YOGA ASANAS 1

YOGA HEALTH

Friday, July 7, 2023

Thursday, May 18, 2023

YOGA ASANA SPORTS ASSOCIATION






 

 ముందు ముందు మన వద్ద ఉన్న సెలేబుల్ కాయిన్స్ అమ్ముకోవాలి అన్న లేదా ఇతరులు మన కీబో కాయిన్స్ కొనాలిఅన్న K Wallet App అవసరం, కావున ఇప్పుడు K Wallet రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, "మీ కీబో అకౌంట్ ఓపెన్ చేస్తే గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది". ప్రతి ఒక్కరూ పైన ఉన్నటువంటి వీడియోను జాగ్రత్తగా చూసి, అందరూ తప్పనిసరిగా K Wallet రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఇలా మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు 50 రూపాయల విలువైన క్రిప్టో కాయిన్ వస్తుంది, ఈ విషయాన్ని కీబో సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి చేర వేయండి. మరియు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సేవింగ్ అకౌంట్ లేని కొత్తవారికికూడా రెఫరల్ లింక్ ద్వారా రెఫర్ చేయవచ్చు ఇలా రెఫర్ చేసి రెఫరల్ బోనస్ పొందవచ్చు

https://youtu.be/vTKFVOyD_hE


Wednesday, May 17, 2023

 నేటిమాట 


☘️కర్మలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి☘️


కర్మలెన్ని ఆచరిస్తున్నా సరే తృప్తి అనేది ఎప్పటికీ కలగదు. సరిపోయినంత సంపాదించుకున్నాం. చక్కని ఇల్లు కట్టుకున్నాం. మంచి ఉద్యోగం ఉంది. బుద్ధిమంతులైన పిల్లలున్నారు అని తృప్తిపడే వాడు ఈలోకంలోనే లేడు. ఎప్పుడూ ఏదో లేని దానిని గురించే ఆలోచిస్తాడు. ఉన్నది చాలదని భావిస్తాడు. ఇంకా ఏదేదో కావాలనుకుంటాడు. తనకన్నా ఉన్నతంగా ఉన్నవాణ్ణి గురించి ఆలోచిస్తాడు. వాళ్ళతో పోలిక పెట్టుకుంటాడు. తన దగ్గర లేనివి, ఇంకొకరి దగ్గర ఉన్నవి ఏమిటో తెలిసాక ఇక ఆ లేని వాటి గురించి ఆరాటం. వాటిని సంపాదించుకోవడానికి సతమతం అవుతాడు. అది తన వల్ల సాధ్యం కాకపోతే ఇంకొకరిని దాని కోసం అభ్యర్థించడం లేదా ఇంకొకరి నుండి లాక్కోవడం. 


ఇలా కొరతలతో, కోరికలతో, అసంతృప్తితో వేగిపోతుంటాడు. ఇలా ఆంతర్యంలో అసంతృప్తితో రగిలిపోయేవాడు ఏదేదో కావాలని, ఏదేదో చేయాలని సంకల్పాలు చేస్తుంటాడు. ఈ సంకల్పాలకు అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మలు చేసినప్పుడు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. అది నీవు కోరుకున్న ఫలితం కావచ్చు, కోరుకోనిది కావచ్చు. నీకు సంతోషం కలిగించేది కావచ్చు. దుఃఖాన్ని కలిగించేది కావచ్చు. కానీ ఏదో ఒకటి వస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు కూడా. కానీ అలా వచ్చిన ఫలితాన్ని, తను చేసిన పనికి తగిన పలితాన్ని కొందరు ఒప్పుకోలేరు. మరికొందరు ఆ కర్మఫలాలను అనుభవించటం వల్ల ఆ అనుభవం  వాసనలుగా - సంస్కారాలుగా ముద్రపడతాయి. అనుభవించేది సుఖమైతే మళ్ళీ మళ్లీ అనుభవించాలని, దుఃఖమైతే రాకుండా తప్పించుకోవాలనీ నీలో ముద్రలు పడిపోతాయి. ఈ వాసనలే మళ్ళీ మళ్ళీ  కర్మలకు ప్రేరేపిస్తాయి. సుఖాన్నిచ్చే కర్మలు చేయాలని, ఇంతకు ముందు పొందిన దుఃఖాన్ని పొందకుండా ఉండే కర్మలు చేయాలని ప్రేరణలు కలుగుతాయి. దానితో మళ్ళీ కర్మలు చేస్తావు. మళ్ళీ ఫలితం వస్తుంది. మళ్ళీ అనుభవిస్తావు. మళ్ళీ వాసనలు - సంస్కారాలు పేరుకుంటాయి. ఇదొక సైకిల్.


కర్మ -కర్మఫలం - అనుభవం - వాసన - ప్రేరణ... ఇలా ఎంతకాలమైనా చేసుకుంటూ పోవటానికి శరీరం అనుమతించదు. దేహం బలహీనమై - ఏదో ఒక నాటికి రాలిపోతుంది. అయితే దేహం రాలిపోయినా మనస్సులో ముద్రలు పడిన సంస్కారాలు - వాసనలు ఎక్కడకూ పోవు. కర్మలు చేయలేక పోయినా చేయాలనే భావన (వాసన) అలాగే ఉన్నది కాబట్టి వాటిని ఖర్చు చేసుకొవడానికి  తగిన దేహాన్ని తీసుకొని మళ్ళీ ఈలోకం లోకి వస్తావు. అలా వచ్చి పూర్వ దేహంలో ఉన్నపుడు ప్రోగు చేసుకున్న వాసనల ప్రేరణతో మళ్ళీ కర్మలు చేయటం ప్రారంభిస్తావు. మళ్ళీ చక్రం తిరగటం ప్రారంభం. ఇక ఈ దేహం పోతే మరొక దేహం. ఇలా జన్మ - కర్మ - జన్మ - కర్మ వలయంలో - సుడిగుండంలో చిక్కుకొని గిరిగిర తిరుగుతూ ఉండాల్సిందే. "పునరపి జననం పునరపి మరణం పునరపిజననీ జఠరేశయనం.."  అని ఆదిశంకరులు అన్నట్లు జనన మరణ రూప సంసార చక్రంలో ఇరుక్కుపోతావు. ఇదే కర్మ మహా సముద్రం. సముద్రంలో నిరంతరం అలలు వస్తూనే ఉంటాయి, వచ్చినవి ఒడ్డుకు చేరి పడిపోతూనే ఉంటాయి. మళ్లీ వెనుక నుండి వస్తూనే ఉంటాయి. ఒక్క క్షణం కూడా ఆగే పనే లేదు. అందుకే కర్మలను - జన్మలను - ఈ సంసార చక్రాన్ని సముద్రంతో పోల్చారు. కృతి మహాదధౌ పతన కారణం - కర్మ అనే మహాసముద్రంలో పడిపోవటానికి కర్మలే కారణమౌతున్నాయి.


 మలబద్ధకం 

CONSTIPATION 

.

మలబద్ధకం అంటే ఏమిటి ? 

.

మీరు మల విసర్జనకు వెళ్ళిన సమయం లో ముందుగా మలవిసర్జన ప్రారంభం అయ్యి తర్వాత మూత్ర విసర్జన ప్రారంభం కాకపోతే మీకు మలబద్ధకం ఉంది అని ఆయుర్వేదం చెప్తుంది 

.

మలబద్ధకం వలన వచ్చే సమస్యలు ఏవి ? 

.


.

కడుపు నొప్పి, కడుపు బరువుగా ఉండడం, గ్యాస్ , తలనొప్పి, ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరం , చాలాకాలం మలబద్ధకం ఉంటె మొలలు ( మూలవ్యాది) మలద్వారం పగుళ్ళు .... ఇలా అనేక సమస్యలు వస్తాయి. దీని ప్రభావం మానసికంగా కూడా ఉంటుంద.  చిరాకు , నీరసం, ఆసక్తి లేని సంభోగం వంటి ఎన్నో సమస్యలకు ఇది కారణం అవుతుంది 

.


.

మబద్ధకానికి పరిష్కారం యోగా 

.

మీరు యోగాను అవలంబిస్తే మీ సమస్య దూరం అవుతుంది . బాబా రాం దేవ్ గారు చెప్పే ఎనిమిది ప్రాణాయామాలూ ప్రతిరోజూ చేసేవారికి ఈ సమస్య నెల రోజుల లోపులోనే పరిష్కారం అవుతుంది 

.

మీకు సమయం లేదు అనుకుంటే కనీసం  భస్త్రిక , కపాల భాతి, అనులోమ విలోమ , అగ్నిసార క్రియలను అయినా కనీసం చెయ్యండి 

.

ప్రాణాయామం అనేక పరిష్కారాలను చేస్తుంది 

.


.

సమయం లేదు అనుకుంటే ఇతర పరిష్కారాలు పాటించండి. 

అందులో కొన్ని గృహ ఉపచారాలు 

.


.

1. మీరుతీసుకునే ఆహరం లో ప్రతిరోజూ బొప్పాయి, జామ , ఆకుకూరలు ఉండేలా చూసుకోండి 

.


2. అలూవేరా జ్యూస్ త్రాగండి 

.


3. గోధన్ ఆర్క్ త్రాగండి ( పతంజలి గోధన్ ఆర్క్ బాగా పని చేస్తుంది .  మొదట్లో కొంచెం ఎక్కువ అవ్వొచ్చు.) క్రమం తప్పకుండా రోజూ తీసుకోండి. ఎక్కువ అవుతూ ఉంటె డోస్ తగ్గించండి 

.


4. ఉదయం వేడినీళ్ళు సిప్ సిప్ చేస్తూ త్రాగండి. అందులో గోధన్  ఆర్క్ కలుపుకోవచ్చు 

.


5. రాత్రి పడుకునే ముందు వేవేడి నీళ్ళల్లో  చెంచాడు త్రిఫల చూర్ణం వేసుకుని త్రాగండి 

.


6. ఇవి ఏవీ పనిచెయ్యలేదు అంటే బాబా రాందేవ్ గారి దివ్య చూర్ణం వేసుకుని  త్రాగవచ్చు 

.

.


7. ఉదయం వేడినీరు త్రాగాక ఈక్రింది  ఆసనాలు వెయ్యండి 

.


1. తాడాసనం

2. తిర్యక్ తాడాసనం 

3. కటిచక్రాసనం

4. తిర్యక్ భుజంగాసనం 

5. ఉదరాకర్షనాసనం 

.


ఈ ఆసనాల వీడియో బాబా రాం దేవ్ గారు చేసినది దీనితో పెడుతున్నాను 

.

మలబద్ధకానికి మార్కెట్ లో దొరికే చూర్ణాలు దీర్ఘకాలం వాడడం వలన పేగులు లోపల మ్యూకస్ పోర పాడయ్యి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి 

.

సమస్య తగ్గాక ఇతరులకుకూడా మీరు చెప్పండి .

YOGA DAY


 

ASANAS FORMATIONS










 

YOGA ASANAS AND FORMATIONS










 

I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA

YOGA ASANAS

 

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS

My photo
Vijayawada, andhrapradesh, India
I AM YOGA TEACHER

Goolgepay Phone pay Paytm

Donate for our yoga center paytm : 8977277742
YOGA  personal & online yoga training availability anywhere the world

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA &FITNESS CLASSES AT YOUR DOOR STEPS FROM THE POINT OF INDIAN TRADITIONAL YOGA FOCUSED AREA: GENERAL FITNESS & OBESITY(OVERWEIGHT REDUCTION) TRAINING CLASSES AT THE STUDIO COVERING ALL HEALTH PROBLEMS SPECIALIZATION : PRANAYAMA | PRANIC HEALING | MEDITATIVE