Sunday, October 16, 2022

మిర్రర్ ని మంత్ర

 మిర్రర్ ని చూస్తూ మంత్ర జపం చేయడం, దాని ముందు కూర్చుని అలాగే ధ్యానం చేయడం, ఇలా కొంత కాలం (మొదట్లో) చేస్తూ ఉండగా, నాకు అద్దంలో రకరకాల రంగులు, ఆకారాలు, కొన్ని సంఘటనలు వరుస క్రమంలో, కొన్ని సార్లు పూర్తి స్థాయిలో..... ఆ సంఘటన లో నేనే ఉన్నాను, అనేంత గాఢమైన స్థితిలో!! ఇంకా కొన్ని సార్లు spirits కనబడేవి. సాధన మొదటి దశలో ఉండగా కనిపించే రంగులు స్పష్టం గా ఉండేది కాదు!! మిర్రర్ ముందు కూర్చుని చూడగానే మిర్రర్ కి బదులుగా ఓ పెద్ద కాంతి వలయం గానీ పూర్తిగా ఓ ఆకారం కానీ కనబడేది. దానినే చూస్తూ ఉంటే దానికి సంబంధించిన మరో విషయం కనిపించేది!! అయితే ఈ రంగుల విషయంలో నేను చాలా కన్ఫ్యూజన్ అయ్యే వాడిని. ఎందుకు అంటే నాకు కనిపించిన రంగులు ఇంత వరకు సాధారణ నేత్రాలకు కనిపించవు. అవి. వాటికి ఏ పేరుతో పిలవాలో లేక పిలుస్తారో కూడా తెలియదు. మనకు తెలిసిన భాషలు ఆ రంగులకు పేర్లింకా పెట్టలేదు. ఈ ఆరా (Aura) గురించిన కొన్ని పుస్తకాలు కూడా చదివాను. కానీ వాటి ద్వారా నాకు పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ పుస్తకాల్లో వివరించే రంగుల గురించి నేను చూసే రంగులకు పెద్ద వ్యత్యాసం ఉంది. ఆ పుస్తకంలో కోపం వస్తే ఓ రంగంలో, కామపూరితమైన ఆలోచనలు వస్తే మరో రంగు, ప్రేమ ఉన్న వ్యక్తి ఆరా ఇంకో రంగును కలిగి ఉంటారు అని సూచించారు. కానీ నేను నా మీద నేను కొన్ని ప్రయోగాలు చేసి చూశాను. అద్దం ముందు కూర్చుని ఒకరి మీద కోపం తెచ్చుకుని చూస్తే ఎరుపు రంగు బదులు మరో రెండు రంగులు మిళితం అయి కనిపించడం జరిగింది. అలాగే ఫోన్ లో డివోషనల్ పాటలు వింటూ చూడగా మరో రంగు. బాగా వ్యాయామం చేసి చూడగా మరో మూడు రంగులు మిళితమై శక్తిని స్వీకరిస్తున్నట్లు! నిద్ర లేవగానే చూస్తే నా ప్రాణమయ కోశం కొత్త శక్తి కలిగి తేజోవంతంగా చూశాను. అలాగే ఫ్రిజ్ లో పెట్టి మూడు రోజుల పాటు ఉంచిన కూరగాయలను తీసి చూస్తే వాటి చుట్టూ ఓ విధమైన స్పటికం రూపంలో, లైట్ స్పార్క్ కనబడింది. ఇలా కొన్ని రోజులుగా చేస్తూ ఉండగా నాకు ఈ occult science కి సంబంధించిన పుస్తకాలు చదవడం మీద ఆసక్తి పోయింది. కారణం ఏమిటి? అంటే, ఇలాంటి సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా వివరించలేకపోవడం.... ఒకటైతే ,

రెండో విషయం ఏమిటంటే..... వీటి గురించిన దర్శనాలు, అనుభవాలు, అన్ని కూడా వారి వారి అంతర్గత అభివృద్దిని బట్టి, కారణ శరీరం యొక్క అభివృద్దిని బట్టి, వారు చూసే దృష్టి కోణం బట్టి ఉంటుంది అని గ్రహించాను. ఈ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన విషయాలను ఓ పట్టాన ఇది ఇది అని ఇంటర్ప్రిట్ చేయడం కష్టం. ఇలా చేస్తూ ఉండగా నా తల మీద కొన్ని అంగుళాల ఎత్తు లో నాకు ఓ రోజు కొత్త రంగు కనిపించడం జరిగింది ఆరా కంటే కూడా కొంత తేజోవంతంగా, వేగంగా మారుతున్న రంగు అది. తర్వాత నేను ఆలోచించే ఆలోచనలు కూడా నాకు చిత్ర రూపంలో కనిపించడం.....
ఇలా ఒక రోజు నేను మా శ్రీనివాస్ మిత్రుడు ఇద్దరం కలిసి సినిమా కి వెళ్ళాం. కొంత సేపు చూస్తూ ఉండగా, ఆ సినిమా లో నటించిన నటీనటుల ఆరాలు కనిపించడం చూశాను. ఈ దృశ్యం చాలా వింతగా ఉంది నాకు మొదటి సారిగా చూడటం ఇలా. కొన్ని సార్లు ఆ షూటింగ్ టైంలొ వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అప్పుడు చూశాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఓ అలవాటుగా అయింది. రెండు సార్లు సినిమా చూస్తాను, ఒక సారి సినిమా ఎంజాయ్ చేయడానికి ఇంకో సారి వారి ఆరా చూడటానికి. తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చి ఇద్దరం టీ తాగడం కోసం బస్ స్టాండ్ కి వెళ్ళాం. ఆ బస్ స్టాండ్ లో ఉన్న వ్యక్తుల ఆరాలు మరో వింతైన రంగు ఉండటం చూశాను.
. నేను చూసింది ఆ పూర్తి బస్ స్టాండ్ యొక్క ఆరా ని!! ఖమ్మం నుండి వచ్చిన హైదరాబాద్ బస్సు అపుడే వచ్చింది. దాని యొక్క ఆరా భలేగా ఉంది. గొంగళి పురుగు పై ఉండే జుట్టు లాగా ఉంది ఈ బస్సు యొక్క ఆరా. మనకు తెలిసిన ఏడు రంగులు కాకుండా ఇతర రంగులు చాలా రకాలు ఉన్నాయి. ఈ రంగులు. ఇలా చూడటం నాకు అదే ఓ పనిగా పెట్టుకున్నాను. రోడ్డు మీద ఉన్న ఓ షాప్ వద్ద నిలబడి టీ తాగుతూ వచ్చి పోయే వాహనాల ఆరాలను చూడటం. ఒక చెట్టు వద్దకు వెళ్ళి దాన్ని చూస్తూ ఉండటం. తెల్లవారు జామున నిద్ర లేచి సూర్యోదయం అయే సమయం లో అనేక ప్రదేశాల యొక్క ఆరాలు చూడటానికి మన రెండు కళ్లు సరిపోవు. అలాగే శ్మశానం కి వెళ్ళి అక్కడ ఉండే కొన్ని రకాల స్పిరిట్స్ ని కూడా చూశాను. ఇలా చాలా చాలా అనుభవాలు!! ఈ ఫలితం వెనక శ్రద్ధ, దీక్ష, ఓర్పు ఉన్నాయి. నేను ఇదివరకు మా కొత్తగూడెం లో ఉన్న మా ధ్యాన కేంద్రానికి ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు అక్కడే ఉండి ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, ధ్యాన మిత్రులతో కలసి ఈ విషయాలపై విశేషంగా చర్చించడం. నా క్లాస్ పుస్తకాలు చదవడం చేసేవాడిని. రాత్రి అంతా ధ్యానం చేయడం, జపం చేయడం ఇదే నా పని అయిపోయింది. దసరా సెలవులు రావడంతో భోజనం చేయకుండా కేవలం ధ్యానం, జపం చేస్తూ ఉండగా, అలిసి పోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని పడుకుని ఉండగా ఓ ఇద్దరు అమ్మాయిలు నా పాదాల వద్ద నిలబడి బయటకు రా, బయటకు రా..... అని పిలిచారు. వెను వెంటనే నా శరీరం నుంచి నేను పూర్తి స్పృహతో బయటకు రావడం, తర్వాత మూడో వ్యక్తి ( మగమనిషి) పేరు అప్రస్తుతం!! నాకు ఓ పుస్తకాన్ని తెరిచి చూపిస్తూ..... ఇదిగో, ఇది నీ శరీరం, ఇందులో ఇవి ఊపిరి తిత్తులు, ఇవి మూత్ర పిండాలు ఇలా ఒక్కో అవయవాల గురించి చాలా విషయాలు వివరంగా చెబుతూ..... ప్రాణామయకోశం ఇది, ఈ రంగులో ఉంది చూశావా? మనోమయ కోశం ఇది, దీని రంగు ఇలా ఉంది..... ఇలా చూపించి తిరిగి నా శరీరం లోకి వచ్చాక ఒక్క విషయం కూడా సరిగ్గా గుర్తు రాకుండా పోయింది. కొంత సమయం పాటు. ఒక రోజు ఒక వ్యక్తి ధ్యాన మందిరం లో ధ్యానం చేస్తుంటే, ఈయన ఆరా ఎలా ఉంటుందో చూద్దాం..... అని చూస్తూ ఉండగా ఆ మందిరం పై నుంచి అత్యంత స్పష్టమైన గొంతు వినబడింది. ధ్యానం చేస్తూ ఉంటే, వారి యొక్క ఆరాను చూడటం తప్పు అని!! ఆ తర్వాత ఫేయిరీస్ కోసం ఈ మిర్రర్ సహాయం తో చెట్లపై చాల ప్రయోగాలు చేస్తూ ఉంటే ఓ రోజు వర్షం కురుస్తోంది. వాతావరణం చల్లగా ఉందని, ఆ వర్షంలో తడుస్తూ ధ్యానం చేయడానికి, ఓ వేప చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెడితే, ఓ పెద్ద మనిషి పూర్తి శరీరం అంతా ఎరుపు రంగులో ఉండి దుస్తులు లేకుండా సడెన్ గా కనబడటం గమనించి, ఉన్న ఫణంగా పరుగులు తీసి, కాళ్ళకు దెబ్బలు తగిలించుకున్నాను.
అద్దంతో సాధనలు ప్రారంభించి, అప్పటికే ఆరు నెలలు అయింది 1998 లో మిర్రర్ ముందు కూర్చుని చూడగానే, మిర్రర్ కనిపించేది కాదు. ఆ మిర్రర్ ఉన్న ప్లేస్ లో ఓ పెద్ద నీలి రంగు కలిగిన కాంతి గోళం కనిపించేది. దాన్ని చూస్తూ గురువు గారు ఇచ్చిన మంత్రం జపించే వాడిని. తర్వాత కాసేపట్లో ఆ నీలి రంగు గోళం నుంచి ఎన్నో రకాల అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, etc., etc., చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండేది, వాటిని చూస్తూ ఉంటే ఆయా ప్రాంతాల్లో మనం ఉన్నట్లు ఉంటుంది ఆ అనుభూతి. నా ఆరా, నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది . హాలో చూడగలిగాను. ఎదుటి వారి ఆరోగ్యం, మనసులో ఉన్న భావాలను, చిత్ర రూపంలో చూడగలిగాను. మా మామయ్య డాక్టర్ వినయ్ కుమార్ ఈ విషయం పై చాలా సంవత్సరాల క్రితం పుస్తకాలు రాశారు!! పూర్వజన్మలు - పరలోకాలు, మీడియం షిప్, శ్రీబైద్యనాథోపనిషత్, పంచ యజ్ఞాలు, లార్డ్ రివీల్స్ - ట్రూత్ స్ర్టేంజర్ దాన్ ఫిక్షన్, మొదలైన చాలా పుస్తకాలు రాశారు, ఈ మిర్రర్ సాధన గురించి మొదట పరిచయం చేసింది మామయ్య గారే, ఈ సాధనకు సంబంధిత మంత్రం తో ఎన్నో వేలు జపం చేసేవాడిని. మిర్రర్ ముందు కూర్చుని. రాత్రి వేళల్లో మిర్రర్ ముందు కూర్చుని జపం చేస్తూ నిద్ర వస్తే అలాగే నిద్రించేవాడిని. దీని వల్ల సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన కొందరు మహానుభావులు పరిచయం అయ్యారు!! సూక్ష్మ శరీరము తో పూర్తి ఎరుకతో చేయగలమని అర్థం అయింది. మా కసిన్ బ్రదర్ ఉమేష్, లండన్ లో పారాసైకాలజీ లో PhD చేశారు చాలా బిజీగా ఉండే మా అన్నయ్య లండన్ నుంచి చాలా పుస్తకాలు occult science and metaphysics మరియు తాంత్ర సంబంధిత పుస్తకాలు, డాక్యుమెంట్లు పంపేవాడు. ఆ పుస్తకాలు నా సాధనకు, అధ్యయనానికి, గురువు గారి వద్ద సందేహ నివృత్తి కి మంచి అవకాశం లభించడం జరిగింది.
ఈ సాధన వల్ల థియోసఫికల్ సొసైటీలో, కీలక పాత్ర వహించిన తల్లాప్రగడ. సుబ్బారావు గారిని నా కళ్లారా చూడటం జరిగింది.
మిర్రర్ ని చూస్తూ జపం చేయడం, దాని ముందు కూర్చుని అలాగే ధ్యానం చేయడం, ఇలా కొంత కాలం (మొదట్లో) చేస్తూ ఉండగా, నాకు అద్దంలో రకరకాల రంగులు, ఆకారాలు, కొన్ని సంఘటనలు వరుస క్రమంలో, కొన్ని సార్లు పూర్తి స్థాయిలో..... ఆ సంఘటన లో నేనే ఉన్నాను అనేంత గాఢమైన స్థితిలో!! ఇంకా కొన్ని సార్లు spirits కనబడేవి. సాధన మొదటి దశలో ఉండగా కనిపించే రంగులు స్పష్టం గా ఉండేది కాదు!! మిర్రర్ ముందు కూర్చుని చూడగానే మిర్రర్ కి బదులుగా ఓ పెద్ద కాంతి వలయం గానీ పూర్తిగా ఓ ఆకారం కానీ కనబడేది. దానినే చూస్తూ ఉంటే దానికి సంబంధించిన మరో విషయం కనిపించేది!! అయితే ఈ రంగుల విషయంలో నేను చాలా కన్ఫ్యూజన్ అయ్యే వాడిని. ఎందుకు అంటే నాకు కనిపించిన రంగులు ఇంత వరకు సాధారణ నేత్రాలకు కనిపించవు. అవి. వాటికి ఏ పేరుతో పిలవాలో లేక పిలుస్తారో కూడా తెలియదు. మనకు తెలిసిన భాషలు ఆ రంగులకు పేర్లింకా పెట్టలేదు. ఈ ఆరా (Aura) గురించిన కొన్ని పుస్తకాలు కూడా చదివాను. కానీ వాటి ద్వారా నాకు పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ పుస్తకాల్లో వివరించే రంగుల గురించి నేను చూసే రంగులకు పెద్ద వ్యత్యాసం ఉంది. ఆ పుస్తకంలో కోపం వస్తే ఓ రంగంలో, కామపూరితమైన ఆలోచనలు వస్తే మరో రంగు, ప్రేమ ఉన్న వ్యక్తి ఆరా ఇంకో రంగును కలిగి ఉంటారు అని సూచించారు. కానీ నేను నా మీద నేను కొన్ని ప్రయోగాలు చేసి చూశాను. అద్దం ముందు కూర్చుని ఒకరి మీద కోపం తెచ్చుకుని చూస్తే ఎరుపు రంగు బదులు మరో రెండు రంగులు మిళితం అయి కనిపించడం జరిగింది. అలాగే ఫోన్ లో డివోషనల్ పాటలు వింటూ చూడగా మరో రంగు. భాగా వ్యాయామం చేసి చూడగా మరో మూడు రంగులు మిళితమై శక్తిని స్వీకరిస్తున్నట్లు! నిద్ర లేవగానే చూస్తే నా ప్రాణామయ కోశం కొత్త శక్తి కలిగి తేజోవంతంగా చూశాను. అలాగే ఫ్రిజ్ లో పెట్టి మూడు రోజుల పాటు ఉంచిన కూరగాయలను తీసి చూస్తే వాటి చుట్టూ ఓ విధమైన స్పటికం రూపంలో, లైట్ స్పార్క్ కనబడింది. ఇలా కొన్ని రోజులుగా చేస్తూ ఉండగా నాకు ఈ occult science కి సంబంధించిన పుస్తకాలు చదవడం మీద ఆసక్తి పోయింది. కారణం ఏమిటి? అంటే, ఇలాంటి సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా వివరించలేకపోవడం.... ఒకటైతే రెండో విషయం ఏమిటంటే వీటి గురించిన దర్శనాలు, అనుభవాలు, అన్ని కూడా వారి వారి అంతర్గత అభివృద్దిని బట్టి, కారణ శరీరం యొక్క అభివృద్దిని బట్టి, వారు చూసే దృష్టి కోణం బట్టి ఉంటుంది అని గ్రహించాను. ఈ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన విషయాలను ఓ పట్టాన ఇది ఇది అని ఇంటర్ప్రిట్ చేయడం కష్టం. ఇలా చేస్తూ ఉండగా నా తల మీద కొన్ని అంగుళాల ఎత్తు లో నాకు ఓ రోజు కొత్త రంగు కనిపించడం జరిగింది ఆరా కంటే కూడా కొంత తేజోవంతంగా, వేగంగా మారుతున్న రంగు అది. తర్వాత నేను ఆలోచించే ఆలోచనలు కూడా నాకు చిత్ర రూపంలో కనిపించడం.....
ఇలా ఒక రోజు నేను మా శ్రీనివాస్ మిత్రుడు ఇద్దరం కలిసి సినిమా కి వెళ్ళాం. కొంత సేపు చూస్తూ ఉండగా, ఆ సినిమా లో నటించిన నటీనటుల ఆరాలు కనిపించడం చూశాను. ఈ దృశ్యం చాలా వింతగా ఉంది నాకు మొదటి సారిగా చూడటం ఇలా. కొన్ని సార్లు ఆ షూటింగ్ టైంలొ వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అప్పుడు చూశాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఓ అలవాటుగా అయింది. రెండు సార్లు సినిమా చూస్తాను, ఒక సారి సినిమా ఎంజాయ్ చేయడానికి ఇంకో సారి వారి ఆరా చూడటానికి. తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చి ఇద్దరం టీ తాగడం కోసం బస్ స్టాండ్ కి వెళ్ళాం. ఆ బస్ స్టాండ్ లో ఉన్న వ్యక్తుల ఆరాలు మరో వింతైన రంగు ఉండటం చూశాను.
. నేను చూసింది ఆ పూర్తి బస్ స్టాండ్ యొక్క ఆరా ని!! ఖమ్మం నుండి వచ్చిన హైదరాబాద్ బస్సు అపుడే వచ్చింది. దాని యొక్క ఆరా భలేగా ఉంది. గొంగళి పురుగు పై ఉండే జుట్టు లాగా ఉంది ఈ బస్సు యొక్క ఆరా. మనకు తెలిసిన ఏడు రంగులు కాకుండా ఇతర రంగులు చాలా రకాలు ఉన్నాయి. ఈ రంగులు. ఇలా చూడటం నాకు అదే ఓ పనిగా పెట్టుకున్నాను. రోడ్డు మీద ఉన్న ఓ షాప్ వద్ద నిలబడి టీ తాగుతూ వచ్చి పోయే వాహనాల ఆరాలను చూడటం. ఒక చెట్టు వద్దకు వెళ్ళి దాన్ని చూస్తూ ఉండటం. తెల్లవారు జామున నిద్ర లేచి సూర్యోదయం అయే సమయం లో అనేక ప్రదేశాల యొక్క ఆరాలు చూడటానికి మన రెండు కళ్లు సరిపోవు. అలాగే శ్మశానం కి వెళ్ళి అక్కడ ఉండే కొన్ని రకాల స్పిరిట్స్ ని కూడా చూశాను. ఇలా చాలా చాలా అనుభవాలు!! ఈ ఫలితం వెనక శ్రద్ధ, దీక్ష, ఓర్పు ఉన్నాయి. నేను ఇదివరకు మా టిబెట్ లో ఉన్న మా ధ్యాన కేంద్రానికి ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు అక్కడే ఉండి ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, ధ్యాన మిత్రులతో కలసి ఈ విషయాలపై విశేషంగా చర్చించడం. నా క్లాస్ పుస్తకాలు చదవడం చేసేవాడిని. రాత్రి అంతా ధ్యానం చేయడం, జపం చేయడం ఇదే నా పని అయిపోయింది. దసరా సెలవులు రావడంతో భోజనం చేయకుండా కేవలం ధ్యానం, జపం చేస్తూ ఉండగా, అలిసి పోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని పడుకుని ఉండగా ఓ ఇద్దరు అమ్మాయిలు నా పాదాల వద్ద నిలబడి బయటకు రా, బయటకు రా..... అని పిలిచారు. వెను వెంటనే నా శరీరం నుంచి నేను పూర్తి స్పృహతో బయటకు రావడం, తర్వాత మూడో వ్యక్తి ( మగమనిషి) పేరు అప్రస్తుతం!! నాకు ఓ పుస్తకాన్ని తెరిచి చూపిస్తూ..... ఇదిగో, ఇది నీ శరీరం, ఇందులో ఇవి ఊపిరి తిత్తులు, ఇవి మూత్ర పిండాలు ఇలా ఒక్కో అవయవాల గురించి చాలా విషయాలు వివరంగా చెబుతూ..... ప్రాణామయకోశం ఇది, ఈ రంగులో ఉంది చూశావా? మనోమయ కోశం ఇది, దీని రంగు ఇలా ఉంది..... ఇలా చూపించి తిరిగి నా శరీరం లోకి వచ్చాక ఒక్క విషయం కూడా సరిగ్గా గుర్తు రాకుండా పోయింది. కొంత సమయం పాటు. ఒక రోజు ఒక వ్యక్తి ధ్యాన మందిరం లో ధ్యానం చేస్తుంటే, ఈయన ఆరా ఎలా ఉంటుందో చూద్దాం..... అని చూస్తూ ఉండగా ఆ మందిరం పై నుంచి అత్యంత స్పష్టమైన గొంతు వినబడింది. ధ్యానం చేస్తూ ఉంటే, వారి యొక్క ఆరాను చూడటం తప్పు అని!! ఆ తర్వాత ఫేయిరీస్ కోసం ఈ మిర్రర్ సహాయం తో చెట్లపై చాల ప్రయోగాలు చేస్తూ ఉంటే ఓ రోజు వర్షం కురుస్తోంది. వాతావరణం చల్లగా ఉందని, ఆ వర్షంలో తడుస్తూ ధ్యానం చేయడానికి, ఓ వేప చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెడితే, ఓ పెద్ద మనిషి పూర్తి శరీరం అంతా ఎరుపు రంగులో ఉండి దుస్తులు లేకుండా సడెన్ గా కనబడటం గమనించి, ఉన్న ఫణంగా పరుగులు తీసి, కాళ్ళకు దెబ్బలు తగిలించుకున్నాను.
మిర్రర్ ని ఓ గంటసేపు చూస్తూ నిద్ర వస్తే అలాగే కూర్చుని నిద్రించాను, కాసేపు!! తర్వాత మళ్ళీ లేచి మిర్రర్ లో చూడగానే మళ్ళీ గాఢమైన నిద్ర మత్తు వచ్చేసింది. ఎంత ప్రయత్నించినా, కళ్ళు తెరిచి చూడలేకపోయాను. కళ్ళు మూత పడ్డాయి కానీ, నాకు మిర్రర్ కనిపిస్తోంది!! ఆ మిర్రర్ ఇంకో రకంగా ఉంది! ఆ మిర్రర్ ముందు ఓ తెల్లని కాంతి ఆవరించి ఉంది!! దాన్ని అలాగే చూస్తూ ఉన్నాను!! కాసేపు అయిన తర్వాత నాలో ఏం జరిగిందో అర్థం కాలేదు, కానీ నేను ఓ అరణ్యంలో జలపాతం వద్ద ఉన్న ఓ రాతి బండ పై నిద్ర లేచాను!! ఎత్తైన కొండలు గుట్టలు, దట్టమైన అడవి, పచ్చని ప్రకృతి, అద్భుతమైన చల్లని గాలి!! వాతావరణం అద్భుతంగా ఉంది..... కొండ పై నుంచి జలపాతం!! చూడటానికి రెండు కళ్లు సరిపోవు!! ఆ అద్భుతాన్ని నా శరీరం అంతా అణువణువు అనుభూతి చెందుతోంది. పూర్తి నిశబ్దం!! నీటి తుంపరలు నా మీద పడటం వల్ల ఆ చల్లదనానికి నిద్ర లేచాను!! నేను నిలబడి ఉన్న ఫ్లేస్ కి కొంత దూరంలో ఓ చిన్న దారి కనబడింది. దాని గుండా నడిచి వెళ్ళాను. కొంత దూరం లో ఓ పెద్ద ఆలయం ఉంది!! ఏదో ఉత్సవం జరుగుతోంది!! ఆలయాన్ని చూస్తే ఈ భూమి మీద అలాంటి ఆలయం ఎక్కడా కూడా ఉండదు. అంత పెద్దది, చాలా అద్భుతంగా, సౌందర్య భరితంగా.... నయన మనోహరమైన ఆ ఆలయాన్ని చూస్తే, అక్కడే ఉండిపోయి ధ్యానం చేయాలనిపించేంతగా ఉంది. ఆలయం లో నుంచి చాలా చక్కని సంగీతం వినిపిస్తోంది. నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే, అక్కడ ఉన్న స్త్రీ మూర్తి ఒకరు నన్ను నదిలో స్నానం చేసి రండి అని చెప్పగా నేను ప్రక్కనే ఉన్న నదిలో, స్నానం చేయడానికి నదిలోకి దిగాను. వెంటనే నేను నా శరీరం లోకి వచ్చేశాను. దీని గురించి నేను చాలా చెప్పాలని ఉంది, కానీ మాటలు రావడం లేదు. ఈ ఆలయం ఎక్కడ ఉంది? అసలు ఈ భూమి మీదనే ఉందా? లేక మరో తలంలో ఉందా? అని కొన్ని రోజులుగా ఒకటికి రెండుసార్లు అదే విధంగా ధ్యానం చేస్తే చాలా రోజుల తర్వాత సరైన సమాధానం దొరికింది.

No comments:

Post a Comment

8977277742

I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA

YOGA DOING WIN LIFE

 

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS

My photo
Vijayawada, andhrapradesh, India
I AM YOGA TEACHER

paytm

Donate for our yoga center paytm : 8977277742