహువును తమస్ అని, అగు అని, అసుర అని పేర్కొన్నారు. కేతువును శిఖి అని చెప్పారు. పరాశరుడు, యాఙ్ఞ్యవల్క్యుడు రాహు కేతువులను ఏడు గ్రహాలతో పాటుగా ప్రధానంగా పేర్కొన్నారు. వీరి ఉత్పత్తి, ప్రభావం,ఇలాంటివి మత్స్య పురాణంలో కూడా చెప్పి యున్నారు.రాహువును నల్ల రంగులో, రౌద్రాకారంలో,కత్తి ధరించి సింహారూఢుడై యున్నట్లు వర్ణించారు.కేతువు గద పట్టుకున్నట్లు,గృధ్ర వాహనునిగా వర్ణించారు.శాస్త్రం రాహువుకు అధిదేవత దుర్గ యని, ప్రత్యధిదేవత నాగదేవతయని, కెతువుకు అధిదేవత చిత్రగుప్తుడని, ప్రత్యధిదేవత బ్రహ్మ యని చెబుతున్నది. రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతువు మహర్దశ 7 సంవత్సరాలని మనకు తెలిసినదే!రాశి చక్రంలో రాహు కేతువుల గీత చాలా ప్రధానమైనది. వీరు 18 మాసములు అయిన తరువాత అపసవ్య మార్గంలో రాశులు మారుతారు. గోచారంలో గురు, శని తరువాత ప్రధానంగా గణించ వలసిన గ్రహాలు రాహు కేతువులు. రాహు కేతువులు ఏయే స్థానాలలో ఎటువంటి ఫలితాలనిస్తారనేది పరిశీలిద్దాం. ఒకరి జాతకంలో-రాశి చక్రంలో లగ్నాత్ రాహువు:మొదటి స్థానం(లగ్నం లో)లో ఉంటే ధైర్యవంతులు,సహాయం చేయు వారు,కానీ కొద్దిగా ముఖం మీద మచ్చలు ఉండు వారు ఉంటారు.రెండులో ఉంటే ఎక్కువగా విందులు చేయు వారు,నల్లని వారుగానూ,వివాహేతర సంబంధాలు కోరు వారు కనిపిస్తూ ఉంటారు.మూడులో ధనవంతులు,మంచి క్రీడాకారులు, సాహసాలు చేయు వారు అవుతారు.నాలుగులో ఉన్నప్పుడు బహు భాషా కోవిదులు, అయిదులో ఉన్నప్పుడు క్రూర స్వభావం గల వారు, గర్భం విషయంలో సమస్యలు ఎదుర్కొనటం, ఆరులో ఉన్నప్పుడు పెద్ద బంధు వర్గం కల వారు,శత్రు రహితులు గానూ,ఏడులో ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి ఆరోగ్య భంగం,చక్కెర జబ్బు,మంచి భొజనం కలుగ చేస్తాడు. ఎనిమిదిలో సంకుచితమైన ఆలోచనలు,పోట్లాటలంటే ఇష్ట పడే వ్యక్తిత్వం,తొమ్మిదిలో భయపడే వ్యక్తిత్వం, పదిలో ఉన్నప్పుడు మంచి కళాకారులు,యాత్రికుదు,రచయితలు తయారవుతారు.పదకొండులో ధనవంతులు,సంఘంలో గౌరవం కల వారు,మంచి సంతానం కల వారు,వ్యవసాయదారులు ముందుకు వస్తారు.పన్నెండులో ఉన్నప్పుడు తాత్విక పరులు,కళ్ల జబ్బులు ఉన్నవారు ముందుకు వస్తారు.కేతువు లగ్నంలో ఉంటే ఎక్కువగా చెమట పూయటం,మంచి ప్రజా సంబంధాలు ఉందటం, రెండులో ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోవటం, శాంత స్వభావం,మూడులో శక్తిమంతులు,పేరు గలవారు, నాలుగులో గొడవలు పెట్టుకునే వారు,అయిదులో పిల్లలకు ఇబ్బందులు కలుగచేయటం,ఆరులో మాటకారితనం,ఏడులో భాగస్వామికి సమస్యలు,ఎనిమిదిలో నిదానం, తొమ్మిదిలో చత్వారం, మంచి జీవిత భాగస్వామి,పదిలో తాత్విక చింతన,పదకొండులో మంచి హాస్యం,ధనం, పన్నెండులో విదేశ యానం ఇలాంటివి కనిపిస్తాయి.సామాన్యంగా రాహు కేతువులు అప్రకాస గ్రహాలు కాబట్టి ఏ రాశిలో ఉంటాయో, ఆ రాశి యొక్క అధిపతి ఇచ్చు ఫలితాలని ఇస్తాయి.ఇక్కడ చెప్పిన ఫలితాలు నామ మాత్రానివే. ఒక జాతకంలో అన్ని విషయాలనూ, గ్రహాలనూ పరిశీలించకుండా ఒక నిర్ణయానికి రాకూడదు!రాహు కేతువులు-ఆరోగ్యం:రాహువు దుర్ఘటనలను, ప్రయాణాలలో సమస్యలను, దుష్ట ప్రయోగాలను శాసిస్తాడు. సరీరంలోని కాళ్ల విషయంలో రాహు కెతువులు చాలా సక్రియంగా ఉంటారు.ఆరోగ్యం విషయంలో వీరిరువురు ఎవరితో కలసినా ఇబందే! ఆ గ్రహం , భావం లేదా రాశి పీడితమైనదని తెలుసుకోవాలి.కేతువు సామాన్యంగా స్త్రీల విషయంలో మాసిక సమస్యలను చంద్రునితో కలసి అంద చేస్తాడు. లగ్నాత్ అయిదులోనూ, ఏడులోనూ ఉంటే శరీరంలో ఏవో లంప్స్, ట్యూమర్లు ఇలాంటివి కనపడ వచ్చును. ఎనిమిదిలో చర్మ వ్యాధులు ఉందవచ్చును.రాహువు విష ప్రయోగాన్నీ, అర్థం కాని అనారోగ్యాన్నీ సృష్టిస్తాడు.కెతువు పుండ్లను శాసిస్తాడు. రాగువు కేతు నక్షత్రంలో (అస్విని, మఖ, మూల) ఉంటే దారుణమైన ఏక్సిడెంట్లను ఇస్తాడు. ఆ దశలో జాగ్రత్త వహించాలి. రాహువు ఆర్ద్ర 3, 4 పాదాలలో ఉంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. నాల్గవ పాదంలో ఉంటే చెడు అలవాట్లకు లోనవుతారు.అలాగే స్వాతి మొదటి, నాలుగు పాదాలలో రాహువు ఉంటే ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాహువు శతభిషం రెందవ పాదంలో ఉంటే కోపిష్ఠి, మూడవ పాదంలో ఉంటే కాలేయ సమస్యలున్నవారు ఉంటారు.కేతువు అస్విని మూడవ పాదంలో ఉంటే ఆరోగ్యం విషయం లో జాగ్రత్త వహించాలి.అలాగే మఖ 1,2,3 పాదాలలో ఉన్నా అనారోగ్యం,మూల 1,2 లో ఉన్నా జాగ్రత్త వహించాలి.రాహు కేతువులు ఎవరి దశలో ప్రవేశించినా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వారి దశలలో ముఖ్యంగా గుండె విషయంలొనూ, విష జ్వరాల విషయంలొనూ జాగ్రత్త వహించాలి.లాభాలు:రాహువు మంచి కూడా చెస్తాడు. రాహువు మంచి స్థానంలో ఉండి గురువు చేత 5 లేదా 9 దృష్టి కలిగి యున్నప్పుడు రాజయోగం, సంఘంలో గౌరవం ఇస్తాడు. పన్నెండులో ఉన్నప్పుదు చక్కని తెలివి తేటలిస్తాడు. కేతువు ఆరులో ఉన్నప్పుడు కీర్తి, జ్యోతిష శాస్త్రం, జరిగేది తెలియటం ఇలాంటివి ఇస్తాడు. అలాగే రెండులో ఉన్నప్పుదు మార్కెట్ వలన లాభాలూ, పదకొండులో ఉన్నప్పుడు లాటరీలు ఇస్తాడు. కేతువు తాత్వికమైన గ్రహం. సంప్రదాయ బధ్ధమైన ఉపాసన ఇస్తాడు కేతువు.కాలసర్ప దోషం:కాలసర్ప దోషం అనేది నిజానికి ఒక యోగం. నూటికి 70 మందికి ఇది ఉంటుంది. దీని వలన భయం ఏమీ లేదు.రాహు కేతువుల ఏక్సిస్ లోపల అటు కానీ ఇతు కానీ ల్గ్నం, చంద్రునితో పాటు అన్ని గ్రహాలూ ఉన్నప్పుడు ఈ గ్రహాలన్నీ నీడలోకి చేరాయి కాబట్టి వాటి శక్తి బయటకు రాదని కాలసర్పదోషం అని నిర్ణయిస్తారు. శ్రీకాళహస్తిలో నివారణ చేయించుకుంటే ఇది యోగంగా మారుతుందని ప్రతీతి.కొందరు మిత్రులు లగ్నం లెదా చంద్రుడు బయట ఉన్నప్పుడు ఈ దోషం ఉంటుందా అని అడిగారు.వివాహం విషయంలో దీనిని కూడా పరిగణించటం మంచిదని శాస్త్రం చెబుతున్నది. కారణం ఏమిటంటే యోగాలు చంద్రుని బట్టి ఎక్కువ గణన లోకి వస్తాయి కాబట్టీ, మరల గోచారం చంద్రుని నుంచి నిర్ణయిస్తాము కాబట్టీ నివారణ చేయటం అవసరం అవుతుంది.కొన్ని గ్రంథాలలో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఒక్కో స్థానాన్ని గణించి డిగ్రీలు కూడా లెక్క లోకి తీసుకుని ఆ స్థానం ఫలించనప్పుడు రాహు కెతువుల మధ్య వచ్చాయా అనే సంగతి కూడా చూడటం జరుగుతున్నది. అంత అవసరం లేకపోయినా ఇంత చాలు. తమిళ నాడులో ఒక ఆచారం ఉంది. దోషం ఉన్నా, లెకపోయినా వివాహ వయసు వచ్చిన కన్యలందరికీ నివారణ చేయిస్తారు…శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తి లోని ఈశ్వరుడు నవగ్రహ కవచ ధారి! ఆయనకు ఎదురుగా సూర్యుడు ఉంటాడు. శివాలయంలో ఇది అరుదు! శివుడు ఇక్కడ భక్తుల గ్రహ దోషాలన్నీ సూర్య్ని సాక్షిగా హరించి వెస్తాడు! అలాగే ఈ కాలసర్ప దోషాన్ని నివారించి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మరొక విశేషం కలదు. అమ్మవారు శ్రీ ఙ్ఞాన ప్రసూనాంబ ఎదురుగా ఉన్న ప్రాకారంలో నేల మీద ఒక పద్మం ఉంటుంది. దీని మీద నిలబడి చూరు పైకి చూస్తే రాహువు యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని చూస్తూ ఆత్మ ప్రదక్షిణ చేయాలి. అలా చేస్తూ పేరు, నక్షత్రం, గోత్రం మన్సులో చెప్పుకుని అమ్మవారిని రాహువు నుంచి కాపాడమని కోరాలి. చాలు! ఈ జన్మకు మనలను రాహువు బాధించడు.రాహువు దుర్గా ఉపాసన ఉన్న వారిని బాధించడు. దృష్టి దోషం సామాన్యంగా రాహువు డిపార్ట్మెంట్! దుర్గా సప్తశ్లోకీ, ఖడ్గమాలా స్తోత్రం, చండీ ధ్వజ స్తోత్రం చదువుకునె వారికి రాహువు బాధలు ఉందవు. సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్నవారికి, నాగ పూజ ఉన్నవారికీ, ఇంటిలో నాగ పడిగ భూమి మీద పాలతో అభిషేకం చేయు వారికీ, కేతువు వలన ఇబ్బందులు ఉండవు.దశలో కానీ, గోచారంలో కానీ రాహువు సమస్య ఉన్న వారు 1800 గ్రాములు నల్ల మినుములు శివాలయంలో దానమిచ్చిన మంచి ఫలితాలను పొందగలరు.రాహువు సంఖ్య 18. ఒకప్పుడు అయ్యప్ప యాత్ర శ్రీకాళహస్తి నుంచి ప్రారంభమయ్యేదని చెబుతారు. అయ్యప్ప గుడి మెట్లు 18.దీక్షలో రాహువు రంగు నలుపు వస్త్రాలు ధరిస్తారు. మహాభారత రణరంగం 18 రోజులు…సంఖ్యా శాస్త్రంలో 18 అంకె-రవి(1), 8(శని) కలసిన సంఖ్య ఇది.అనగా సూర్యోదయం-వెలుగు,పడమర దిక్కు, రిసైక్లింగ్ చేసే శనికి కలిగే సంయోగం ఇది. ఆది, అంతం కలసిన ఏమిటి? యుధ్ధం.ఇదే వెలుగు నీడల యుధ్ధం.రాశి చక్రంలోని వెలుగు నీడల పర్యంతం మన జీవితం అలా సాగిపోతుంది.రాహువు నీడను-మృత్యువును గుర్తు చేస్తూనే ఉంటాడు. అటు చివర కేతువు ఉపాసన మార్గం ద్వారా మోహాన్ని జయించి అమృత తత్వాన్ని తెచ్చుకో మంటాడు.రాహు కేతువులు ఇద్దరూ ఒక శరీరమే.పురాణం మనకు చెబుతుంది.ఒకరు తల భాగం, ఒకరు అధో భాగం. ఈ రెండిటినీ అధిగమించే సారమే అమృతం.అదే ‘తమసోమా జ్యోతిర్గమయ!’ అనే ప్రార్థన, వేదం లోని మహావాక్యం.అదే జ్యోతిషం!!

I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA

SOFTWARE COMPANY YOGA CLASSES CONDUCTED BY ME

 

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS

My photo
Vijayawada, andhrapradesh, India
I AM YOGA TEACHER

Goolgepay Phone pay Paytm

Donate for our yoga center paytm : 8977277742
YOGA  personal & online yoga training availability anywhere the world

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA &FITNESS CLASSES AT YOUR DOOR STEPS FROM THE POINT OF INDIAN TRADITIONAL YOGA FOCUSED AREA: GENERAL FITNESS & OBESITY(OVERWEIGHT REDUCTION) TRAINING CLASSES AT THE STUDIO COVERING ALL HEALTH PROBLEMS SPECIALIZATION : PRANAYAMA | PRANIC HEALING | MEDITATIVE