మలబద్ధకం
CONSTIPATION
.
మలబద్ధకం అంటే ఏమిటి ?
.
మీరు మల విసర్జనకు వెళ్ళిన సమయం లో ముందుగా మలవిసర్జన ప్రారంభం అయ్యి తర్వాత మూత్ర విసర్జన ప్రారంభం కాకపోతే మీకు మలబద్ధకం ఉంది అని ఆయుర్వేదం చెప్తుంది
.
మలబద్ధకం వలన వచ్చే సమస్యలు ఏవి ?
.
.
కడుపు నొప్పి, కడుపు బరువుగా ఉండడం, గ్యాస్ , తలనొప్పి, ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరం , చాలాకాలం మలబద్ధకం ఉంటె మొలలు ( మూలవ్యాది) మలద్వారం పగుళ్ళు .... ఇలా అనేక సమస్యలు వస్తాయి. దీని ప్రభావం మానసికంగా కూడా ఉంటుంద. చిరాకు , నీరసం, ఆసక్తి లేని సంభోగం వంటి ఎన్నో సమస్యలకు ఇది కారణం అవుతుంది
.
.
మబద్ధకానికి పరిష్కారం యోగా
.
మీరు యోగాను అవలంబిస్తే మీ సమస్య దూరం అవుతుంది . బాబా రాం దేవ్ గారు చెప్పే ఎనిమిది ప్రాణాయామాలూ ప్రతిరోజూ చేసేవారికి ఈ సమస్య నెల రోజుల లోపులోనే పరిష్కారం అవుతుంది
.
మీకు సమయం లేదు అనుకుంటే కనీసం భస్త్రిక , కపాల భాతి, అనులోమ విలోమ , అగ్నిసార క్రియలను అయినా కనీసం చెయ్యండి
.
ప్రాణాయామం అనేక పరిష్కారాలను చేస్తుంది
.
.
సమయం లేదు అనుకుంటే ఇతర పరిష్కారాలు పాటించండి.
అందులో కొన్ని గృహ ఉపచారాలు
.
.
1. మీరుతీసుకునే ఆహరం లో ప్రతిరోజూ బొప్పాయి, జామ , ఆకుకూరలు ఉండేలా చూసుకోండి
.
2. అలూవేరా జ్యూస్ త్రాగండి
.
3. గోధన్ ఆర్క్ త్రాగండి ( పతంజలి గోధన్ ఆర్క్ బాగా పని చేస్తుంది . మొదట్లో కొంచెం ఎక్కువ అవ్వొచ్చు.) క్రమం తప్పకుండా రోజూ తీసుకోండి. ఎక్కువ అవుతూ ఉంటె డోస్ తగ్గించండి
.
4. ఉదయం వేడినీళ్ళు సిప్ సిప్ చేస్తూ త్రాగండి. అందులో గోధన్ ఆర్క్ కలుపుకోవచ్చు
.
5. రాత్రి పడుకునే ముందు వేవేడి నీళ్ళల్లో చెంచాడు త్రిఫల చూర్ణం వేసుకుని త్రాగండి
.
6. ఇవి ఏవీ పనిచెయ్యలేదు అంటే బాబా రాందేవ్ గారి దివ్య చూర్ణం వేసుకుని త్రాగవచ్చు
.
.
7. ఉదయం వేడినీరు త్రాగాక ఈక్రింది ఆసనాలు వెయ్యండి
.
1. తాడాసనం
2. తిర్యక్ తాడాసనం
3. కటిచక్రాసనం
4. తిర్యక్ భుజంగాసనం
5. ఉదరాకర్షనాసనం
.
ఈ ఆసనాల వీడియో బాబా రాం దేవ్ గారు చేసినది దీనితో పెడుతున్నాను
.
మలబద్ధకానికి మార్కెట్ లో దొరికే చూర్ణాలు దీర్ఘకాలం వాడడం వలన పేగులు లోపల మ్యూకస్ పోర పాడయ్యి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి
.
సమస్య తగ్గాక ఇతరులకుకూడా మీరు చెప్పండి .
No comments:
Post a Comment
8977277742