శరీరంలో అధికవేడిని హరించుటకు యోగాలు -
కొన్ని సందర్భాలలో శరీరం అత్యథిక వేడికి గురవుతుంది. దీనికి కారణం సరైన సమయానికి భోజనం చేయకపోవడం , నిద్ర తక్కువపోవడం , సరైన ఆహారపదార్థాలు తీసుకోకపోవడం , మద్యపానం , ధూమపానం వంటి వాటివల్ల శరీరం అత్యధిక వేడికి గురగును. మూత్రం మంటగా రావటం , పసుపుపచ్చని మూత్రం , మూత్రం వాసన రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి . శరీరంలో అధికవేడి పెరిగినప్పుడు మూత్రపిండాలు మరియు కాలేయ సమస్యలు కలుగును.
ఇప్పుడు నేను చెప్పబోవు యోగాలు పాటించటం వలన శరీరం నందలి అధికవేడి తగ్గును.
అతివేడి నివారణా యోగాలు -
* ఒక గ్లాసు నీటిలో చెంచాడు రుద్రజడ గింజలు లేక సబ్జాగింజలు పావు గంటసేపు నానబెట్టి అందులో కొంచం బెల్లంగాని , పంచదారగాని కలుపుకుని తాగాలి . అలా రోజూ చేస్తుంటే శరీరంలో అధికవేడి తగ్గును.
* కర్బుజా పండ్లుగాని , పుచ్చకాయలు ప్రతిరోజు విరివిగా తినుచున్న శరీరంలోని అధికవేడి నివారణ అగును.
* నిమ్మపండ్ల రసాన్ని సేవించుచున్న వేడితగ్గును . ప్రతిరోజు మూడునిమ్మపండ్ల రసం తాగవలెను .
* మజ్జిగని ప్రతిపూట తాగుచుండవలెను .
* పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజు తినవలెను .
శరీరంలో అతివేడి తగ్గుటకు నేను ప్రయోగించిన సిద్దయోగం -
రాత్రి సమయంలో రెండు కప్పుల అన్నాన్ని ఒక గిన్నెలో వేసి అది మునిగేంత వరకు వేడివేడి పాలు పోయాలి . కొంచం గోరువెచ్చగా అయ్యిన తరువాత పెరుగు వేసి తోడుపెట్టవలెను . ఉదయానికి మంచిగా తోడుకొని ఉండును. దానికి కొంచం ఉప్పు కలిపి నీరుల్లిపాయను ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను ఇలా 20 నుంచి 30 రోజులపాటు చేయవలెను .
పైన చెప్పిన విధముగా చేసినచో అతిత్వరగా శరీరం నందలి వేడి తగ్గును.
శరీరం నందలి అతివేడి ఉన్నవారు తీసుకొకూడని ఆహారాలు -
కోడి మాంసం , పాతపచ్చళ్లు , మినుములు , ఉలవలు , మద్యము , చేప , కాకరకాయ , మసాలా పదార్థాలు , అల్లం , వెల్లుల్లి , నూనె వేపుళ్లు , టీ , కాఫీ , గోధుమలు , కందులు , బెల్లం , శనగలు , వేరు శనగలు వంటి వాటికి దూరంగా ఉండవలెను .

No comments:
Post a Comment
8977277742