YOGA HEALTH

Saturday, June 29, 2019

విషము రెండు రకాలుగా ఉండును. అవి 

     1 - స్థావర విషము .

     2 - జంగమ విషము .

  స్థావర విషము అనగా చెట్లు వాటికి సంభంధించినవియు , గనులలో దొరుకు పాషాణములు మొదలగు ధాతువులు . ఇవి స్థిరముగా ఉండుటచేత వీటికి స్థావర విషములు అని పేరు వచ్చింది. జంగమ విషము అనగా ఒకచోట స్థిరముగా ఉండక సంచరించుచుండు జంతువుల మరియు జలచరములకు సంబంధించినది.

     స్థావర విషమునకు సంబంధించి 10 రకాల ఆశ్రయములు కలవు.  అవి 

 1 - వ్రేళ్ళు , 2 - ఆకులు , 3 - పండ్లు , 4 - పూలు , 5 - పట్టలు , 6 - పాలు , 7 - చేప , 8 - జిగురు , 9 -   ధాతువులు , 10 - దుంపలు .

    స్థావరవిషము పైన చెప్పిన 10 రకాల వస్తువులలో ఉండును. ఇప్పుడు మీకు ఒక్కొక్క దాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను .

 *  వేళ్ళ యందు విషము కలిగినవి - 

   నల్లని అతిమధురపు వేళ్లు , తెల్ల గన్నేరు వేరు , గురివింద వేరు , ఈశ్వరీ వేరు , గర్గ వేరు , మంగ చెట్టు వేరు , విద్యుచ్చిఖ వేరు , గంజాయి వేరు . ఈ చెట్లలో వేళ్లు మాత్రమే విషపూరితముగా ఉండును.

 *  ఆకుల యందు విషము కలిగినవి  - 

     విషపత్రిక , చేదువెదురాకు , టేకుఆకు , ప్రేంఖణపు ఆకు , అందుగ చెట్టు ఆకు ఈ చెట్ల ఆకులలో మాత్రమే విషము ఉండును. 

 *  ఫలముల యందు విషము కలిగినవి -

     కుముద్వతి , కనుము , ప్రేంఖణము , అందుగ , కర్కోటకము ( దీని కాయలు పాములు వలే ఉండును.) రేణుక , ఖద్యోతకము , దేవదారు , ఇభగందు , ఈశ్వరి , నందనము , సారపాకము అనే చెట్ల యొక్క ఫలముల యందు విషము ఉండును.

 *  పూల యందు విషము కలిగినవి  -

      పేము , అడివికడిమి , వాయువిడంగములు , ప్రేంఖణము , అందుగ చెట్ల యొక్క పువ్వుల యందు విషము ఉండును.

 *  పట్ట, చేవ, జిగురు యందు విషము కలిగినవి -

      ఆంత్రపాచకం , కర్తరి , సౌరీయకం , మంగ , ప్రేంఖణము , నందనము , పరాటకము అను చెట్ల యొక్క బెరడు , చేవ , జిగురు యందు విషము ఉండును.

 *  పాల యందు విషము కలిగినవి -

       కుముదగ్ని ( ఒక రకపు జెముడు ) , జాలక్షరి వంటి చెట్ల పాల యందు విషము ఉండును.

 *  ధాతువుల యందు విషము కలిగినవి -

      పాషాణం , హరితాళం అను ధాతువుల యందు విషము ఉండును.

 *  దుంపల యందు విషము కలిగినవి -

      కాలకూటం, నాభి , సర్షపము , పాలకము , కర్దిమము , వైరాటము , ముస్తకము , శృంగి విషము , పుండరీక విషము , మూలకం , హాలాహలం , మహావిషము , కర్కటకము అను చెట్ల యొక్క దుంపల యందు విషము ఉండును.

 స్థావర విషములను తినినచో కలుగు లక్షణములు -

  *  విషము కలిగింది వేర్లను తినినచో మనిషి మెలికలు తిరిగిపోయి అర్ధం పర్థం లేని మాట్లాడుచూ మైకం పొందును.

 *  విషము కలిగిన ఆకులను తినినచో వళ్ళు విరుచుకొనుట, ఆవలింతలు , శరీరం ముడుచుకొనిపోవుట, ఆయాసం వచ్చును.

 *  విషము గల ఫలములను తినినచో వృషణములు వాచుట , వళ్ళు మంటలు , అన్నము నందు ద్వేషము కలుగును.

 *  విషపు పుష్పములను తినినచో వాంతులు , కడుపుబ్బరం , మైకం కలుగును.

 *  విషపు బెరడు , చేవలు , జిగురలను తినినచో నోరు దుర్వాసనగాను , శరీరం గరగరలాడుచుండును. తలనొప్పి, నోటివెంట కఫము వెడలుచుండును.

 *  విషము కలిగిన పాలను తాగినచో నోటివెంట నురగలు వచ్చును. విరేచనములు అగును. నాలుక వంకరపోవును .

 *  ధాతు సంబంధ విషములను తినినచో గుండె యందు బాధ , మూర్చ, దవడల యందు మంట కలుగును.

 *  విషపు దుంపలలో కాలకూట విషము తినినచో స్పర్శజ్ఞానం పోవును . శరీరం వణుకుట , గట్టిగా బిగదీసుకుపోవుట కలుగును.

 *  నాభిని తినినచో మెడ బిగుసుకుపోయి మలమూత్రాలు పచ్చగా వెడలును. కండ్లు పచ్చగా ఉండును.

 *  సర్షప విషము తినినచో వాతము చెడి కడుపుబ్బును. శరీరం అంతటా కణుతులు లేచును . పాలకము అను విషమును తినినచో మెడ వాలిపోయి మాట పడిపోవును .

 *  కర్దము అను విషము తినినచో నోటివెంట నీరు కారును . నీళ్ల విరేచనములు అగును. కండ్లు పచ్చబడును.

 *  వైరాటం అను విషమును తినినచో ఒళ్ళు నొప్పులు , తలనొప్పి కలుగును.

 *  ముస్తక విషము తినినచో శరీరం బిగుసుకుపొయి శరీరబలం తగ్గును. శరీరం మంటలు , కడుపుబ్బరం ఉండును.

 *  పుండరీక విషము తినినచో కండ్లు ఎర్రగా ఉండి కడుపుబ్బు కలుగును.

 *  మూలక విషము తినినచో శరీరం రంగు మారును . వాంతులు , ఎక్కిళ్లు , వాపు , మైకం కలుగును.

 *  హాలాహల విషము తినినచో శరీరపు రంగు నల్లగా మారును . ఊపిరి ఆగిఆగి పీల్చుచుండును.

 *  మహావిషము తినినచో హృదయము నందు కణితి బయలుదేరును . విపరీతమైన గుండెనొప్పి వచ్చును.

 *  కర్కట విషము తినినచో మనిషి ఎగిరెగిరి పడుచుండెను . పండ్లు పటపట కోరుకుచుండెను. నవ్వుచుండెను .

        తరవాతి పోస్టులో పెట్టుడు మందు మరియు దాని విషప్రభావం గురించి వివరిస్తాను .

No comments:

Post a Comment

8977277742

I AM QUALIFIED QUALIFIED THE QUALITY COUNCIL OF INDIA

DM qYoga formation

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA & FITNESS CLASSES AT YOUR DOOR STEPS

My photo
Vijayawada, andhrapradesh, India
I AM YOGA TEACHER

Goolgepay Phone pay Paytm

Donate for our yoga center paytm : 8977277742
YOGA  personal & online yoga training availability anywhere the world

PLEASE CONTACT Mr.DHEERAJ @8977277742 FOR YOGA &FITNESS CLASSES AT YOUR DOOR STEPS FROM THE POINT OF INDIAN TRADITIONAL YOGA FOCUSED AREA: GENERAL FITNESS & OBESITY(OVERWEIGHT REDUCTION) TRAINING CLASSES AT THE STUDIO COVERING ALL HEALTH PROBLEMS SPECIALIZATION : PRANAYAMA | PRANIC HEALING | MEDITATIVE