శాంతి కావాలంటే సహకరించడం నేర్చుకోవాలి. సహకరించడం చేతకానివారికి శాంతి ఎన్నటికీ లభించదు. ఇతరులకు శుభం జరిగితే తనకు కూడా జరిగినట్లే అని ఆనందించాలి. ఈర్ష్యపడటం,దుఃఖపడటం, నీలో అశాంతిని పెంచుతుంది. ఇతరులకు అశుభం కలిగినప్పుడు సహవేధన అనుభవించి , దానికి తగిన తోడ్పాటు ఇచ్చిన శక్తి కొద్దీ ఓదార్పు ఇవ్వాలి. దీని వలన నీలో శాంతి పెరుగుతుంది. రవ్వంతైనా ఇతరులకు కష్టం కలగాలని కోరుకోవద్దు. ఎల్లప్పుడూ శుభాన్ని కోరుకో!
పైన చెప్పిన విషయం అందరికి తెలిసిందే! అత్యంత ప్రాధమికమైన అంశాలే. చిన్నతనం నుండి ఎన్నో సార్లు విని ఉంటారు కూడా. కానీ పైన చెప్పిన విధంగా ఎన్ని సార్లు ఆచరించారో ఒకే ఒక్క సారి మీ హృదయం పై చేయి వేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోండి. చిన్న చిన్న నీతి పాఠాలను చక్కగా నేర్చుకున్న వ్యక్తి నిజంగా బుద్దిమంతుడు. ఇవి నేర్చుకోని పెద్ద వాడు నిజంగా చిన్నవారే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈర్ష, అసూయ, పోటి తత్వం ఎక్కువగా ఉంది. అశాంతికి అవకాశం ఎక్కువ. కానీ పై చెప్పిన ప్రాధమిక సూత్రాలను మర్చిపోకుండా అనుసరించే వారికి శాంతికి కొదవ ఉండదు. మహాత్ములు అందురూ ఇవి ఆచరించి చూపించారు.
No comments:
Post a Comment
8977277742