YOGA ASANAS 1

YOGA HEALTH

Saturday, June 29, 2019

YOGA DAY 2019 AT PATAMATA AWARDS GIVEN BY YOGA TEACHERS






2019 YOGA DAY CELEBRATIONS AT VMC 8977277742








YOGA DAY CELEBRATIONS AT S.T.V.R.M.G.H.SCHOOL AT DURGA PURAM VIJAYAWADA 8977277742





AMARAVATHI YOGA AND AEROBICS ASSOCIATION









ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలలో వివరించిన వ్యవసాయ ముహుర్తాలు  - 

 *  శ్రవణ , ధనిష్ట, శతభిష , చిత్త, స్వాతి , విశాఖ , అనూరాధ , రేవతి , అశ్వని , పునర్వసు, మృగశిర, పుష్యమి నక్షత్రముల యందు తారాబలం చూసి డబ్బులు చెల్లించవలెను.

 *  మూల, అనూరాధ , రేవతి , స్వాతి , ఉత్తర, ఉత్తరాషాఢ , ఉత్తరాభాద్ర, పుష్యమి, శ్రవణం , విశాఖ  ఈ నక్షత్రముల యందు విత్తనాలు విత్తుకొనవలెను.

 *  బుధవారం 3 భాగములు , మంగళవారం 8 భాగములు , అదివారం 10 భాగములు, సోమవారం 16 భాగములు , శనివారం 20 భాగములు ఆయా వారాలలో గింజల రాసిని కొలిచిన నశించును. కావున గురు, శుక్రవారములలో గింజల రాసిని కొలవవలెను.

 *  స్వాతి , పుష్యమి, అశ్విని, విశాఖ, శ్రవణము, ధనిష్ట , శతభిషము, పునర్వసు ఈ నక్షత్రముల యందు ఆది, సోమ , గురు, శుక్ర, శనివారముల యందు  5 , 8 , 9 ఈ స్థానములలో పాపగ్రహములు లేని లగ్నముల యందు వ్యవసాయ  ఋణము చేసిన త్వరగా తీరిపోవును.

 *  నంద పూర్ణ తిధులు గల, గురుశుక్ర వారములు , మూల , మృగశిర, పుబ్బ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర , ఆశ్రేష , మఖ, రేవతి , విశాఖ , అనూరాధ , పునర్వసు  నక్షత్రముల యందు భూములు కొనుగోలుచేయుట , అమ్ముట శుభకరం.

 *  రేవతి , ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాబాద్ర, రోహిణి , హస్త, పుష్యమి, మూల, మృగశిర, స్వాతి , జ్యేష్ఠ, అశ్విని నక్షత్రముల యందు , గురు,శుక్ర, సోమ , బుధవారముల యందు , కన్య , కర్కాటక , మిథున, మీన , మకర లగ్నముల యందు ఏరువాక , వృక్షచేధన , బీజాలను నాటుట కార్యక్రమాలు శుభప్రదం .

 *  నంద, భద్ర తిథుల యందు , సింహ, ధనుర్లగ్నముల యందు , భరణి, హస్త, చిత్త, స్వాతి , విశాఖ , అనూరాధ , మఖ, ఆశ్రేష , ఆర్ధ , అశ్విని , పూర్వత్రయ నక్షత్రముల యందు పశువులు పశుశాలలో ప్రవేశించుట శుభకరం.

 *  ఆది , సోమ , గురువారముల యందు ఆర్ద్ర , మృగశిర , మూల, పూర్వాభాద్ర, కృత్తికా నక్షత్రముల యందు పశువులును కట్టుట శుభకరం.

 *  భరణి, ఆశ్రేష , శ్రవణము, చిత్తా నక్షత్రముల యందు , శనివారం నాడు, అమావాస్య , అష్టమి,
 షష్టి తిథుల యందు ఎద్దులు కట్టవలెను.

 *  భరణి, ఆరుద్ర, కృతిక, అనూరాధ , మూల, మఖ, పునర్వసు , చిత్త, మృగశిర ఈ నక్షత్రముల యందు , మంగళ , ఆది , శనివారముల యందు పశువులను కొనుటకు వెళ్లవలెను.

 *  స్వాతి , మూల, విశాఖ, రేవతి , శ్రవణము, జ్యేష్ట, ధనిష్ట ఈ నక్షత్రముల యందు పశువులను కొనుట శుభకరం.

 *  ధనిష్ట, జ్యేష్ట, మృగశిర, రేవతి , విశాఖ , ఆశ్రేష , మఖ, అశ్విని , పూర్వత్రయ ఈ నక్షత్రముల యందు పశువులను అమ్మినవారికి మరియు కొన్నవారికి శుభప్రదం.

 *  గురువారంతో కూడిన పుష్యమి నక్షత్రము నందు వృషభ లగ్నము నందైనను , వృషభాoశం  యందైనను  పశుశాల నిర్మించినచో మృగ, చోర బాధలు లేకుండా ఆ పశుశాల యందు ఉండు పశువులు సుఖంగా ఉంటాయి.

 *  అశ్విని, భరణి, రోహిణి , పునర్వసు , హస్త, విశాఖ , జ్యేష్ట, శతభిష , రేవతి ఈ నక్షత్రముల యందు , ఆది , గురువారముల యందు గిత్తలచే కొత్తగా దున్నించవచ్చు .

 *  8 , 4 , 9 , 14 ఈ తిథుల యందు , శనివారం నందును, భరణి, రోహిణి , చిత్త, శ్రవణము , ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాడ, ఆశ్లేష ఈ నక్షత్రముల యందు దున్నపోతులచే దుక్కి దున్నించడం మంచిది .

 *  అశ్విని, రోహిణి , మఖ, ఉత్తరాత్రయ , హస్త, చిత్త , స్వాతి , అనూరాధ , మూల, ధనిష్ట, రేవతి ఈ నక్షత్రముల యందు ఆది , మంగళ , బుధ , శుక్ర వారముల యందు 2 , 3 , 5 , 7 , 10 , 11 తిథుల యందు కొత్తభూమిలో వ్యవసాయ పని ప్రారంభించుటకు శుభకరం.

 *  విత్తనములు చల్లుట ఆరంభించిన మేషలగ్నము నందు పశునాశనం , కర్కాటకం నందు, బహుఫలం , తుల యందు ప్రాణహాని, మకరం నందు సస్యహాని, సింహ లగ్నం అందు చోరభయం , కుంభం నందు అధిక భయం , కన్య , వృషభ , మీన , మిథున , వృశ్చిక , ధనుర్లగ్నముల యందు ధాన్యసమృద్ధి , శుభప్రదం కలుగును.

 *  ఆదివారము సింహ లగ్నం నందు సర్వబీజములు చల్లవచ్చు . సోమవారం మిథున లగ్నం నందు రాజనపు ధాన్యం విత్తనాలు చల్లవచ్చు. మంగళవారము మేష , వృశ్చిక లగ్నముల యందు కొర్ర ధాన్యములను , బుధవారం మిధున, కన్య లగ్నముల యందు పోక చెట్లు తోట స్థాపించవలెను.

 *  గురవారం , ధనుర్మాసముల యందు మామిడి మొదలగు ఫలవృక్షములు నాటవలెను. శుక్రవారమున , తుల , వృషభముల యందు మల్లె మొదలగు పూలచెట్లు నాటవలెను.

 *  శనివారమున మకర , కుంభముల యందు నువ్వులు మొదలగునవి చల్లవలెను.

  ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలలో వివరించిన వ్యవసాయ ముహుర్తాలు  - 2 . 

 *  మూల, శ్రవణము, మృగశిర, పునర్వసు , ధనిష్ట , రేవతి , రోహిణి , అనూరాధ , స్వాతి , ఉత్తరత్రయ  ఈ నక్షత్రముల యందును, కర్కాటక, ధనుస్సు, తుల, వృషభము, సింహము, వృశ్చికం, కుంభం ఈ లగ్నముల యందు , బుధ , గురు, శుక్రవారముల యందు సెనగ, గోధుమ, కంది విత్తనములు చల్లుట ఫలప్రదము.

 *  శుభతిథుల యందు బుధ , గురు, సోమవారముల యందు , రోహిణి , అశ్విని, పుష్యమి, పునర్వసు , హస్త, మూల, స్వాతి, శతభిషము , ఉత్తరాత్రయము , రేవతి నక్షత్రముల యందు , కన్య, కర్కాటక, వృషభ, మిథున, మీన , మకర లగ్నముల యందు సమస్త ఫల వృక్షములు నాటవచ్చు. వివిధ విత్తనములు నాటవచ్చు , పొలము దున్నవచ్చు,  భూమి సంపూర్ణ ఫలప్రదం అగును.

 *  హస్త, చిత్త, విశాఖ , మూల, శతబిషం , స్వాతి , ఉత్తరాబాద్ర, ఉత్తరాషాడ, రోహిణి , జ్యేష్ట, అశ్విని, పునర్వసు , పుష్యమి, అనూరాధ , కృత్తిక , పుబ్బ, పూర్వాషాఢ , పూర్వాభాద్ర ఈ నక్షత్రముల యందు గురు, సోమ , బుధ , శుక్రవారముల యందు సమస్తమైన తోటలు వేయవచ్చు.

 *  పుష్యమి, అశ్విని, హస్త, మృగశిర, అనూరాధ , మూల ఈ నక్షత్రముల యందు చెరుకు తోటలు వేసిన ఫలవంతములు అగును.

 *  పుష్యమి, ఉత్తరాబాద్ర, మఖ, అశ్విని, రేవతి , అనూరాధ , ఉత్తర ఈ నక్షత్రముల యందు మేష, వృశ్చిక, వృషభ , కన్యా లగ్నముల యందు 3 , 5 , 7 , 15 తిథుల యందు , బుధ , గురు, శుక్ర వారముల యందు రేగు , అరటి, పనస , మామిడి తోటలు వేయవలెను .

 *  భరణి, శ్రవణము, స్వాతి , మఖ, మూల, రేవతి , ధనిష్ట, అశ్విని, ఈ నక్షత్రముల యందు వంగ నారు నాటినచో మంచిఫలితం కలుగును.

 *  హస్త, అశ్విని, పుష్య, ఉత్తర, ఉత్తరాషాడ , ఉత్తరాబాద్ర, రోహిణి , చిత్త, అనూరాధ , మృగశిర, రేవతి , స్వాతి , ధనిష్ట, మఖ, మూల ఈ నక్షత్రముల యందు అంట్లు కట్టినచో బాగుగా ఫలించును.

 *  స్వాతి , పుష్యమి, అశ్విని, శతబిషం , మూల, విశాఖ ఈ నక్షత్రముల యందు సమస్తమైన తీగలు పాదులు పెట్టిన బాగుగా కాయును .

 *  రేవతి , ఉత్తర, రోహిణి , పుష్య, హస్త, పునర్వసు, మూల, స్వాతి , శతబిషం , అశ్విని ఈ నక్షత్రముల యందు , సోమ , బుధ , గురు, శుక్రవారముల యందు , కన్య, కర్కాటక, మిథున,మీన , ధనస్సు , వృషభ లగ్నముల యందు , శుభ తిథుల యందు సమస్తమైన చెట్లు నాటవచ్చు. సమస్త బీజములు చల్లుటకు , పొలం దున్నుట ప్రారంభించుటకు శుభప్రదం .

 *  మృగశిర, పుష్యమి, ఆరుద్ర, అశ్విని, భరణి, స్వాతి ఈ నక్షత్రముల యందు , శుభతిథుల యందు , ఆది , మంగళ , గురువారం ల యందు పొగాకు తోటలు వేసిన చక్కగా ఫలించును.

 *  రేవతి , అశ్విని , అనూరాధ , స్వాతి , శతబిషం, పునర్వసు, జ్యేష్ట, శ్రవణం , పుష్యమి, మూల, హస్త, ఉత్తర, మృగశిర నక్షత్రముల యందు , ఆది , సోమ , బుధ , గురు , శుక్రవారముల యందు , సూర్యోదయ కాలం నందు , ఉల్లితోట, కంది తోటలు పైరు పెట్టుటకు  మంచిది .

 *  పునర్వసు , భరణి, హస్త, పుష్యమి, స్వాతి , అశ్విని, రేవతి , మూల ఈ నక్షత్రముల యందు , 2 , 3 , 5 , 7 , 10 , 13  తిథుల యందు , సోమ , బుధ , గురు, శుక్రవారముల యందు , గురు, బుధులు కేంద్రముల యందు ఉండగా ప్రత్తిపైరు పెట్టుట మేలు .

 *  పుష్యమి, అశ్విని, హస్త, మృగశిర, అనూరాధ , మూల నక్షత్రముల యందు , బుధ , గురు, శుక్రవారముల యందు , స్థిరలగ్నముల యందు , శుభతిథుల యందు ఖర్జూర,పోక , కొబ్బరితోటలు వేసినచో ఫలప్రదం అగును.

 *  మూల, ఉత్తర, ఉత్తరాషాడ , ఉత్తరాబాద్ర, శ్రవణము,మృగశిర, పునర్వసు, ధనిష్ట, రేవతి , రోహిణి , అనూరాధ , స్వాతి ఈ నక్షత్రముల యందు , స్థిర లగ్నముల యందు బుధ , గురు, శుక్ర వారముల యందు చేనుకోసి కోసిన సస్యములను కుప్పలు వేయవచ్చు .

 *  కృత్తిక , మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, హస్త, మూల , శ్రవణము , ధనిష్ట ఈ నక్షత్రముల యందు కుప్పలు నూర్చుట మంచిది .

 *  చిత్త, రేవతి , మృగశిర, అనూరాధ , అశ్విని, పుష్యమి, హస్త ఈ నక్షత్రముల యందు , సోమ , గురు, శుక్రవారముల యందు , పూర్ణ తిథుల యందు , చంద్రతారాబల యుక్తమును చూచి కొత్తగింజలు ఇంటికి తెచ్చుకొనుట మంచిది .

 *  మఖ, పుబ్బ, అనూరాధ , జ్యేష్ట, మూల, రేవతి ఈ నక్షత్రముల యందు సింహ లగ్నము నందును ధాన్యము దంచుట ఫలప్రదము .

 *  రోహిణి , ధనిష్ట, శతబిషం, ఉత్తర, ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర ఈ నక్షత్రముల యందు ధాన్యం అమ్ముట మంచిది .

 *  మంగళ , శుక్రవారములు, పూర్ణిమ, అమావాస్య , నవమి, చవితి తిథులు , గ్రహాదినములు పనికిరావు . ఈ దినములలో కాయలు కోసిన పాదులు చెడిపోవును.

 *  అశ్విని, రేవతి , అనూరాధ , హస్త, పుష్యమి, మృగశిర ఈ నక్షత్రముల యందు గానుగ మొదలుపెట్టవచ్చును.

 *  2 , 3 , 5 , 7 , 8 , 10 , 12 , 13 , 15  ఈ తిథుల యందు , గురు, శుక్రవారముల యందు, ఉత్తరత్రయ , పూర్వత్రయ, రోహిణి , మృగశిర, పుష్యమి, హస్త, చిత్త, అనూరాధ , రేవతి , అశ్విని నక్షత్రముల యందు , వృషభ, మిథున, సింహ, కన్య,ధనస్సు , కుంభ , మీన లగ్నముల యందు కొత్తగింజల రాశి కొలుచుటకు మంచిది .

 *  గురువారం , శుక్ర వారం నందు రాశి కొలుచుట మంచిది 
అత్యుత్తమ సౌందర్య సాధనాలు.!🤘
1. పెదవులకు - సత్యం.
2. కన్నులకు - దయ.
3. చేతులకు - దానం.
4. ముఖానికి - చిరునవ్వు.
5. హృదయానికి - ప్రేమ.
వీటి ద్వారా జీవితాన్ని అందంగా, ఆనందంగా మలచుకొందాం.! 
🙏జీవన ధర్మాలు.!🙏
1. ప్రార్థించే ముందు విశ్వసించాలి.
2. మాట్లాడే ముందు వినాలి.
3. ఖర్చు చేసే ముందు సంపాదించాలి.
4. ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి.
5. విమర్శించే ముందు వేచి వుండాలి.
6. ఓడిపోయే ముందు ప్రయత్నించాలి.
7. మరణించే ముందు జీవించాలి.! 🙏

 ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకోవలసిన మంచి విషయం ఈ చిన్న సంఘటనలో ఉంది. దయచేసి తప్పక చదివి షేర్ చేయగలరు.........
మన దేశానికి చెందిన ఒక ధనికుడు జపానుకు వెళ్ళాడు. మన అలవాట్ల ప్రభావం అతనిలో అలాగే ఉన్నాయి. అలవాటుగా ఒకరోజు రైలులో ప్రయాణిస్తూ.......
ఎదుటి సీటుపై కాళ్ళను విలాసంగా ఉంచి ఆనందంగా ఓ పాటను పాడుకుంటూ రైలులో
ప్రయాణిస్తున్నాడు.......అప్పుడు ఒక పెద్ద మనిషి అతని దగ్గరికి వచ్చి అతని కాళ్ళని తన ఒడిలోకి తీసుకుని ఆ సీటులో కూర్చున్నాడు. అతని చర్యకు మనవాడు ఉలిక్కి పడి అతన్ని ఇలా అడిగాడు.......
" సార్! మీరు ఎందుకు నా కాళ్ళను తీసి మీ ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు? మీ సీటును ఎందుకు వదిలి వచ్చి నేను కాళ్ళు పెట్టుకున్న సీటులోకి ఎందుకు మారారు?" అని.
దానికి ఆ జపానుదేశస్థుడు ఇలా అన్నాడు :
" సార్! మీరు మా దేశ ఆస్తిని అవమానిస్తున్నారని నాకు చాలా కోపం వచ్చింది, కానీ మీరు మా దేశానికి అతిధులు. మిమ్మల్ని నేను ప్రశ్నించకూడదు. మీరు చిన్నబుచ్చుకోవడం, బాధపడటం నాకు ఇష్టం లేక మీ కాళ్ళను నా ఒడిలో పెట్టుకుని మీకు అసౌకర్యం కలగకుండా ఉండటానికి ఇలా చేశాను " అని అన్నాడు.
మనవాడు షాక్ తగిలినట్టుగా ఉలిక్కిపడి తన తప్పును తెలుసుకుని అతన్ని క్షమించమని
అడిగాడు. దానికి అతను నవ్వుతూ............
" ఈ దేశంలో ప్రజల ధనంతో కల్పించే వసతులపై గౌరవంతో పాటు అది మా సొంత ఆస్తిగానే
భావిస్తాము. మీరుకూడా మీ దేశంలోని ప్రజలధనంతో నడిపే రైళ్ళు కానీ, బస్సులు కానీ మీ సొత్తుగా భావించండి, ఇలా కాళ్ళు పెట్టి అవమానించకండి. అలాంటి భావనమీలో కలిగినప్పుడు ఖచ్చితంగా ఇతరదేశాలకు మీరు వచ్చినప్పుడు మీరు ఇలా ప్రవర్తించరు. దయచేసి మీరు అర్థం చేసుకోగలరు కదా! " అని
అన్నాడు.  ఆ జపాను దేశస్థుడు
మెత్తగా చెప్పినా, బుద్ధివచ్చేలా చెప్పిన అతని మాటలకు మనవాడు తలదించుకోక తప్పలేదు........
ఇప్పుడు అర్థం అయిందా ఇండియా ఎందుకు అభివృద్ధి చెందలేదో! ఎన్నో కారణాలు..... అందులో ఇదికూడా ఒకటి.  ఏ గొడవలు జరిగినా ప్రభుత్వ
ఆస్తులను తగలబెడుతున్న మనం ఖచ్చితంగా మనం తగలబెట్టేది మన ఆస్తి అని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా!..

నచితే ఫార్వడ్ చెయ్యండి అని అంటా .....  కానీ ఎవరు చేయరు... ఎందుకంటే ....
మనం భారతీయులం కదా.
గర్భస్రావం నందు ఉపయోగించదగిన మూలికా యోగాలు  -

       కొంతమంది స్త్రీలకు గర్భాశయ బలహీనత వలన గాని లేదా వేరే ఏదైనా దోషాల వలన కాని తరచుగా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది. అటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికోసం ఈ పోస్టు పెడుతున్నాను.

      ఇప్పుడు నేను చెప్పబోవు యోగాలు సులభమైనవి .

 గర్భస్రావ నివారణా యోగాలు  -

 *  మేకపాలు , తామర పుష్పములు , జీలకర్ర, అశోక చెట్టు బెరడు , పిల్లిపీచర , శ్రీ గంథం , నేరేడు పండ్లు , వట్టివేళ్ళు  వీటిలో ఏ రెండింటిని గాని మూడింటిని గాని లేక అన్నింటిని గాని కలిపి చూర్ణం చేసుకుని లోపలికి తీసుకొనుచున్న గర్భస్రావం జరగటం వలన ఆరోగ్యం క్షీణించిన స్త్రీకి ఆరోగ్యం చేకూరును .

 *  గర్భస్రావం నందు నేరేడు చిగుళ్లను పాలతో నూరి జీలకర్ర చూర్ణం కలిపి సేవించవలెను .

 *  ఆముదం , పల్లేరు వేళ్ళతో కాచిన పాలలో పంచదార కలుపుకుని సేవించుచున్న గర్భస్రావం నివారించవచ్చు.

 *  అతిమధురం మరియు వాకుడు కలిపి పాలలో వేసి కాచి ఆ పాలలో పంచదార కలిపి ఇచ్చిన గర్భస్రావం నివారించబడును.

 *  శుద్ధిచేసిన అశ్వగంధ చూర్ణాన్ని రోజుకు కుంకుడు గింజ అంత ప్రమాణంలో నీటితో మింగుచుండవలెను . అలా కొన్ని వారాలపాటు చేయడం వలన వచ్చిన గర్బం నిలుస్తుంది. దీన్ని నెలలు నిండేంతవరకు వాడినను నష్టం లేదు . కొన్ని వారాల పాటు వాడాక మోతాదు సగం కుంకుడు గింజకు తగ్గించవలెను . అశ్వగంధ వేళ్ళను ఆవుపాలలో 11 సార్లు శుద్ధిచేయవలెను .

 *  పల్లేరు కాయలను చిన్నవిగాని పెద్దవిగాని చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని పాలతో కలిపి సేవించవచ్చు . మోతాదు అశ్వగంధ చూర్ణపు మోతాదు .

 *  బూరుగ జిగురు కొంచం నీటిలో తాగుచున్నను గర్భస్రావం జరగదు.

 నెలలను అనుసరించి గర్భస్రావం జరిగినప్పుడు నివారణా యోగాలు  -

 *  మొదటి నెలలో పెద్ద ద్రాక్ష , అతిమధురం , తెల్ల చందనం మరియు రక్తచందనం కషాయం .

 *  రెండొవ మాసమున తామర తుండ్లు , నాగకేసరాలు చూర్ణం కలిపి సేవించాలి .

 *  మూడొవ మాసమున చక్కెర , నాగకేసరాల చూర్ణం పాలతో కలిపి సేవించాలి .

 *  నాలుగోవ మాసమున అరటిగడ్డ , కలువ పువ్వులు , కురువేరు సమానంగా కలిపి సమానంగా పాలు కలిపి తాగించాలి .

 *  అయిదోవ మాసమున దానిమ్మ , చందనం వీటిని కలిపి నూరి ముద్దగా చేసి అందు పెరుగు మరియు తేనె కలిపి సేవించవలెను .

 *  ఆరొవ మాసమున గైరికము , చందనం , శ్రీ గంథం సమానంగా తీసుకుని పాలతో కలిపి సేవించవలెను .

 *  ఏడోవ మాసమున వొట్టివేళ్ళు , పల్లేరు , తుంగగడ్డలు , మంజిష్ట, నాగకేసరములు , పద్మాకాష్ఠములు వీని కల్కము నందు తేనె కలిపి సేవించవలెను .

 *  ఎనిమిదో మాసమున లొద్దుగ , పిప్పళ్లు వీని చూర్ణమును తేనెతో ఇచ్చి పాలు తాగించవలెను .
 పైన చెప్పిన యోగములు అన్నియు ఆయా మాసములలో గర్భస్రావం అయ్యేప్పుడు మాత్రమే ప్రయోగించడం వలన గర్భస్రావం అగును. మామూలుగా ఉన్నప్పుడు అవసరం లేదు .


      నారింజకాయల పైన పెచ్చులు నీటిలో వేసి కషాయం కాచి ఇచ్చినను గర్భస్రావం కాకుండగా ఆపవచ్చు . మోతాదు ఒక టీకప్పు .


శరీరం పైన వివిధ కారణాల వలన అనేక రకాలైన మచ్చలు ఏర్పడును . అటువంటి మచ్చలు కొరకు ఇప్పుడు నేను చెప్పబోవు యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని పాటించి సమస్య నుంచి బయటపడగలరు.

 మచ్చల నివారణాయోగాలు  -

 *  పచ్చి బొప్పాయిని గిల్లినప్పుడు వచ్చే పాలను రాయుచున్న మచ్చలు తగ్గును.

 *  అవిసె గింజల నూనెను ప్రతిరోజు రెండుపూటలా మచ్చల పైన రాయుచున్న మచ్చలు మాయం అగును.

 *  గోధుమపిండిని పులియబెట్టిన కడుగులో కలిపి మచ్చలపైన ప్రతినిత్యం పూయుచున్న మచ్చలు హరించును .

 *  జీడిమామిడి గింజల పైపెచ్చులు నలగగొడితే వచ్చే నూనెని మచ్చలపైన రాయుచున్న త్వరగా మచ్చలు హరించును .

 *  కొంచం నీటిలో పసుపు వేసి చిక్కగా కలిపి రోజూ రాయుచున్న శరీర మచ్చలు తగ్గును.

 * మంచి నాణ్యమయిన కుంకుమపువ్వు నీటితో తడిపి మచ్చల పైన పూయుచున్న మచ్చలు తగ్గును.

 *  ప్రతినిత్యం జాజికాయ అరగదీసి ఆ గంధాన్ని రెండుపూటలా మచ్చల పైన రాయుచున్న మచ్చల నివారణ అగును.

 *  నేలతంగేడు వ్రేళ్ళను తీసుకొచ్చి నీడలో ఎండించి ఎండిన వేళ్ళను నీటితో అరగదీయగా వచ్చిన గంధాన్ని మచ్చలపైన రెండుపూటలా రాయుచున్న మచ్చలు నివారణ అగును.

         నేను పైన చెప్పిన యోగాలు మచ్చల నివారణలో అత్యద్భుతముగా పనిచేయును కొన్ని రొజులపాటు విడవకుండా పాటించండి. మచ్చలు పోవడం కొంచం కష్టసాధ్యముగా ఉండును. పైన చెప్పిన ఔషధయోగాలలో మీకు సులభమయినది విడవకుండా వాడండి. తప్పక ఫలితాన్ని పొందుతారు.
విషము రెండు రకాలుగా ఉండును. అవి 

     1 - స్థావర విషము .

     2 - జంగమ విషము .

  స్థావర విషము అనగా చెట్లు వాటికి సంభంధించినవియు , గనులలో దొరుకు పాషాణములు మొదలగు ధాతువులు . ఇవి స్థిరముగా ఉండుటచేత వీటికి స్థావర విషములు అని పేరు వచ్చింది. జంగమ విషము అనగా ఒకచోట స్థిరముగా ఉండక సంచరించుచుండు జంతువుల మరియు జలచరములకు సంబంధించినది.

     స్థావర విషమునకు సంబంధించి 10 రకాల ఆశ్రయములు కలవు.  అవి 

 1 - వ్రేళ్ళు , 2 - ఆకులు , 3 - పండ్లు , 4 - పూలు , 5 - పట్టలు , 6 - పాలు , 7 - చేప , 8 - జిగురు , 9 -   ధాతువులు , 10 - దుంపలు .

    స్థావరవిషము పైన చెప్పిన 10 రకాల వస్తువులలో ఉండును. ఇప్పుడు మీకు ఒక్కొక్క దాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను .

 *  వేళ్ళ యందు విషము కలిగినవి - 

   నల్లని అతిమధురపు వేళ్లు , తెల్ల గన్నేరు వేరు , గురివింద వేరు , ఈశ్వరీ వేరు , గర్గ వేరు , మంగ చెట్టు వేరు , విద్యుచ్చిఖ వేరు , గంజాయి వేరు . ఈ చెట్లలో వేళ్లు మాత్రమే విషపూరితముగా ఉండును.

 *  ఆకుల యందు విషము కలిగినవి  - 

     విషపత్రిక , చేదువెదురాకు , టేకుఆకు , ప్రేంఖణపు ఆకు , అందుగ చెట్టు ఆకు ఈ చెట్ల ఆకులలో మాత్రమే విషము ఉండును. 

 *  ఫలముల యందు విషము కలిగినవి -

     కుముద్వతి , కనుము , ప్రేంఖణము , అందుగ , కర్కోటకము ( దీని కాయలు పాములు వలే ఉండును.) రేణుక , ఖద్యోతకము , దేవదారు , ఇభగందు , ఈశ్వరి , నందనము , సారపాకము అనే చెట్ల యొక్క ఫలముల యందు విషము ఉండును.

 *  పూల యందు విషము కలిగినవి  -

      పేము , అడివికడిమి , వాయువిడంగములు , ప్రేంఖణము , అందుగ చెట్ల యొక్క పువ్వుల యందు విషము ఉండును.

 *  పట్ట, చేవ, జిగురు యందు విషము కలిగినవి -

      ఆంత్రపాచకం , కర్తరి , సౌరీయకం , మంగ , ప్రేంఖణము , నందనము , పరాటకము అను చెట్ల యొక్క బెరడు , చేవ , జిగురు యందు విషము ఉండును.

 *  పాల యందు విషము కలిగినవి -

       కుముదగ్ని ( ఒక రకపు జెముడు ) , జాలక్షరి వంటి చెట్ల పాల యందు విషము ఉండును.

 *  ధాతువుల యందు విషము కలిగినవి -

      పాషాణం , హరితాళం అను ధాతువుల యందు విషము ఉండును.

 *  దుంపల యందు విషము కలిగినవి -

      కాలకూటం, నాభి , సర్షపము , పాలకము , కర్దిమము , వైరాటము , ముస్తకము , శృంగి విషము , పుండరీక విషము , మూలకం , హాలాహలం , మహావిషము , కర్కటకము అను చెట్ల యొక్క దుంపల యందు విషము ఉండును.

 స్థావర విషములను తినినచో కలుగు లక్షణములు -

  *  విషము కలిగింది వేర్లను తినినచో మనిషి మెలికలు తిరిగిపోయి అర్ధం పర్థం లేని మాట్లాడుచూ మైకం పొందును.

 *  విషము కలిగిన ఆకులను తినినచో వళ్ళు విరుచుకొనుట, ఆవలింతలు , శరీరం ముడుచుకొనిపోవుట, ఆయాసం వచ్చును.

 *  విషము గల ఫలములను తినినచో వృషణములు వాచుట , వళ్ళు మంటలు , అన్నము నందు ద్వేషము కలుగును.

 *  విషపు పుష్పములను తినినచో వాంతులు , కడుపుబ్బరం , మైకం కలుగును.

 *  విషపు బెరడు , చేవలు , జిగురలను తినినచో నోరు దుర్వాసనగాను , శరీరం గరగరలాడుచుండును. తలనొప్పి, నోటివెంట కఫము వెడలుచుండును.

 *  విషము కలిగిన పాలను తాగినచో నోటివెంట నురగలు వచ్చును. విరేచనములు అగును. నాలుక వంకరపోవును .

 *  ధాతు సంబంధ విషములను తినినచో గుండె యందు బాధ , మూర్చ, దవడల యందు మంట కలుగును.

 *  విషపు దుంపలలో కాలకూట విషము తినినచో స్పర్శజ్ఞానం పోవును . శరీరం వణుకుట , గట్టిగా బిగదీసుకుపోవుట కలుగును.

 *  నాభిని తినినచో మెడ బిగుసుకుపోయి మలమూత్రాలు పచ్చగా వెడలును. కండ్లు పచ్చగా ఉండును.

 *  సర్షప విషము తినినచో వాతము చెడి కడుపుబ్బును. శరీరం అంతటా కణుతులు లేచును . పాలకము అను విషమును తినినచో మెడ వాలిపోయి మాట పడిపోవును .

 *  కర్దము అను విషము తినినచో నోటివెంట నీరు కారును . నీళ్ల విరేచనములు అగును. కండ్లు పచ్చబడును.

 *  వైరాటం అను విషమును తినినచో ఒళ్ళు నొప్పులు , తలనొప్పి కలుగును.

 *  ముస్తక విషము తినినచో శరీరం బిగుసుకుపొయి శరీరబలం తగ్గును. శరీరం మంటలు , కడుపుబ్బరం ఉండును.

 *  పుండరీక విషము తినినచో కండ్లు ఎర్రగా ఉండి కడుపుబ్బు కలుగును.

 *  మూలక విషము తినినచో శరీరం రంగు మారును . వాంతులు , ఎక్కిళ్లు , వాపు , మైకం కలుగును.

 *  హాలాహల విషము తినినచో శరీరపు రంగు నల్లగా మారును . ఊపిరి ఆగిఆగి పీల్చుచుండును.

 *  మహావిషము తినినచో హృదయము నందు కణితి బయలుదేరును . విపరీతమైన గుండెనొప్పి వచ్చును.

 *  కర్కట విషము తినినచో మనిషి ఎగిరెగిరి పడుచుండెను . పండ్లు పటపట కోరుకుచుండెను. నవ్వుచుండెను .

        తరవాతి పోస్టులో పెట్టుడు మందు మరియు దాని విషప్రభావం గురించి వివరిస్తాను .
గరవిషము (పెట్టుడు మందు ) గురించి సంపూర్ణ వివరణ  - దుషఫలితాలు  - చికిత్సలు .

   గరవిషమునకు మరొక పేరే పెట్టుడు మందు. ఇది కృత్రిమ విషము . ఈ గర విషమును స్వలాభపరులైన కొంతమంది స్త్రీలచేత పురుషులకు , పురుషుల చేత స్త్రీలకు ఇతర ఆహారపదార్థాలలో కలిపి పెట్టుచుందురు. దీనిని కృత్రిమంగా తయారుచేయుట వలన కృత్రిమ విషం అని అందురు. దీనిని చేతిగోళ్ళు , రజస్సు, వెంట్రుకలు , వివిధ జంతువుల అవయవములు , మలములు , కొన్ని ఔషధ భస్మములు , అల్పవీర్యములు కలిగిన స్థావర, జంగమ విషముల నుంచి కలిపి తయారుచేయును .

 కృత్రిమ విషము సేవించిన వానికి కలుగు ఉపద్రవములు  -

 *  పాండురోగం వచ్చి శరీరం నానాటికి కృశించిపోవును.

 *  అగ్నిమాంద్యం కలిగి జీర్ణశక్తి తగ్గును.

 *  దగ్గు, ఆయాసం , జ్వరం కలిగి దానివలన వాతము ప్రతిలోమముగా ఉండి అతినిద్ర, విచారం కలుగును.

 *  స్ప్లీన్ మరియు కాలేయం చెడి ఉదరరోగములు కలిగి కడుపుబ్బరం , కాళ్లుచేతులు సన్నగిల్లును. బలహీనత కలుగును.

 *  క్షయరోగం కలిగి దుస్వప్నములు కలుగును.

           ఒక్కోసారి ఈ ఉపద్రవములతో పాటు ఇతరవ్యాధులు కూడా సంభవించి రోగి మరణించవచ్చు. అందువలన కృత్రిమ విషములు సేవించినవానికి వెంటనే చికిత్స చేయవలెను .

 శరీరం నందు కృత్రిమ విషము ఉన్నదో లేదో తెలుసుకొనుటకు పరీక్ష  -

      కుడి అరచేతిని గుంటలా చేసి దాని యందు కాకరాకు పసరు కాని పత్తి చెట్టు ఆకు పసరు కాని పోసి కొంచం సేపు ఉంచి అరచేతిని వంచిన ఆ పసరు గడ్డలా మారి కిందపడును.

       పైన చెప్పిన విధముగా జరిగినచో ఆవ్యక్తి శరీరం నందు కృత్రిమవిషము ఉన్నట్టుగా పరిగణించి వెంటనే చికిత్స ప్రారంభించవలెను .

 చికిత్సలు  -

 *  కృత్రిమ విషము తినినవారికి వెంటనే వమనము చేయించి తామ్రభస్మమును తేనెతో కలిపి ఇచ్చినచో హృదయము శుద్ది అగును. తదుపరి స్వర్ణభస్మమును ఇవ్వవలెను. పథ్యకరమైన ఆహారములు ఇవ్వవలెను.

 *  హేమామాక్షిక భస్మము , స్వర్ణభస్మము తేనె మరియు పంచదారతో కలిపి నాకించవలెను.

 *  చాగ , తిప్పతీగ , గ్రంధితగరం , పిప్పళ్లు , చేదు పొట్ల , చవ్యము , చిత్రమూలం , వస , తుంగముస్తలు , వాయువిడంగములు వీటన్నింటిని సమానభాగాలుగా తీసుకుని చూర్ణం చేయవలెను . ఆ చూర్ణమును మజ్జిగతోగాని , గోరువెచ్చటినీటితో కాని , పెరుగు మీద తేటతోగాని , నిమ్మకాయ రసం వంటి పుల్లటి రసములతోగాని ఇచ్చిన విషము వలన అగ్నిమాంద్యం శమించును .

 *  పావురం యొక్క మాంసం , కచ్చోరములు , పుష్కరమూలం వీటన్నింటిని సమభాగాలుగా తీసుకుని ఒక పాత్రలో వేసి పైనచెప్పిన వాటి నాలుగు రెట్లు నీరుపోసి బాగా చిక్కగా అయ్యేంతవరకు కషాయం కాచి చల్లారిన తరువాత లోపలకు ఇవ్వవలెను . దీనివలన కృత్రిమ విషము , దప్పిక, దగ్గు, ఆయాసం , ఎక్కిళ్లు , జ్వరం హరించును .

 కృత్రిమ విషము తిన్నవారికి ఆయా లక్షణములకు స్వర్ణభస్మంతో చికిత్స -

 *  పాండురోగమునకు పునర్నవ , ద్రోణపుష్పి , కాకజంగల వీని చూర్ణ అనుపానములతో స్వర్ణభస్మం ఇవ్వవలెను .

 *  అగ్నిమాంద్యమునకు ఉత్తరేణి చెట్టు సమూలరసముతో స్వర్ణభస్మం ఇవ్వవలెను.

 *  దగ్గు, ఆయాసం , జ్వరములకు సరస్వతి , శంఖపుష్పి , అడ్డసరం  స్వరసముతో కలిపి స్వర్ణభస్మమును ఇవ్వవలెను.

 *  ఉదరరోగములకు వెంపలి , వావిలి , భృంగరాజ , పునర్నవ చెట్ల స్వరసముతో స్వర్ణభస్మం ఇవ్వవలెను .

 *  క్షయరోగమునకు అమృతపాశ ఘృతము , చ్యవనప్రాశ లేహ్యము , వాసవలేహ్యములలో స్వర్ణభస్మం కలిపి ఇవ్వవలెను. 

          పైన చెప్పిన విధముగా చికిత్సలు అందించిన కృత్రిమ విషము తినినవాని ప్రాణములు రక్షించవచ్చు . ఇక్కడ ఒక్కటి ముఖ్యముగా గమనించవలసిన విషయం ఏమిటంటే నిత్యం స్వర్ణభక్షణ చేయువానికి ఎటువంటి విషాలు ఏమి చేయలేవు . స్వర్ణభస్మం అనుభవపూర్వక వైద్యులను సంప్రదించి వారి సూచనతోనే వాడవలెను. ఖరీదు ఎక్కువుగా ఉండును. కావున తగినంత స్థోమత కలిగినవారు తప్పక వాడండి.

కాలసర్పదోషం
 పై ఎన్నో అనుమానాలు మరి అనుమానాలు తీరడానికి మరి కొంతమంది జ్యోతిష్యులు సర్ప దోషం లేదు అంటారు మరి కొన్ని ఆధారాలు చూసినట్టయితే రాహు కేతు కుండలిలో బాగాలేకపోవడం మరి రాహు దశ కేతు దశ లేదా నవగ్రహ దశలో అంతర్దశలో రాహు కేతు దశ నడిచిన అది రాహు కేతు దోషం కాలసర్ప దోషం కింద నిర్ణయించ బడుతుంది అయితే వీరు ఛాయా గ్రహాలు అని కొందరు అంటారు మరి ఛాయా గ్రహాల నీడ పడిన గ్రహాలు కలిసిన అది కాలసర్ప దోషం అంటే కుండలిలో ఏ శుభ గ్రహం తో నైనా రాహు కేతువులు కలిసినట్టు అయితే అది కాలసర్ప దోషం గా పరిగణించ బడుతుంది మరి ఒక్క స్థానం బట్టి ఆయా కాలసర్ప దోషాలు ఏ స్థానంలో ఉంటే ఆస్థాన పైన అది ప్రభావం చూపుతుంది అది ఎలా అంటే కొంత మందికి అది వివాహంపై కొంతమందికి విద్యపై కొంతమంది ఎంత కష్ట పడ్డ అభివృద్ధి చెందారు అన్నిట్లో అపజయం పొందుతారు కొంతమంది ఆత్మహత్య యత్నం కూడా చేస్తారు సాధారణంగా సూర్యుడు చంద్రుడికి కూడా ఈ బాధ తప్పలేదు దానిని మనం గ్రహణం అంటాం అది ఏ రాశిలో ఉంటే ఆ రాశిపై గ్రహణ ప్రభావం ఉంటుంది అలాంటి ది దేవతలకే తప్పలేదు మనం ఎంత వాళ్ళం మా అనుభవంలో చూసినట్టయితే ఎంతోమంది కాల సర్ప పూజ చేసినంతనే వివాహం అభివృద్ధి విద్యా విజయo  జరుగుతుంది అయితే చెప్పేది ఏంటంటే దగ్గరలో ఉన్న  జ్యోతిష్యుడితో దీని గురించి తెలుసుకొని ముఖ్యంగా రాహు కేతు దశలో ఖచ్చితంగా రాహు కేతు పూజ చేయించండి స్తోమత  తో ఉన్నవారు కాలసర్ప దోష శాంతి చేయించుకోండి దానివల్ల మనకు సత్ ఫలితాలు వస్తాయి మరి చెప్పే జ్యోతిష్కుడు ఏదైనా ఉపాసకుడు అయి ఉంటే చాలా మంచిది మనం చేసేది ఒక్కటే మరి గురువును సరైన వాళ్లను చూసుకోవాలి. ఇంకా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది సుబ్రహ్మణ్య పాశుపత పూజ ఉంటుంది అది నీ పురోహితులతో చేయించుకోండి. సుబ్రహ్మణ్యం ని నాగ రూపకంగా కొందరు భావిస్తారు మనకు అక్కడక్కడ దేవాలయాలు ఉంటాయి మనం చూసినట్లయితే సంతానం కలగడానికి కూడా కొన్నిసార్లు నాగదోషం అడ్డు పడుతుంది మరి వీర్యకణాలు నాగుల రూపంగా  ఉండటం ఆధునిక పరిశోధనలులలో వెల్లడి జరిగాయి 

కాలభైరవాష్టకం 

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ |
శరీరంలో అధికవేడిని హరించుటకు యోగాలు -

      కొన్ని సందర్భాలలో శరీరం అత్యథిక వేడికి గురవుతుంది. దీనికి కారణం సరైన సమయానికి భోజనం చేయకపోవడం , నిద్ర తక్కువపోవడం , సరైన ఆహారపదార్థాలు తీసుకోకపోవడం , మద్యపానం , ధూమపానం వంటి వాటివల్ల శరీరం అత్యధిక వేడికి గురగును. మూత్రం మంటగా రావటం , పసుపుపచ్చని మూత్రం , మూత్రం వాసన రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి . శరీరంలో అధికవేడి పెరిగినప్పుడు మూత్రపిండాలు మరియు కాలేయ సమస్యలు కలుగును.

        ఇప్పుడు నేను చెప్పబోవు యోగాలు పాటించటం వలన శరీరం నందలి అధికవేడి తగ్గును.

  అతివేడి నివారణా యోగాలు  -

 *  ఒక గ్లాసు నీటిలో చెంచాడు రుద్రజడ గింజలు లేక సబ్జాగింజలు పావు గంటసేపు నానబెట్టి అందులో కొంచం బెల్లంగాని , పంచదారగాని కలుపుకుని తాగాలి . అలా రోజూ చేస్తుంటే శరీరంలో అధికవేడి తగ్గును.

 *  కర్బుజా పండ్లుగాని , పుచ్చకాయలు ప్రతిరోజు విరివిగా తినుచున్న శరీరంలోని అధికవేడి నివారణ అగును.

 *  నిమ్మపండ్ల రసాన్ని సేవించుచున్న వేడితగ్గును . ప్రతిరోజు మూడునిమ్మపండ్ల రసం తాగవలెను .

 *  మజ్జిగని ప్రతిపూట తాగుచుండవలెను .

 *  పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజు తినవలెను .

 శరీరంలో అతివేడి తగ్గుటకు నేను ప్రయోగించిన సిద్దయోగం  -

         రాత్రి సమయంలో రెండు కప్పుల అన్నాన్ని ఒక గిన్నెలో వేసి అది మునిగేంత వరకు వేడివేడి పాలు పోయాలి . కొంచం గోరువెచ్చగా అయ్యిన తరువాత పెరుగు వేసి తోడుపెట్టవలెను . ఉదయానికి మంచిగా తోడుకొని ఉండును. దానికి కొంచం ఉప్పు కలిపి నీరుల్లిపాయను ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను ఇలా 20 నుంచి 30 రోజులపాటు చేయవలెను .

         పైన చెప్పిన విధముగా చేసినచో అతిత్వరగా శరీరం నందలి వేడి తగ్గును.

 శరీరం నందలి అతివేడి ఉన్నవారు తీసుకొకూడని ఆహారాలు  -

 కోడి మాంసం , పాతపచ్చళ్లు , మినుములు , ఉలవలు , మద్యము , చేప , కాకరకాయ , మసాలా పదార్థాలు  , అల్లం , వెల్లుల్లి , నూనె వేపుళ్లు , టీ , కాఫీ , గోధుమలు , కందులు , బెల్లం , శనగలు , వేరు శనగలు వంటి వాటికి దూరంగా ఉండవలెను .
సంస్కృత భాష - భవిష్యత్తు :

ప్రస్తుతం సంస్కృత భాష ఆధారంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని ఆసక్తికర విషయాలు. 

ఈరోజు ఒక పెద్దాయనతో మాట్లాడటం జరిగింది. ఆయన అమెరికాలో ఉంటారు. IT లో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నో పటేంట్లు ఆయన సొంతం. ఆయన అంచనా ప్రకారం మరో 10 - 15 సం. లలో కోడింగ్ కి సంస్కృత భాష వాడటం మొదలవుతుంది. ఇప్పటికే గూగుల్ వంటి కంపెనీలు, మన సంస్కృత పండుతులకి IT సంబంధిత పరిజ్ఞాన్నాన్ని నేర్పుతున్నారట. నమక, చమకాలు వంటి వంటి మీద పాండిత్యం ఉన్న పండితులని వాళ్ళు తమ సంస్థలో చేర్చుకుంటున్నారు. అంతే కాకా కృత్రిమ భాషానువాదం మీద జరుగుతున్న పరిశోధనలలో కూడా సంస్కృతం ప్రధాన పాత్ర పోషిస్తోంది అని రాజీవ్ మల్హోత్రా గారు ఎన్నో సందర్భాలలో చెప్పారు. అది సాధ్యపడితే, భాషతో సంబంధం లేకుండా ప్రపంచంలోని ఏ ఇద్దరు వ్యక్తులైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. మనం ఏ భాషలో మాట్లాడినా అవతలి వ్యక్తి దానిని ఏ భాషలో వినాలి అనుకుంటే ఆ భాషలో వినవచ్చు. ఇక అప్పుడు ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎందుకూ ఉపయోగపడదు. ఇది కూడా బహుశా మరో 10 - 20 సం. లలో సాధ్యపడవచ్చు. 

అయితే మనం యోగా లానే విదేశీయులు గుర్తించే వరకూ సంస్కృతాన్ని గుర్తించమా? లేదా యోగా విషయంలో చేసిన పొరపాట్లు సంస్కృతం విషయంలో జరగకుండా చూసుకుంటామో చూడాలి. యోగా పేరున ఒక్క అమెరికాలో మాత్రమే దాదాపు సంవత్సరానికి లక్ష కోట్ల వ్యాపారం జరుగుతోంది. అందులో భారతీయ సంస్థల పాత్ర నామ మాత్రం. కనీసం, సంస్కృత భాష, ఆయుర్వేదం, యజ్ఞం వంటి విషయాలలో అయినా మనం మరింత చొరవతీసుకొని, వాటి వలన లభించే వ్యాపార ప్రయోజనాలని, దాని వలన జరిగే సంపద సృష్టిని, ఉద్యోగాలని ఎక్కువ శాతం ప్రయోజనం చేసుకునేలా ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
ఒకటి మాత్రం నిజం, మన ప్రభుత్వాలు చొరవ తీసుకున్నా తీసుకోకపోయినా అవి ఎలానూ ఈరోజు, కాకపోతే రేపైనా విశ్వవ్యాప్తం అవుతాయి. అందులో సందేహం లేదు. 

మీ పిల్లలకి సంస్కృతం నేర్పండి. సంస్కృత భాషా పరిజ్ఞానం బహుశా మరో 10 - 20 సం. లలో గొప్ప వరం అవుతుంది. ఈ విషయంలో సంస్కృత భారతి వారు విశేషమైన కృషి చేస్తున్నారు. అది కుదరని పక్షంలో తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చే పాఠశాలలో అయినా చేర్చండి. కొన్ని పాఠశాలలో చివరికి తెలుగుని కూడా ఇంగ్లీష్ లోనే బోధిస్తున్నారట. కేవలం ఇంగ్లీష్ రావడం అనేది గొప్పగా మన తరువాతి తరాల వారు భావించరు. నిజానికి అది ఇప్పుడు కూడా నిజం కాదు. మరో 15 - 20 సం. లలో ఇంగ్లీష్ రావడమే గొప్పగా భావించడం అనేది మానసిక బానిసత్వ లక్షణంగా పరిగణింపబడుతుంది
* అండవాతము - అండవృద్ధి  - Hydrocele . 

      వృషణములలో రెండుగాని ఒకటికాని వాపు కలిగి ఉండుట పోటు కలిగియుండుట . వాత ప్రకోపం చేత పొత్తికడుపులో చెడునీరు పుట్టి అది క్రమముగా వృషణాలలోకి దిగి పెరిగెడి రోగం . 

 *  అంతర్వ్రుద్ధి  - Hernia .

      వాతమును ప్రకోపింపచేయు పదార్దాలు అధికంగా భుజించుట వలన , మలమూత్ర వేగమును నిరోధించుట వలన , అతి బరువు మోయుట వలన వాతం ఎక్కువ అయ్యి సన్నపేగులో ఒక భాగం సంకోచింపచేసి తన స్థానం నుండి క్రిందికి వెడలి గజ్జ యందు చేరి గ్రంథిగా రూపం పొంది వాపును కలిగించు రోగం 

 *  అగ్నిమాంద్యం - 

        జఠరాగ్ని మందం అయ్యి ఆకలి లేకుండా ఉండుట . 

 *  అతిమూత్రము  - 

         శరీరంలో మేహం అధికం అయ్యి మూత్రం విస్తారంగా పొయ్యే రోగం . 

 *  అతిసారం  - 

        అమితముగా , వికృతముగా విరేచనములు అయ్యే రోగం . 
 * అనాహం  - 

         మూత్రం బంధించబడి కడుపు ఉబ్బే రోగము .

 *  అపస్మారం  -  Hysteria .

        స్మృతి లేక నోటి వెంట నురుగు పడటం మొదలగు చిహ్నాలు గల రోగం . మరియు స్త్రీలకు వచ్చెడి కాకిసోమాల అనే మూర్ఛరోగం .

 *  అభిఘాత జ్వరం  - 

       కర్రలు , రాళ్లు మొదలగు వాటితో దెబ్బలు తగులుట చేత , మన శరీర సామర్ధ్యం కంటే అధికంగా పనిచేయుట వలన , అతిగా దూరం నడుచుట వలన వచ్చెడి జ్వరం .

 *  అశ్మరీ రోగం  - Blader Stones .

       మూత్రకోశము నందు రాళ్లు పుట్టుట వలన మూత్రము వెడలుట కష్టం అగు రోగము 

 *  అస్థిగత జ్వరం  - 

        శరీరం నందు ఎల్లప్పుడూ ఉంటూ దేహమును క్షీణింపజేయు జ్వరం.

 *  అస్రుగ్ధము  -  లeucorrhoea .

       కుసుమరోగము అని కూడా అంటారు . యోని వెంట తెల్లగానైనా , ఎర్రగానైనా , పచ్చగానైనా , నల్లగానైనా జిగటగా నీరు స్రవించెడి రోగము .
 *  ఆమము  - 

        భుజించెడి పదార్దాలు జీర్ణముగాని కారణంబున గర్భమున జిగురు కలిగి తెల్లగా , బిళ్లలుగా ఘనీభవించెడి దుష్ట జలము.

 *  ఆమాతిసారము - Dysentery . 

       ఆమమే విరేచనమయ్యే రోగము . దీనినే జిగట విరేచనాలు అని , ఆమ విరేచనాలు అని అంటారు.

 *  ఆర్శరోగము  - PIలES . 

       మూలవ్యాధి అని అంటారు. గుద స్థానం న లోపల కాని , వెలుపల గాని మాంసపు మొలకలు జనియించి రక్తము స్రవించుచు గాని స్రవించక గాని నొప్పిని కలిగించు రోగము .

  *  ఆహిక జ్వరం  -  Intermittent fever .

        దినము విడిచి దినము లేక మూడు దినములకు ఒకసారి కాని అప్పుడప్పుడు కనిపించే జ్వరం .

  *  ఉదర రోగము - Ascites . 

        శరీరం కృశించుట , తెల్లబారుట , కడుపులో దుష్టపు నీరు చేరి ఉదరము పెరుగుట మొదలగు చిహ్నములు గల రోగము 

  *  ఊపిరిగొట్టు నొప్పి - 

         గాలి విడిచినప్పుడు గుండెలలో ఒకపక్క పోటు పొడిచినట్టు లేచేడి నొప్పి .
*  ఎరుగు వాతము  - 

         కాళ్ళు , చేతులు మొదలగు అవయవములు గాని  దేహము అంతయు గాని ఎగురుచుండెడి ఒక విధమైన వాత రోగము .

 *  కరపాణి కురుపులు  - 

        బిడ్డల యెక్క కాళ్ళమీద , చేతుల మీద దట్టముగా అయ్యేడి కురుపులు . 

 *  కామిల రోగము - కామెర్లు - Jaundice . 

      కండ్లు , శరీరం , ఆకుపచ్చ లేక పసుపుపచ్చ వర్ణము కలిగి ఆకలి లేకుండా ఉండుట , దాహము , నీరసము మొదలగు లక్షణాలు కలిగి ఉండే రోగము . 

 *  కార్శ రోగము -  Emaciation 

       దేహము నందు ఉండేడి రక్తమాంసములు క్రమక్రమముగా క్షీణించుచూ వుండేడి ఒక రోగము దీనిని ఎండురోగం అని అంటారు.

 *  క్రిమి రోగము  -  Intestinal woms .

        గర్భమున క్రిములు జనించెడి రోగము .

 *  గండమాల  -  Goitre or Scrofuja .

        మెడ , మెడ వెనక నరము , మెడ పక్కలనుండి గ్రంధులుగా మొదలు అయ్యి క్రమముగా పక్వము అయ్యి చీము , రసి స్రవించెడి వ్రణములు అనగా గడ్డలు .
*  గళ గ్రహము  - 

         స్వరహీనంబై ఆహారాది పదార్ధాలను సులభముగా కంఠం దిగనివ్వకుండా ఉండేడి ఒక శ్లేష్మ రోగము .

 *  గాయపు సంధి - Tetanus .

        కాలి బ్రొటనవేలుకు గాని , చేతి బ్రొటనవేలుకు గాని గాయము తగిలినప్పుడు ,శస్త్ర చికిత్సల యందు దుష్ట క్రిమి ప్రవేశించుట చేత మెడ కొంకులు కుంచించుకు పోయే రోగము .

 *  గాలి బిళ్లలు - Mumps . 

         చెవులకు క్రిందుగా వాపు , పోటుతో లేచేడి బిళ్లలు .

 *  గురదాలు -  Kidneys .

        వీటిని ఉలవకాయలు అందురు. ఇవి నడుముకి సమముగా లొపల వెన్నునంటి ఉండేడు మాంస గ్రంధులు. వీనివలన మూత్రము జనించును.

 *  గుల్మము - internel Tumors .

        వాత , పిత్త , శ్లేష్మముల దుష్ట స్థితి వలన గర్భము న జనించెడి ద్రవకూటమి .

 *  గ్రహణి  - Dysentry .
కడుపునొప్పి , ఆసనము తీపు కలిగి చీము లేక చీము రక్తము మిశ్రమమై విరేచనములు అయ్యేడి ఒకరకం అయిన అతిసార రోగము .

  *  చర్ది రోగము - trendency to vomit .

       వమన రోగము అని అంటారు. వాంతులు ఎక్కువుగా అవుతాయి .

 *  చర్మ రోగము  - 

       గజ్జి , చిడుము , పొక్కులు , తామర మొదలగు రోగములు .

 *  చిట్ల ఫిరంగి  - a severe kind of syphilis .

        దేహమున నల్లగా స్ఫోటకపు పొక్కుల వలే బయలుదేరేడి సవాయి రోగము .

 *  జలోదరము -  Abdomanal dropsy or Ascitis .

        గర్భమున అమితముగా విషపు నీరు పెరిగి పొట్ట నిండు కుండలా ఉండేడి రోగము .

 *  జిహ్వదోషము  - Tongue diesease .

       నాలుక ద్రవహీనం అయ్యి ముండ్ల వలే గరుకు  కలిగి యే వస్తువు రుచింపకుండా ఉండుట .

 *  త్రయాహికా జ్వరం - Tertain fever .

       మూడు దినములకు ఒకసారి వచ్చెడి చలి జ్వరం .

 *  నాడి వ్రణము  - Guinea worm .

        నారీ కురుపులు అనికూడా అంటారు.వీని నుండి తెల్లని దారము వలే నారి బయటకి వెళ్ళును.

 *  పరిణామ శూల  -  

        ఆహారం జీర్ణం అయ్యే సమయంలో జనించెడి నొప్పి . 

 *  పలల మేహము  - 

         చిన్న చిన్న మాంసపు ముక్కలు మూత్రం వెంట పడే రోగము .

 *  పక్షవాతము  - పరాలైసిస్ .

       శరీరం యొక్క బాగం అనగా ఒకవైపు చెయ్యి , కాలు వీనికి వ్యాపించిన నరములకు సత్తువ లేకుండా చేయు రోగము .

 *  పాండురోగము  -  Anemia .

       దేహము న రక్తము క్షయించి తెల్లబారి ముఖము , కనురెప్పలు , పాదములు , గుహ్యస్థలము నందు వాపు కలిగి ఉండేడి రోగము . 

 *  పీఠికా మేహము  - one type of syphilis .

       దేహము అంతా మట్టిపొక్కులుగా లేచేడి మేహరోగము .
*  పీనస  -  Ozoena .

       ముక్కువెంట దుర్గంధముతో చీము , రక్తము వెడలె ఒక రోగము .

 *  ప్లీహారోగము  - Enlargement of Spleen .

       కడుపులో బల్ల పెరిగి కలిగెడు రోగము.

 *  పుట్ట వ్రణము  -  Cancer .

        సెలలు వేసే మానని మొండి వ్రణము . 

 *  పురాణ జ్వరం  - Chronic Fever . 

         చాలాకాలం నుంచి ఉండేడి జ్వరం .

 * బాలపాప చిన్నెలు  - Convulsion of Children . 

         శిశువులకు 12 సంవత్సరాల లోపున అకస్మాత్తుగా మూర్చవలె కనిపించే రోగము .

 * భగందరము  - Fistula .

        వృషణాలు కు దిగువున , గుదస్థానముకి పైన చిన్న కురుపువలె లేచి అది పగిలి అందులో నుంచి రసి , చీము కారెడి రోగము .

 *  మూత్రశ్మరీ  - 

          మూత్రపు సంచిలో రాళ్లు పుట్టెడు రోగం .

 *  మూత్రఘాతం  - 
మూత్రం బంధించుట . మలమూత్ర , శుక్లములు పొత్తికడుపులో చేరి వికృతిని పొంది ముత్ర నిరోధము కలిగి అందువలన మూత్రం అతికష్టముగా బయటకు వెడలు మేహ రోగము .

 *  మూత్రకృచ్చం  - 

          మూత్రము బొట్టుబొట్టుగా నొప్పితో వచ్చు రోగము . ఈ రొగికి శుక్లము మూత్రముతో బయటకి వచ్చును. 

 *  మేఘరంజి  - 

          నీటితో కూడిన మేఘము ఆకాశమున కప్పి ఉన్నప్పుడు శ్వాస పీల్చడం కష్టముతో కూడుకుని ఉండు ఒకరకమైన ఉబ్బస రోగము . 

 *  క్షయ రోగము  - 

          ఈ రోగమును ముఖ్యముగా కాస , శ్వాస , కఫము , జ్వరం , దేహము శుష్కించుట , నీరసం , ఏది తిన్నా రుచి లేకుండా ఉండటం , ఆకలి లేకపోవడం ఈ రోగ లక్షణాలు .

 *  రక్తపైత్యం  - 

          ముక్కువెంట గాని , నోటివెంట గాని అకస్మాత్తుగా రక్తం ప్రవహించెడి రోగము . 

 *  రక్తవాతం  - 

          దీనిని వాత రక్తం అని అంటారు. రక్తం సహజముగా ప్రవహించక దేహమున ఏ భాగం నందు అయినా కూడి వాపు , ఎరుపు , పోటు కలిగి ఉండటం మొదలగు బాధలు కలిగి ఉండు ఒక రోగము . *  రుద్రవాతము  - 

         హఠాత్తుగా మూర్చరోగము వలే స్మారకం లేక పడిపోవడం . నోటివెంట నురుగులు వెడలుట , అంగవైకల్యం కలుగుట ఇలాంటి లక్షణాలు కలిగిన రోగము 

 *  లూతము  - 

          కంటి కోన వద్ద పుట్టెడు రోగము .

 *  వలీఫలితము  - 

          బాల్యము నందే శరీరం ముడతలు పడుట , వెంట్రుకలు నెరియు వ్యాధి . 

 *  విద్రది  - 

         గర్భము నందు పుట్టి నాభిలోకి వెడలు వ్రణము .

 *  విషజ్వరము  - 

        ఒకప్పుడు ఉష్ణం అధికంగా ఉండి మరియొకప్పుడు ఉష్ణము లేకుండా ఒక సమయం లేకుండా వచ్చు జ్వరం.

 *  విసర్పి  - Herpes .
 ఎర్రగా కాని తెల్లగా కాని పొక్కులు ఒకచోట గుంపుగా లేచి వ్యథతో గూడిన చర్మరోగము . దీనినే సర్పి అందురు. 

 *  శిల్ప కుష్ఠు  - 

       రాళ్లు వలే గరుకుగా గ్రంధులు లేచేడు కుష్ఠు రోగము . 

 *  శూల - Sposmodic colic . 

        కడుపులోగాని , పక్కలోగాని హటాత్తుగా వచ్చే కఠినమైన నొప్పి.

 *  శ్వేత కుష్ఠు  -  లeucoderma . 

       తెల్లని మచ్చలు బయలుదేరి వ్యాపించెడి కుష్ఠు రోగము . 

  *  స్వరభంగ రోగము  - 

        స్వరము క్షీణించి పోయెడి రోగము లేక గొంతు బొంగురుగా మారి స్వరం పలకని రోగము . 

 * నఖ బేధము  -

        చేతిగోళ్ళు , కాలి గోళ్లు నెర్రలు వచ్చుట .

 *  పాదశూల  -

          పాదముల యందు గాని , పాదముల పైభాగము నందు గాని విపరీతమైన నొప్పి లేక పోటు .

 *  గృధ్రసీవాతం - sayatika  

          పిరుదల యందు ప్రారంభం అయ్యి క్రమముగా వీపు , తొడలు , మోకాళ్లు , పిక్కలు , పాదములు వీటన్నింటి యందు భరించలేనంత బాధ మరియు తిమ్మిరి కలిగించు సమస్య.
*  ఉరుస్తంభము  -

           తొడలు బిగుసుకొనిపొయి ఏ మాత్రం కదిలించలేని సమస్య.

 *  ఊరుపాదము  -

            తొడలు చచ్చుబడి సన్నగా అవ్వటం.

 *   గుదభ్రంశము  - prolopse of rectum .

             మలమార్గమగు గుదము కిందికి జారుట.

 *    వృషణోక్షేపము  - 

          వృషణాలు తమ స్థానం నుంచి పైకి పీక్కొని పోవుట . ఇటువంటి పరిస్థితి అత్యంత తీవ్ర జ్వరంలో సంభవించును .

 *   ఖంజత్వం  - 

           కుడి కాలు లేదా ఎడమకాలో ఏదో ఒకటి పనిచేయకుండా పోవుట .

 *  కుబ్జత్వం -

            దీనిని గూని అని పిలుస్తారు . పృష్ఠభాగము నందలి స్నాయువులు సంకోచముచే శరీరావయములు ముడుచుకు పోయి వంకర అగుట.

 *  హృదయ శైధిల్యము -

           హృదయము నందలి మాంస పొరలు ( Heart muscle fibers ) శైథిల్యం చెందుటచేత అనగా పట్టు తప్పుటచేత దడ (palpitation ) వచ్చును. ఇది శరీరంలో ఓజస్సు క్షీణించడం వలన సంభంవించును. హృదయం పెరుగుట కూడా జరుగును.

 *  వక్షోద్ధర్షము  - 

             హృదయము యొక్క స్పందన అధికం అవ్వడం వలన వక్షస్థలం (chest ) అంతయు అదిరినట్లు లేక వణుకుడు అగుట.

 *  గ్రీవస్థంభము  - 

             మెడ భాగము నందు వాతం అధికం అయ్యి మెడ పట్టుకొనిపోవుట .

 *  అపభాహకము  -   పై చేతులు (upper arms ) ఎండిపొయినట్లు అయ్యి సన్నబడటం .

 *  అక్షితోదము  - 

           నేత్రముల యందు సూదితో పొడిచినట్లు విపరీతమైన బాధ .

 *  వర్త్మ స్తంభము  - 

            కనురెప్పలు మూసుకుని పోకుండా తెరుచుకొని ఉండటం.

 *  అర్ధితము  - 

             ముఖములో సగభాగం చచ్చుబడిపోవుట దీనిని ఆంగ్లము నందు Facial Paralysis అని అంటారు.

 *  గ్లాని  - Fatigue or Asthenia .

            శరీర అవయవములు అన్నియు క్రియారహితములు అయ్యి వడలినట్లు ఉండటం.

 *  కేశభూమిస్పటనము  -

           తల మీది చర్మం బీటలుగా మారుట .

 *  ఆక్షేపకము  -

           శరీరము నందలి అవయవాలు విసిరినట్లు లేదా కొట్టుకొనినట్లు అగుట.

 *  దండకం  - శరీరం ఎటూ కదలకుండా కఱ్ఱవలె బిగుసుకొనిపోవడం .

 *  శ్వావారుణావ భాసత్వము  -

            చర్మము , పెదవులు , వ్రేళ్లు మొదలగునవి నలుపు , ఎరుపు వర్ణములలోకి మారుట .

          పైన చెప్పినవే కాకుండగా మరెన్నో రోగములు మనుష్యునకు జనియించును. స్థలాభావం వలన కొన్నింటి గురించి మాత్రమే మీకు వివరిస్తున్నాను .

     చివరగా ఒక్క మాట మనుష్య శరీరమే రోగాల పుట్ట . మనకి భగవంతుడు ఇచ్చిన ఈ కొద్ది సమయములోనే ఎన్నో దుష్టకార్యాలు చేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకొవడం జరుగుతుంది. మనకి ఉన్న కొంచం సమయాన్ని అయిన మనచేత సత్కార్యాలు చేయించవలసిందిగా ఆ పరమేశ్వరుడిని ప్రార్ధించుదాం . ఇది కేవలం నాయొక్క అభిప్రాయం మాత్రమే ...

        పైన చెప్పినవాటిలో కొన్ని సమస్యలుకు  చికిత్సలు నా గ్రంథాలలో వివరించాను .





I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA

YOGA ASANAS

 

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS

My photo
Vijayawada, andhrapradesh, India
I AM YOGA TEACHER

Goolgepay Phone pay Paytm

Donate for our yoga center paytm : 8977277742
YOGA  personal & online yoga training availability anywhere the world

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA &FITNESS CLASSES AT YOUR DOOR STEPS FROM THE POINT OF INDIAN TRADITIONAL YOGA FOCUSED AREA: GENERAL FITNESS & OBESITY(OVERWEIGHT REDUCTION) TRAINING CLASSES AT THE STUDIO COVERING ALL HEALTH PROBLEMS SPECIALIZATION : PRANAYAMA | PRANIC HEALING | MEDITATIVE